Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
ఆకర్షణ యోగం.. అభివృద్ధి మంత్రం
స్మార్ట్‌ నగరాలకు మోగనున్న నగారా
నేడు మూడు బృహత్‌ పథకాలకు శ్రీకారం
ప్రారంభించనున్న ప్రధాని మోదీ
గరాలకు ఆకర్షణ యోగం.. ఆధునిక వసతులు, సౌకర్యాలను సాంకేతికతతో మేళవించి ప్రపంచస్థాయికి తీర్చిదిద్దే బృహత్‌ సంకల్పం. పౌరసేవల నుంచి పన్ను వసూళ్ల వరకు అన్నింటికీ జవాబుదారీగా, తాగునీటి సరఫరా నుంచి మురుగునీటిపారుదల వరకు వసతుల కల్పనలో మేటిగా తీర్చిదిద్దే ప్రణాళికా మంత్రంగా.. నగరాల అభివృద్ధికి నేడు నగారా మోగనుంది. మోదీ సర్కారు ప్రణాళికల్లో కీలకమైన ఈ లక్ష్యాల సాధనకు నేడు బీజం పడనుంది. ఆకర్షణీయ నగరాలు (స్మార్ట్‌సిటీస్‌ ప్రాజెక్టు), అటల్‌ పట్టణ రూపాంతరీకరణ పునరుజ్జీవన పథకం (అమృత్‌), అందరికీ ఇళ్లు (ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన) పేరిట మూడు భారీ పథకాలకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీకారం చుట్టనున్నారు. కేంద్రం, నగరపాలక సంస్థలు కీలక భాగస్వాములుగా సాగే ఈ ప్రాజెక్టుల్లో అవసరాన్ని బట్టి ప్రైవేటు సంస్థలకూ స్థానం కల్పించనున్నారు. యువతను ఆకర్షించేలా సాంకేతికత, ఉపాధి చూపేలా పారిశ్రామికాభివృద్ధి, కొత్త ఆలోచనల కోసం ఇంక్యుబేషన్‌ కేంద్రాల ఏర్పాటు ఈ ప్రగతిపథకంలో కీలక ప్రాధాన్యాలు. పేదల కోసం చౌకగృహాలు, స్థితిమంతులకు ఆకాశహర్మ్యాల నిర్మాణం.. పర్యాటకమో, పారిశ్రామికమో ఏదో ఒక రంగంలో అభివృద్ధి సాధించడం..ప్రజారక్షణ, పౌరసేవల మెరుగుదల, వేగవంతం, సురక్షితమైన ప్రజారవాణా, ఇంధన వనరుల వినియోగం, పర్యావరణ పరిరక్షణ.. ఇలా నగరాలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ఈ పథకాలను రూపొందించారు. ఆకర్షణీయ నగరాలుగా మార్చే క్రమంలోనూ.. మార్చిన తర్వాతా ప్రతి అడుగులోనూ సాంకేతికతకు పెద్ద పీట వేయనున్నారు. మొబైల్‌ అప్లికేషన్లు, అంతర్జాలం వంటి సమాచార సాంకేతికతకు తోడు సామాజిక మాధ్యమాలూ మెరుగైన ప్రజాజీవనానికి బాటలు వేసేలా తీర్చిదిద్దనున్నారు. తెలంగాణ నుంచి రెండు నగరాలు, 15 పట్టణాలకు ఈ జాబితాలో చోటు దక్కనుంది. తద్వారా కొత్త రాష్ట్రంలో పట్టణవాసం సకల వసతులతో అలరారే దిశగా అడుగులు పడనున్నాయి.
త్రికరణ వృద్ధి
పట్టణాలు, నగరాల అభివృద్ధికి 3 ప్రత్యేక పథకాలు
ధునికత, ఆకర్షణల కలబోతగా.. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పట్టణాలు, నగరాల సర్వతోముఖాభివృద్ధికి మోదీ సర్కారు నడుం బిగించింది. వసతుల కల్పనలో, సౌకర్యాల వినియోగంలో, సేవలు అందించడంలో సాంకేతికత మేళవించి వాటిని ప్రగతికి చిరునామాలుగా మార్చేందుకు సన్నద్ధమవుతోంది. దేశంలో నగరాలు, పట్టణాల రూపురేఖల్ని మార్చడమే లక్ష్యంగా మూడు భారీ పథకాలకు ప్రధాని మోదీ గురువారం శ్రీకారం చుట్టనున్నారు. రాజకీయ పలుకుబడి, ఒత్తిడికి తావులేకుండా కేవలం అర్హతలే ప్రామాణికంగా నగరాలు, పట్టణాలను ఇందుకు ఎంపిక చేయాలన్నది మోదీ దృఢసంకల్పం. ఉపాధి, పెట్టుబడులు, పారిశ్రామికంగా అభివృద్ధి.. స్మార్ట్‌ అప్లికేషన్ల ద్వారా మెరుగైన పౌరసేవలు, ప్రజల రక్షణ కీలకాంశాలుగా ఈ పథకాలను అమలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ నగరంతోపాటు 15 పట్టణాలకు వీటిలో లబ్ధి కలగనుంది.
ఆకర్షణీయ నగర కార్యక్రమం
ప్రాజెక్టు వ్యయం : రూ.48వేల కోట్లు; అభివృద్ధి చేసే నగరాలు : 100
తెలంగాణలో
కర్షణీయ నగరాల్లో తెలంగాణ నుంచి రెండు నగరాలకు చోటు దక్కనుంది. హైదరాబాద్‌తోపాటు వరంగల్‌కు ఈ జాబితాలో స్థానం కల్పించనున్నారు. ఖమ్మం, కరీంనగర్‌, రామగుండం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లకు స్మార్ట్‌ నగరాలుగా ఎంపికయ్యేందుకు అర్హతలున్నాయి.
అమృత్‌
బడ్జెట్‌ : రూ.50వేల కోట్లు
పథకం అమలయ్యే పట్టణాలు, నగరాలు : 500
నగరానికి ఉండాల్సిన ప్రధాన అర్హత : లక్షకు పైగా జనాభా

