Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
ప్రాణహిత ప్రాజెక్టుకు కాళేశ్వరం పేరు
పాలమూరు, నక్కలగండి ఎత్తిపోతలకు ఏప్రిల్‌లో శంకుస్థాపన
కృష్ణా, గోదావరి జలాలతో తెలంగాణ సస్యశ్యామలం
ప్రాజెక్టుల సత్వర నిర్మాణంపై కార్యాచరణ
త్వరలో విహంగ వీక్షణం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు వచ్చేనెల మొదటి వారంలో శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలకు ఈ పథకాల ద్వారా సాగునీటిని సమర్థంగా అందిస్తామని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగర్‌రావు, ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌, విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ, తెలంగాణలో కృష్ణా, గోదావరి జలాల వినియోగం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ నదులపై ప్రతిపాదించిన ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ మంచినీటి పథకం, విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల మాదిరే నీటి పారుదల ప్రాజెక్టులనూ యుద్ధ ప్రాతదిపదికన పూర్తిచేయాలన్నారు.

అదనంగా 120 టీఎంసీలు వచ్చే అవకాశం: ప్రస్తుత కేటాయింపులతో పాటు మరో 120 టీఎంసీలు తెలంగాణకు అదనంగా వచ్చే వీలున్నందున... ఈ నీటిని పూర్తిగా వినియోగించుకునేలా ప్రాజెక్టులను సిద్ధం చేయాలని అధికారులకు కేసీఆర్‌ సూచించారు. దక్షిణ తెలంగాణలో పాలమూరు, ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు, పెండ్లిపాలక, నక్కలగండి... ఉత్తర తెలంగాణలో ప్రాణహిత, పాములపర్తి, తడకపల్లిలో రిజర్వాయర్లను నిర్మించాలని, ఖమ్మం జిల్లా రైతులకు ఉపయోగపడేలా దుమ్ముగూడెం ప్రాజెక్టులో మార్పులు చేయాలని, దేవాదులను మరింత సమర్థంగా వినియోగించుకోవాలని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల కొత్త పథకం కాదని, గతంలో నీటి కేటాయింపులతో అనుమతులు పొందిన ప్రాజెక్టేనని అన్నారు. హైదరాబాద్‌ రాష్ట్రంగా ఉన్నప్పుడే గుల్బర్గా, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన 4.25 లక్షల వ్యవసాయ భూమికి నీరందించేందుకు 100 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల భీమా ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందని, అదే ప్రాజెక్టును ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకంగా చేపట్టామన్నారు. దీని ద్వారా సాగునీటితో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు మంచినీటిని ఇస్తామన్నారు. గతంలోనే అనుమతులున్నందున కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు.

పాలమూరు, నక్కలగండి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేస్తామని, టన్నెల్‌, రిజర్వాయర్‌, పంపుహౌస్‌ పనులన్నింటినీ ఏకకాలంలో చేపడతామన్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తికాకుండా, కేటాయించిన నిధులు ఖర్చు కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్లు తయారయ్యాయన్నారు. ప్రాణహిత ప్రాజెక్టే ఇందుకు నిదర్శనమని, సులభంగా పూర్తయ్యే ప్రాజెక్టులను వివాదాల్లోకి నెట్టి, తెలంగాణ రైతులు లబ్ధి పొందకుండా చేశారన్నారు. ఇతర రాష్ట్రాలతో లంకె పెట్టడం, అటవీశాఖ కొర్రీల కారణంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికావడం లేదన్నారు. మహారాష్ట్రతో గొడవ లేకుండా ప్రాణహిత, గోదావరి నదులను కలుపుతూ కాళేశ్వరం వద్ద ప్రాజెక్టును నిర్మిస్తే అన్ని విధాలా మేలన్నారు. ప్రాణహిత ప్రాజెక్టుకు ‘కాలేశ్వరం’ అని పేరు పెడతామన్నారు. దీంతో పాటు ఇతర ప్రాజెక్టులపైనా రీ-ఇంజినీరింగ్‌ జరగాలన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రతిపాదించిన ప్రాజెక్టులపై అధ్యయనానికి విశ్రాంత ఇంజినీర్లను వచ్చేవారం హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వేకు పంపిస్తామని చెప్పారు. ఈ రెండు నదులపై చేపట్టే ప్రాజెక్టుల కోసం వేర్వేరుగా పునరావాస, సహాయ కమిషనర్లను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. నీటిపారుదల శాఖకు అదనంగా రెవెన్యూ, ఇంజినీరింగ్‌ సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువల కింద చరిత్రలోనే మొదటిసారిగా రెండో పంటకు నీరిచ్చినట్లు కేసీఆర్‌ చెప్పారు.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net