Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
హంద్రీనీవాలో కాసుల ఎత్తిపోతలు
ఓ ప్యాకేజీలో పని విలువ పెంచుతూ సర్కారు నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్‌: జలయజ్ఞం ప్రాజెక్టుల్లో ఒక్కో ప్యాకేజీది ఒక్కో కథ. పనిచేయని గుత్తేదారులు, చేయకపోయినా చూసీ చూడనట్లు వ్యవహరించే నీటిపారుదల శాఖ, భారీ పర్సంటేజీల కోసం రాజకీయ నాయకుల జోక్యం.. ఇలా అన్నీ కలిసి పనుల్లో జాప్యం జరగడం, ఒక్కో పని వ్యయం తడిసిమోపెడు కావడం జరుగుతోంది. పెద్ద పెద్ద పనులే కాదు చిన్న పనులదీ ఇదే పరిస్థితి. ప్రభుత్వం కూడా పనిచేయని గుత్తేదారులకే వంతపాడుతుండటంతో ఖజానాపై భారం పెరగడం తప్ప పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

తాజాగా హంద్రీనీవా ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ఓ ప్యాకేజీలో రూ.58.64 కోట్ల విలువ గల పనిని రూ.97.30 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం మొదటి దశలో భాగంగా సిద్దేశ్వరం నుంచి ముచ్చుమర్రి పంపుహౌస్‌ వరకు అప్రోచ్‌ ఛానల్‌ తవ్వకం, పంపుహౌస్‌ నుంచి మొదటి పంపింగ్‌ స్టేషన్‌ వరకు లింకు కాలువ తవ్వకం, స్ట్రక్చర్ల నిర్మాణ పనిని ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ సంస్థ దక్కించుకొంది. అయితే ఈ సంస్థ కాగితాల్లోనే. అనధికారికంగా పని చేసింది నెల్లూరుకు చెందిన ఓ గుత్తేదారు సంస్థ. ఒప్పందం ప్రకారం ఈ పనిని 2009 నాటికే పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఈ సంస్థ 2010 ఏప్రిల్‌ వరకు కేవలం రూ.11.72 కోట్ల పని మాత్రమే చేసింది. మరో రూ.58.64 కోట్ల పని మిగిలిపోయింది. అంటే ఒప్పందం పూర్తయ్యే నాటికి ఈ సంస్థ 25 శాతం పని కూడా చేయలేదు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమర్రి, నెహ్రూనగర్‌ గ్రామస్థులు కాలువ తవ్వకం వల్ల ఇళ్లు దెబ్బతింటున్నాయని అడ్డుకొంటున్నారని, కంట్రోల్‌ బ్లాస్టింగ్‌(రాళ్లు బయట పడకుండా) చేయాలంటున్నారని, రైతులకు ఇప్పటికే ప్రభుత్వం చెల్లించిన పరిహారానికి అదనంగా చెల్లించాలని కోరుతున్నారని, ఈ సమస్యలకు ప్రభుత్వం అంగీకరించనందున మూడేళ్లపాటు పని జరగలేదని సంబంధిత చీఫ్‌ ఇంజినీర్‌ ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఈ పనికి సంబంధించిన ఒప్పందాన్ని రద్దుచేయాలని కూడా సూచించారు. అయితే ప్రభుత్వం ఈ పనిచేయకుండా నిపుణుల కమిటీని నియమించింది. పని జరగకపోవడానికి గుత్తేదారు కారణం కాదని, రైతుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవి కాకపోవడమే ప్రధాన కారణమని ఈ కమిటీ పేర్కొంది. చీఫ్‌ ఇంజినీర్‌ సూచన మేరకు గుత్తేదారుతో ఒప్పందం రద్దుచేయని ప్రభుత్వం, మళ్లీ ఈ గుత్తేదారుతోనే చర్చలు జరిపింది. కంట్రోల్‌ బ్లాస్టింగ్‌కు అయ్యే వ్యయాన్ని, అదనపు స్ట్రక్చర్లకు అయ్యే వ్యయాన్ని భరిస్తే పని చేస్తానని, ఈ పనులకు 2012-13 ధరలను చెల్లించాలని గుత్తేదారు కోరారంటూ వీటన్నిటికీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు మిగిలిన రూ.58.64 కోట్ల పనిని రూ.97.30 కోట్లకు పెంచి అదే గుత్తేదారుకు పని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఇప్పుడైనా పని సజావుగా సాగుతుందన్న నమ్మకం లేదు. రైతుల నుంచి ఇప్పుడు కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. రైతుల సమస్యతోపాటు, కొందరు రాజకీయనాయకులు గుత్తేదారుపై ఒత్తిడి తెచ్చి సొమ్ము చేసుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల గుత్తేదారుకు అదనపు చెల్లింపులకు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా అమలులోకి రాలేదు. కానీ ప్యాకేజీల వారీగా నిర్ణయాలు మాత్రం జరిగిపోతున్నాయి.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

బుల్డోజర్స్‌పై విజయం మాదే: అఖిల్‌

సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలుగు వారియర్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న యువ కథానాయకుడు అఖిల్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net