Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
తొలగని ప్రతిష్టంభన!
తెదేపా, భాజపాల మధ్య కొలిక్కిరాని సర్దుబాట్లు
విసిగిపోయిన జవదేకర్‌ ఢిల్లీకి తిరుగుముఖం
ఈనాడు, హైదరాబాద్‌: రెండు రాష్ట్రాల్లోనూ పార్టీల మధ్య ఎన్నికల అవగాహన ఉండాలని తెదేపా, భాజపాలు భావిస్తున్నా... సీట్ల సర్దుబాటు ఒక పట్టాన కొలిక్కివచ్చేలా కనిపించటం లేదు. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని రెండు పార్టీల నేతలూ భావిస్తున్నారు. చర్చల సందర్భంగా ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉంటుండటంతో ప్రతిష్టంభన నెలకొంది. అగ్రనేతలు చొరవ తీసుకుంటేగాని చర్చలు ఫలించేలా లేవు. భాజపా పక్షాన పాల్గొన్న సీనియర్‌ నేత, ఎంపీ జవదేకర్‌ చర్చల తీరుకు విసుగుపుట్టి... ఇక అగ్రనేతలే పొత్తులపై మాట్లాడుకుంటారంటూ ఆదివారం ఢిల్లీకి వెళ్లిపోయారు. 1999, 2004 ఎన్నికల్లో కేటాయించిన స్థానాలకు కాస్త ఎక్కువ సంఖ్యలో మాత్రమే కేటాయించేందుకు తెదేపా సుముఖత చూపుతోంది. దీనికి భాజపా అంగీకరించటం లేదు. అప్పటికి, ఇప్పటికి పరిస్థితుల్లో ఏమాత్రం పొంతన లేదని, రెండు పార్టీల బలాబలాల్లో మార్పులొచ్చాయని భాజపా నేతలు సూచిస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణలో తమ బలం పెరిగిందని వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 8 లోక్‌సభ, 25 శాసనసభ స్థానాలు కోరుతున్నారు. ఒకటి, రెండు అటూఇటూగా ఉన్నా పర్వాలేదుగాని, ప్రతిపాదనల్లో మరీతగ్గిస్తే అవగాహన కష్టమని సూచిస్తున్నారు. అక్కడున్న మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో ప్రతి దాంట్లో కనీసం ఒక్కటి చొప్పున అసెంబ్లీ నియోజకవర్గం కేటాయిస్తే భాజపా శ్రేణులు పూర్తిగా మమేకమై పనిచేయటానికి బాగుంటుందని వివరిస్తున్నారు. తెలంగాణలో లోక్‌సభ స్థానాల్లో ఒక్కటైనా తెదేపాకన్నా ఎక్కువగా కావాలని, శాసనసభ స్థానాలు కనీసం సగం ఉండాలని కోరుతున్నారు. రెండుచోట్లా ఈ ప్రతిపాదనలకు తెదేపా అంగీకరించటం లేదు. సీమాంధ్రలో 3-4 లోక్‌సభ స్థానాలు, 10-12 శాసనసభ స్థానాలు ఇవ్వాలని భావిస్తోంది. తెలంగాణలో లోక్‌సభ స్థానాల విషయంలో ఎనిమిది ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నా... శాసనసభ స్థానాల విషయంలోనే 30 వద్దనే ఆగుతోంది. రెండుచోట్లా ఈ ప్రతిపాదనలకు భాజపా అంగీకరించే పరిస్థితి లేదు. ఫలితంగా చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఢిల్లీ వెళ్లే ముందుగా జవదేకర్‌ కొంతమంది భాజపా నాయకులతో మాట్లాడుతూ ఇక పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, రాష్ట్రంలో పొత్తుల వ్యవహారాలకు బాధ్యునిగా ఉన్న అరుణ్‌జైట్లీలే చంద్రబాబుతో నేరుగా మాట్లాడతారని అన్నట్లు తెలిసింది.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి

బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రానికి కొన్ని మార్పులు చేయనున్నట్లు దర్శకుడు ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net