Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
మార్గాన్వేషణ ఏ దిశలో?
రాష్ట్రపతి పాలనపై స్పష్టత రాలేదు
ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే చేయొచ్చు
కేంద్ర హోంమంత్రి షిండే వెల్లడి
ఢిల్లీలో అందుబాటులో ఉండాలని
చిరంజీవికి అధిష్ఠానం సూచన!
హస్తినకు చేరుకున్న బొత్స
షిండే వ్యాఖ్యలతో నేతల్లో ఆశలు
ఈనాడు-న్యూఢిల్లీ, హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఇంకా స్పష్టత రాలేదని కేంద్ర హోంమంత్రి షిండే చెప్పారు. ఒకవేళ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేలా ఉంటే చేయనివ్వండని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాల కోసం అన్వేషిస్తున్నట్లు షిండే ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే పరిస్థితులు ఉంటే ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. షిండే వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ నేతల్లో ఆశలు చిగురించాయి. తమకు సీఎం పదవి దక్కుతుందేమోననే భావనలో వారున్నారు. సీఎం పదవికి సీమాంధ్రలో మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతోపాటు కె.జానారెడ్డి,

డి.శ్రీనివాస్‌, ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కేంద్ర పర్యాటకశాఖ కార్యక్రమంలో భాగంగా త్రివేండ్రం వెళ్లిన కేంద్రమంత్రి చిరంజీవి సోమవారానికి ఢిల్లీ చేరుకుంటున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉండాలనే అధిష్ఠానం సూచన మేరకు ఆయన వెళుతున్నట్లు సమాచారం. బొత్సను ఢిల్లీ రమ్మని చెప్పడంతో ఆయన కూడా ఆదివారం రాత్రే ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనా? లేక కొత్త సారథికి పగ్గాలు అప్పగిస్తారా అనే విషయమై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో వారిని ఢిల్లీకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో పలువురు నాయకులు కాంగ్రెస్‌ను వీడనుండడం, కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడతారనే అభిప్రాయం నేపథ్యంలో... పార్టీని పటిష్ఠపరచడంపై అధిష్ఠానం దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. పార్టీ పరిస్థితి మరింత దెబ్బతినకుండా చూసుకోవడంతోపాటు, సీమాంధ్రలో ఒక బలమైన సామాజిక వర్గాన్ని వెంట తీసుకెళ్లడంలో భాగంగా చిరుసేవలు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారనే భావనను ఆయన సన్నిహిత వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించినప్పటికీ రాజ్యసభలో ప్రత్యేకంగా ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించారని గుర్తుచేస్తున్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే పార్టీపరంగా గానీ, ప్రభుత్వపరంగా గానీ... ఏ బాధ్యతనైనా స్వీకరిస్తానని త్రివేండ్రంలో చిరంజీవి అన్నట్లు సమాచారం.

సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలకు అవకాశం: షిండే
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడానికి అవకాశం ఉన్నట్లు ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షిండే చెప్పారు. అయితే ఈ విషయంలో ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందినప్పటికీ మొత్తం విభజన ప్రక్రియ పూర్తికావడానికి కనీసం రెండుమూడు నెలలు పడుతుంది కాబట్టి సమైక్యరాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. విభజన ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని పార్లమెంటులో ప్రధాని ప్రకటించినప్పటికీ దానికి కొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. మూడునాలుగు నెలలకోసం తాము మధ్యంతర ఆర్థిక వెసులుబాటు కల్పించే అంశంపై తాము అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అదే సమయానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని ప్రతిపక్షం కూడా డిమాండ్‌ చేస్తున్నట్లు గుర్తుచేశారు. ఇవన్నీ సమగ్రంగా పరిశీలించాల్సి ఉందన్నారు.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ఎన్టీఆర్‌ ‘దండయాత్ర’కు ఏడాది..!

‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. ఇది దయా గాడి దండయాత్ర’. పవర్‌ఫుల్‌ డైలాగులతో ఎన్టీఆర్‌ తెలుగు సినీ సెల్యులాయిడ్‌పై చేసిన దండయాత్రకు ఫిబ్రవరి 13తో ఏడాది పూర్తైంది. ‘వన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net