Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు?
తెలంగాణ రాష్ట్రం ఉనికి 90 రోజుల తరవాతే!
విభజన ప్రక్రియ పూర్తికే ఈ గడువు
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఏర్పాటుకు ఎన్నాళ్ల సమయం పడుతుందనేది చర్చనీయాంశమైంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇందుకు దాదాపు 3 నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సిన సాధారణ ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే ఉమ్మడి రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల తరువాత తెలంగాణలో ఎక్కువ స్థానాలు పొందే పార్టీ.. తెలంగాణ రాష్ట్రంలో, సీమాంధ్రలో ఎక్కువ స్థానాలు గెలుచుకునే పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయి. విభజన బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపినందున ఇక దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి. ఈ ప్రక్రియ మరో వారంలో పూర్తవుతుందని, ఆ వెంటనే గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడుతుందని కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ శుక్రవారం వెల్లడించారు. నోటిఫికేషన్‌ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉనికిలోకి రావడానికి కనీసం 75-90 రోజుల సమయం పట్టే అవకాశముంది. గతంలో ఏర్పాటైన వివిధ రాష్ట్రాల విషయంలో కేంద్రం అనుసరించిన ప్రక్రియను బట్టి చూస్తే ఇంత గడువు పడుతుందని తెలుస్తోంది. జైరాం రమేష్‌ కూడా గతంలో మూడు నెలల సమయం పట్టిందని గుర్తు చేశారు. గెజిట్‌లో ప్రచురించే నోటిఫికేషన్‌లో కొత్త రాష్ట్ర ఏర్పాటునుతెలిపే అపాయింటెడ్‌ డేను కేంద్రం ప్రకటిస్తుంది. ఎందుకంటే, ఆ తేదీ నాటికి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని పక్రియలు పూర్తికావాలి. ఉద్యోగుల పంపిణీ, సచివా లయాల ఏర్పాటు, నగదు నిల్వల పంపిణీ, ఖజానాల ఏర్పాటు, ఆర్థిక పరమైన, ఇతర విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. ఉద్యోగుల విషయమై ఇప్పటికే కేంద్రం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఆర్థిక లావాదేవీల అంశాలను ఆర్థికశాఖ, ఆర్‌బీఐ పరిష్కరిస్తాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 75 నుంచి 90 రోజుల సమయం అవసరం. అందుకే అపాయింటెడ్‌ డేకు కనీసం రెండున్నర నెలల నుంచి మూడు నెలలు తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net