తెలంగాణలో
లక్షజనాభా దాటినవి : 12
(మరో మూడు పట్టణాల్లో తాజా లెక్కల ప్రకారం లక్ష జనాభా దాటిందని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది)
ప్రాథమిక అంచనా మేరకు ఆమోదం : 15
లక్ష జనాభా దాటిన నగరాలు, పట్టణాలు...
నగరాలు: హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, రామగుండం, ఖమ్మం, నిజామాబాద్‌ కార్పొరేషన్లు.
మున్సిపాలిటీలు: జగిత్యాల, సిద్దిపేట, ఆదిలాబాద్‌, మంచిర్యాల, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం: 2007లో ప్రారంభమైన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం నేటికీ కొనసాగుతోంది. ఈ పథకం కింద పనులు చాలా సగంలోనే ఉన్నాయి. 2017 నాటికి వీటిని పూర్తిచేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టింది. రూ.36వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు పదేళ్ల కాలం పట్టనుంది.

అమృత్‌ కింద చేపట్టే పనులు
* తాగునీటి సరఫరా
* మురుగునీటి పారుదల
* వరదనీటి కాలువల నిర్మాణం
* గృహ నిర్మాణం
* మురికివాడల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు
* రోడ్లు, వంతెనల నిర్మాణం
* బీఆర్‌టీఎస్‌, ఎమ్మార్టీస్‌ పట్టణ రవాణా ప్రాజెక్టులు
* పట్టణాల్లో ఈ-పరిపాలన

ఎంపిక కావాలంటే! చేపట్టాల్సిన సంస్కరణలు
* తాగునీటి రుసుము విధాన సవరణ
* విద్యుత్తు, తాగునీటికి వినియోగం మేరకు రుసుములు
* ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో పెట్టుబడులతో అభివృద్ధి
* స్మార్ట్‌సిటీకి క్రెడిట్‌
* పట్టణాల్లో భూముల వినియోగం పెంపు
* పౌర సేవా పత్రం అమలు
* కనీస పెట్టుబడుల కింద సొంత నిధులుండాలి

ఉండాల్సిన అర్హతలు
* 2011 జనాభా లెక్కల మేరకు వ్యక్తిగత మరుగుదొడ్ల లోటులో కనీసం 5 శాతం పూరించాలి
* ఈ-పరిపాలన కింద ఫిర్యాదుల పరిష్కారం
* వెబ్‌సైట్లో బడ్జెట్‌, ఖర్చుల వివరాలు
* స్మార్ట్‌సిటీల నిర్మాణానికి ప్రత్యేక సంస్థలు
* స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయాలంటూ సంబంధిత మున్సిపాలిటీల తీర్మానం
* కనీసం 50 వార్డుల్లో ప్రజలతో సంప్రదింపుల కింద అభిప్రాయాలు
* ప్రతిపాదనకు ముందు నెల వరకు మున్సిపాలిటీ సిబ్బందికి వేతనాల చెల్లింపు
* 2012-13 వరకు మున్సిపాలిటీకి సంబంధించిన ఆడిటింగ్‌ పూర్తికావాలి
* జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ప్రాజెక్టుల్లో యూజర్‌ఛార్జీలు వసూలు లక్ష్య సాధన
* ఆస్తిపన్ను, తాగునీటి, మురుగునీటి ఛార్జీల వసూలు లక్ష్య సాధన
* నగర భవిష్యత్తు లక్ష్యం, నగర ఆర్థిక ప్రగతికి సంబంధించిన ప్రణాళిక
* ప్రజలతో సంప్రదింపులకు బ్లాగ్‌, పోర్టళ్లు, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి మాధ్యమాల వినియోగం.

