Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
ఇంటింటా జ్వరాలు
తెలంగాణ రాష్ట్రంలో వైరల్‌తో పాటు మలేరియా, డెంగీ విజృంభణ
జలుబు, దగ్గు, గొంతునొప్పితో తీవ్ర వేదన
నివారణ చర్యలే మేలంటున్న వైద్య నిపుణులు
ఈనాడు,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలకు జ్వరమొచ్చింది. పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. గత పదిరోజుల్లో రాష్ట్రంలోని దాదాపు ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులున్నారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చిన్న పిల్లలున్న ఇంట్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులతో మంచాలకే పరిమితమవుతున్నారు. సాధారణంగా సీజనల్‌గా కనిపించే వైరల్‌ జ్వరాలతో పాటు మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో విషజ్వరాల బారినపడి మృతిచెందిన వారూ ఉన్నారు.

పెరుగుతున్న జ్వరపీడితులు: ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే గత వారం రోజులుగా సుమారు 500కిపైగా జ్వరపీడితుల కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. కడెం మండలంలో ఇద్దరు, బెల్లంపల్లి మండలంలో ముగ్గురు వారం రోజుల్లో విష జ్వరాలతో మృతి చెందారు. చెన్నూరు, పూటపల్లి, దిలావర్‌పూర్‌ మండలాల్లో వాంతులు, విరేచనాలు, జ్వరాలతో పడకెక్కుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గత మూణ్నాలుగు రోజుల్లోనే దిలావర్‌పూర్‌లో సుమారు 50 మందికి పైగా రిమ్స్‌లో చికిత్సలు పొందినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని గుండాల కాలనీ, కొమ్ముగూడెం, తిప్పనపల్లి, వాజేడు, తులసిపాక, చినపాక.. తదితర ప్రాంతాల్లోనూ జ్వర పీడితులు ఎక్కువవుతున్నారు. గుమ్మడిదొడ్డి గ్రామంలో వాంతులు, జ్వరాలతో ఆదివాసీ గిరిజనులు మంచాలకే అతుక్కుపోతున్నారు. ఖమ్మం జిల్లాలో గత మూడు నెలల్లో 31 డెంగీ కేసులు నమోదవగా, ఇందులో 20 కేసులు గుండాల కాలనీలోనే గుర్తించారు. ఇక్కడ ఇటీవల విష జ్వరాలతో ఆరుగురు మృత్యువాతపడ్డారు. తిప్పనపల్లి తండాలో అయితే ప్రతి ఇంటా జ్వరపీడితులే. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో ఒక్క నెలలోనే 60కిపైగా డయేరియా కేసులు నమోదయ్యాయి. ఈ మండలంలోని కోయిలసాగర్‌ గ్రామంలో ఇద్దరు చిన్నారులు విష జ్వరాల బారినపడి ఇటీవలే మృతిచెందారు. చిన్నచింతకుంట మండలంలో ఇప్పటి వరకూ 100కి పైగా విష జ్వరాల కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వరంగల్‌ జిల్లాలో చిట్యాల, కొత్తగూడెం, గూడురు, ఆత్మకూరు మండలాల్లో డెంగీ జ్వరాల బారినపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నల్గొండ జిల్లాలో దేవరకొండ మండలం, నాగార్జున సాగర్‌ ప్రాంతాల్లో విష జ్వరాలు అధికంగా ఉన్నాయి.

ప్రైవేట్‌ ఆసుపత్రులకు పరుగులు: జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు.. తదితర లక్షణాలు కనిపించగానే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. పల్లెల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కనీసం రోజుకు 50-60 మంది జ్వర పీడితులు వస్తున్నట్లు అంచనా. ముఖ్యంగా చిన్న పిల్లల ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. రక్తపరీక్షల్లో ప్లేట్లేట్ల సంఖ్య తగ్గిపోయినట్లు వెల్లడవుతుండడంతో రోగుల్లో ‘డెంగీ’ భయం పెరుగుతోంది. దీనికి కొందరు ప్రైవేటు వైద్యులు సొమ్ముచేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

నివారణ చర్యలతోనే వ్యాధులు దూరం: ‘‘రక్తంలో ప్లేట్లేట్ల సంఖ్య లక్ష కంటే తగ్గుతుంటే పరిశీలనలో ఉంచాలని, 20వేలకు పడిపోతే అత్యవసర స్థితిగా గుర్తించాలని, అంతేగానీ లక్షకుపైగా ప్లేట్లేట్లు ఉన్నప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేద’’ని ప్రముఖ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎంవీ రావు చెప్పారు. చిగుళ్ల నుంచి రక్తంకారడం, మలంలో రక్తం పడుతుండడం, రక్తపోటు పడిపోవడం, రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతం తగ్గడం, పొట్టలో నొప్పి, ఆపస్మారక స్థితికి చేరుకోవడం.. ఇవీ డెంగీలో అత్యవసర చికిత్సకు గుర్తించాల్సిన లక్షణాలని ఆయన పేర్కొన్నారు. తాగునీరును మరగబెట్టి, చల్లార్చి తాగడం, తాజా ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినడం, బయట రోడ్లు మీద ఆహారాలను తీసుకోకపోవడం, దోమల కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడడం.. వంటి నివారణ చర్యల వల్ల విష జ్వరాల బారినపడకుండా జాగ్రత్తపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. పంచాయతీల్లో పారిశుధ్యం కనుమరుగవుతోంది. మురుగునీరు రోడ్లపైనే విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. తాగునీటి పంపుల వద్ద నీరు నిల్వ ఉండడంతో కలుషితమవుతున్నాయి. దోమలు విజృంభిస్తున్నాయి.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net