Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'

అమ్మో.. అక్కడ పరిశోధన నరకమే!
హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీలో దుస్థితి
పీహెచ్‌డీ విద్యార్థులకు గైడ్‌ను కేటాయిస్తే ఒట్టు
ఏడాదిన్నరైనా గైడ్‌ కేటాయింపుల్లేవు
దీంతో గతంలో ఓ విద్యార్థి బలవన్మరణం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లో పీహెచ్‌డీ చేయాలంటే సంబంధిత పరిశోధ¹క విదార్థులకు నరకయాతనే! కొంతమంది విద్యార్థులు ఈవిషయంలో మానసికంగా తీవ్ర మనోవేదన చెందుతుంటే.. మరికొంతమంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. దీనంతటికీ కారణం పరిశోధనా విద్యార్థులకు గైడ్స్‌ను కేటాయించకపోవడమే. మూడేళ్ల కిందట ఇలానేగైడ్‌ను కేటాయించకపోవడం వల్ల ఒక విద్యార్థి బలవన్మరణం పొందారు. పరిశోధక విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య నేపథ్యంలో ఈమొత్తం వ్యవహారంపై ‘ఈనాడు’ పరిశీలన చేస్తే అనేక విషయాలు వెలుగులోకొచ్చాయి.

హెచ్‌సీయూలో ప్రస్తుతం దాదాపు 2వేలమంది పరిశోధక విద్యార్థులున్నారు. ఏటా దాదాపు 300మందికి పైగా విద్యార్థులు పీహెచ్‌డీ ప్రవేశాలు పొందుతున్నారు. ఇలాచేరే విద్యార్థులకు నెల లేదా రెండు నెలల్లోనైనా గైడ్‌ (ప్రొఫెసర్‌)ను కేటాయించాల్సి ఉంది. సాధారణంగా అయిదేళ్లలోపు ఈపరిశోధ¹నను పూర్తి చేయాల్సి ఉంది. గైడ్‌ ఇతరత్రా అన్ని సౌకర్యాలను కల్పిస్తే మూడేళ్లలో పరిశోధనను పూర్తిచేసిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఈవర్సిటీలో గత కొన్నేళ్లగా కొంతమంది విద్యార్థులకు గైడ్‌ను కేటాయించడంలో వర్సిటీ ఉన్నతాధికారులు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కొంతమందికి 8నెలల నుంచి ఏడాదిన్నరకు గానీ గైడ్‌ను కేటాయించడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్రమైన మనోవేదనను అనుభవిస్తున్నారు. ఈక్రమంలోనే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూడా చోటుచేసుకుంది. 2011లో ఎం.వెంకటేష్‌ అనే విద్యార్థి రసాయన శాస్త్రంలో పరిశోధన కోసం ప్రవేశంపొందారు. తివారి అనే ప్రొఫెసర్‌ను గైడ్‌గా కేటాయించారు. ఈకేటాయింపు జరిగిన 6నెలలకే ఆయన పదవీ విరమణకావడంతో ఆస్థానంలో మరొకరిని గైడ్‌గా నియమించాల్సి ఉంది. ఆస్థానంలో 2014వరకు కూడా గైడ్‌ను కేటాయించలేదు. దీంతో ఆవిద్యార్థి నాటి వర్సిటీ అధికారులకు లేఖరాశారు. మెయిల్స్‌ ఇచ్చినా ఏఒక్కరూ స్పందించలేదు. దీంతో 2014లో వెంకటేష్‌ ఇదేకారణంతో వసతిగృహంలోనే విషంతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థి నాయకులు తెలిపారు. ఇలానే అనేకమంది ఆత్మహత్య వరకు వెళ్లకపోయినా.. తమ భవిష్యత్తు ఏమిటో తెలియక మానసికంగా కుంగిపోతున్నారని వెల్లడించారు. నిబంధనల ప్రకారం అయిదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ప్రొఫెసర్లను మాత్రమే గైడ్‌గా కేటాయించాల్సి ఉంది. అయిదేళ్లలోపు సర్వీసు ఉన్న ప్రొఫెసర్‌ను కేటాయించడం వల్లే వెంకటేష్‌ ఆత్మహత్యకు కారణమైందని విద్యార్థులు చెబుతున్నారు. ఆర్థిక, సామాజిక, రసాయన శాస్త్రాల్లో కొన్ని కీలకమైన విభాగాల్లో పరిశోధన చేసేందుకు ఈవర్సిటీలో చేరుతున్న విద్యార్థులకు గైడ్‌ను కేటాయించాలంటే కొన్నిసార్లు ఏడాదిన్నర పడుతోందని చెబుతున్నారు. దేశంలోనే గుర్తింపుపొందిన ఈవర్సిటీలో పరిశోధన పూర్తిచేస్తే తమకు ఉద్యోగం దొరుకుతుందని ఇక్కడికొచ్చిన విద్యార్థుల ఆశలను ఉన్నతాధికారులు మొగ్గలోనే తుంచేస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. రోహిత్‌ ఆత్మహత్య నేపథ్యంలో గైడ్‌ల కేటాయింపు చర్చనీయాంశమవుతోంది. కొంతమంది గైడ్‌లు విద్యార్థులకు సరిగా మార్గనిర్దేశనం చేయట్లేదన్న ఆరోపణలున్నాయి. గైడ్‌ తమకు సహకరించట్లేదని కొంతమంది విద్యార్థులు వాపోతున్నారు. 2007లో కంప్యూటర్‌ సైన్సులో విద్యార్థి భువనేశ్వరి ప్రవేశం పొందారు. 2013లోనే తాను ఈప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమైన అంశాలన్నింటిపై నివేదికను రూపొందించినా.. తన గైడ్‌ ఇంతవరకు దీన్నిఆమోదించకుండా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇదేవిషయంపై వీసీకి సైతం చెప్పానని తెలిపారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు సిద్ధమని వీసీకి ఈమెయిల్‌ ద్వారా తెలిపినా ఏచర్యతీసుకోలేదని వాపోయారు. కొంతమంది విద్యార్థులు నాణ్యమైన పరిశోధన చేయకుండానే.. వారి పరిశోధనలకు ఆమోదముద్ర వేయాలని కోరుతున్నారని కొంతమంది ప్రొఫెసర్లు చెబుతున్నారు. దీనివల్లే తాము కొంతమంది పరిశోధనలను ఆమోదించలేకపోతున్నామని అంటున్నారు. విద్యార్థులు దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా తమపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.


ఎలాంటి సమస్యలున్నా వెంటనే చర్యలు
పీహెచ్‌డీ విద్యార్థులకు, గైడ్‌కు మధ్య సమన్వయ లోపాలు తలెత్తినప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గైడ్‌ల కేటాయింపుపై గతంలో ఆలస్యం జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు అవాస్తవం. నవంబరు 2015లో వీసీగా తాను బాధ్యతలు తీసుకున్నాక భువనేశ్వరి ఈమెయిల్‌ పంపారు. ఆ విషయాన్ని వెంటనే సంబంధిత అధికారికి తెలియజేశాను. మరోగైడ్‌ కేటాయింపు ప్రక్రియ త్వరలోనే పూర్తి అవుతుంది. పీహెచ్‌డీ విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను.
-పొదిలె అప్పారావు, హెచ్‌సీయూ వీసీ

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net