స్మార్ట్‌ అయ్యాక!
అందుబాటులోకొచ్చే సౌకర్యాలు
ఇంధనం
సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇంధన గ్రిడ్‌, ఇంధన నిల్వ, కార్బన్‌ రహిత ప్రణాళికలు, ఇంధన నిర్వహణ, వాతావరణ సమతుల్యం, ఇంధన సమర్థత

సాంకేతిక పరిజ్ఞానం
సమీకృత టెక్నాలజీ, సెన్సార్‌లు, ఇంటర్నెట్‌, క్లౌడ్‌, బిగ్‌డేటా, మొబైల్‌ అప్లికేషన్లు, జియోఇన్ఫర్మేటిక్స్‌, ఎలక్ట్రానిక్‌ నిఘా

స్మార్ట్‌ సొసైటీ
నూతన తరహాలో పౌరసేవలు, సామాజిక మర్యాద, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలు సాధించే వాతావరణం.

పరిపాలన, ఆర్థికం
పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యం, ప్రజలందరికీ అందుబాటులో ప్రభుత్వం, నూతన పరిపాలన, అందరికీ సమాచారం, ఆర్థిక అభివృద్ధి

పర్యావరణం
మెరుగైన అభివృద్ధి, హరిత భవనాలు, ఘనవ్యర్థాల నిర్వహణ, పట్టణ పునర్నిర్మాణం.

రక్షణ
పటిష్ఠ నిఘా, సెక్యూరిటీ తనిఖీ కేంద్రాలు, అత్యవసర సేవలు, రక్షణ కేంద్రాలు

అందరికీ గృహ వసతి
లక్ష్యం: దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి గృహ వసతి కల్పించాలి. 2022 నాటికి ఇళ్లులేని కుటుంబం ఉండకూడదు.
ఏం చేస్తారు: భవన నిర్మాణ నిబంధనలు సరళీకరింస్తారు. అధిక నిర్మిత స్థలం లభించేలా ఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఆర్‌ఐలో సడలింపు ఇస్తారు.

పేదలకు రిజర్వేషన్‌
* మురికివాడల్లోని ప్రజలకు అక్కడే పునరభివృద్ధి కింద అభివృద్ధి ఇళ్లుకట్టిస్తారు.
* భారీ విస్తీర్ణంలో గృహ నిర్మాణాలు చేపట్టే సంస్థలు పేదలకు రిజర్వేషన్‌ కింద నిర్మాణాలు చేపట్టాలి.
* ప్రణాళిక లేకుండా వెలిసిన నగరాలను ప్రణాళిక కిందకు తీసుకురావచ్చు.
* ప్రతికాలనీ, మురికివాడలో రోడ్లు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ సౌకర్యం ఉంటుంది.
* పేదలకు గృహవసతికి అవసరమైన వాటాను బ్యాంకుల ద్వారా రుణం రూపంలో అందిస్తారు.

చేపట్టాల్సిన పనులు
* యువతను ఎక్కువగా ఆకర్షించాలి * కొత్త ఆలోచనల కోసం ఇన్‌క్యుబేషన్‌ కేంద్రాలుండాలి. * చౌకగృహాలు, ఆకాశ హర్మ్యాలు, సోషల్‌ నెట్‌వర్క్‌, ప్రజా రవాణా, వినోద కేంద్రాలపై ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షించాలి. * గుడ్‌గావ్‌, పుణె, బెంగళూరు తరహాలో ఏదో ఒక రంగం అభివృద్ధి ద్వారా ఆ నగరానికి గుర్తింపు తీసుకురావాలి. * నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లోనూ ఖాళీ స్థలాలు, పార్కులు ఉండేలా చూడాలి. కాలినడక దారులు ఏర్పాటు చేయాలి. * ప్రతి నగరానికి ఎదో ఒక పారిశ్రామిక రంగంలో ప్రత్యేక గుర్తింపు రావాలి. * మెరుగైన ప్రజా రవాణా (మెట్రో, మోనో, బీఆర్‌టీఎస్‌) ఏర్పాటు చేయాలి. * ఇతర ప్రాంతాల నుంచి స్మార్ట్‌ నగరానికి ఎగుమతులు దిగుమతుల కోసం ప్రత్యేక రైలు రవాణాతో పాటు విమానాశ్రయాలు నిర్మించాలి. * యువతకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో కూడిన శిక్షణ కేంద్రాలుండాలి.
ఎన్నికల గుబులు
రాజ్యాంగ సవరణ మేరకు మున్సిపాలిటీకి ఎన్నికైన పాలకమండలి తప్పనిసరిగా ఉండాలి. ఎన్నికైన పాలకమండళ్లు ఉంటేనే కేంద్రం పట్టణ ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేస్తుంది. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లకు, సిద్దిపేట పురపాలక సంఘానికి పాలకమండళ్లు లేవు. వీటికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంటుంది.
- ఈనాడు, హైదరాబాద్‌

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

సీసీఎల్‌-6 విజేత తెలుగు వారియర్స్‌

సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ తెలుగు వారియర్స్‌ ఫైనల్లో అదిరిపోయే ప్రదర్శనతో కర్ణాటక బుల్డోజర్స్‌ను మట్టికరిపించి రెండోసారి విజేతగా నిలిచింది. ఉప్పల్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అఖిల్‌...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net