Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
నల్ల దొరలకు లబ్‌ డబ్బు
విదేశాల్లోని నల్లధనం వివరాల్ని ఇవ్వని వారిపై కఠిన శిక్షలు
10 ఏళ్ల జైలు.. 90% జరిమానా
స్వచ్ఛందంగా చెబితే 30 శాతం పన్ను, అంతేమొత్తంలో జరిమానా
పన్ను ఎగవేతను ప్రోత్సహిస్తే ఏడేళ్ల జైలు
లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి జైట్లీ
దిల్లీ: ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా అక్రమసొమ్మును, అక్రమ ఆస్తులను విదేశాలకు తరలించిన వారికి ఇక మీదట పదేళ్ల జైలు శిక్ష పడనుంది. అంతేకాదు.. వారి అక్రమాస్తులు, సొమ్ముపై ప్రభుత్వం 90% జరిమానాను, 30% పన్నును విధించనుంది. ఇటువంటి కఠినమైన శిక్షల బారిన పడకూడదనుకుంటే సదరు ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి వెల్లడించి వాటిపై 30 శాతం పన్నును, అంతేమొత్తంలో జరిమానాను చెల్లించటమే ఏకైకమార్గం. ఈ విధమైన కఠినమైన నిబంధనలతో కూడిన బిల్లును ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీయటానికి ఉద్దేశించిన ఈ బిల్లు పూర్తి పేరు ‘‘బయటికి వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తులు (పన్ను విధింపు) బిల్లు, 2015’’. దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో జైట్లీ విలేకర్లతో మాట్లాడుతూ.. భారత్‌లో పన్ను ఎగవేసి విదేశాల్లో అక్రమ సొమ్మును దాచిన వారు వాటి వివరాలను తెలియజేయటానికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పిస్తుందని చెప్పారు. దీనిప్రకారం దాచిన సొమ్ము, ఆస్తుల విలువపై 30 శాతం పన్ను, 30 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విధంగా ఆస్తుల గురించి తెలియజేస్తూ సదరు వ్యక్తులు స్వయంగా వెల్లడించిన వివరాలను వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలుగా ఉపయోగించబోమన్నారు. సంపదపన్ను, విదేశీ వినిమయ నియంత్రణ పన్ను, కంపెనీల చట్టం, కస్టమ్స్‌చట్టం పరిధిలో సాక్ష్యాధారాలుగా ఈ వివరాల్ని వాడటమంటూ జరగదని హామీ ఇచ్చారు. కొత్త చట్టంలోని కఠినమైన నిబంధనలు అమల్లోకి రాకముందే అక్రమాస్తుల వివరాల్ని తెలియజేయటానికి ఒక అవకాశం కల్పిస్తున్నామన్నారు. పన్ను ఎగవేత వల్ల సామాజిక పథకాలు అమలుకు, ఆర్థికాభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయని జైట్లీ చెప్పారు. పన్ను ఎగవేత కారణంగా ఏర్పడే ఆదాయలోటును పూడ్చటానికి నిజాయితీగా పన్ను చెల్లించేవారు అదనపు భారం మోయాల్సి వస్తుందన్నారు. పన్ను చెల్లించకుండా విదేశాలకు తరలించే అక్రమసంపద.. దేశరక్షణకు ముప్పు తెచ్చే కార్యకలాపాలకు ఉపయోగపడే ప్రమాదం ఉందని మంత్రి తెలిపారు. నల్లధనాన్ని అరికట్టటం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు వూపందుకున్నాయని, దీంట్లో భారత్‌ ముందువరుసన ఉండి కృషి చేస్తోందన్నారు.

బిల్లులోని ముఖ్యాంశాలు..
* ఈ బిల్లు దేశంలో నివసించే వారందరికీ వర్తిస్తుంది.
* విదేశాల్లో దాచిన సొమ్ము, ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయటానికి ఒక అవకాశం కల్పిస్తారు. వెల్లడించే ఆస్తులపై 30 శాతం పన్ను, 30 శాతం జరిమానా విధిస్తారు. ఈ విధంగా ఆస్తుల వివరాలను తెలియజేసి పన్ను, జరిమానా కట్టినవారిపై విచారణ ఉండదు.
* ప్రభుత్వానికి తెలియజేయకుండా విదేశాల్లో సొమ్మును, ఆస్తులను దాచిన వారిపై ప్రభుత్వం 90 శాతం జరిమానా, 30 శాతం పన్ను విధిస్తుంది.
* విదేశాల్లో ఉన్న సొమ్ము, ఆస్తులపై కావాలనే పన్ను ఎగవేసినవారికి జరిమానాతోపాటు 3 నుంచి 10 ఏళ్ల కఠిన జైలుశిక్ష.
* విదేశీ సొమ్ము, ఆస్తులు, బ్యాంకుఖాతాలకు సంబంధించి ఆదాయపుపన్ను రిటర్నులను దాఖలు చేయనివారికి ఆరునెలల నుంచి ఏడేళ్ల కఠిన జైలుశిక్ష. రూ.10 లక్షల జరిమానా.
* రిటర్నులను దాఖలు చేసినప్పటికీ విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించకపోయినా లేదా కచ్చితమైన వివరాలు ఇవ్వకపోయినా ఆరునెలల నుంచి ఏడేళ్ల కఠిన జైలుశిక్ష. రూ.10 లక్షల జరిమానా.
* విదేశీ ఆస్తులు, ఖాతాల గురించి తప్పుడు వివరాలు ఇచ్చేలా ఇతరులను ప్రోత్సహించినవారికి ఆరునెలల నుంచి ఏడేళ్ల జైలుశిక్ష. వివరాలను రహస్యంగా దాచిపెట్టి, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే బ్యాంకులకు, ఇతర ఆర్థికసంస్థలకు కూడా ఈ శిక్ష వర్తిస్తుంది.
* అక్రమ విదేశీ ఆస్తుల వల్ల లబ్ధి పొందే వారికి కూడా ఈ బిల్లు వర్తిస్తుంది.
* విదేశీ బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలకు మించకుండా సొమ్ము కలిగి ఉన్న వారిపై జరిమానాగానీ, విచారణగానీ ఉండదు (విదేశాల్లో చిన్నమొత్తాలతో బ్యాంకుఖాతాలను కలిగి ఉండి ఆ వివరాలను వెల్లడించాలని తెలియని వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం ఈ నిబంధన చేర్చారు).
* ఆదాయపుపన్ను అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌కు, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు అప్పీల్‌ చేసుకునే హక్కు నిందితులకు ఉంటుంది.
* రెండోసారి దోషిగా తేలిన వారికి మూడు నుంచి పదేళ్ల కఠిన జైలుశిక్ష. ఒక కోటి రూపాయల వరకూ జరిమానా.
* పన్ను ఎగవేతను ‘మనీల్యాండరింగ్‌ చట్టం, 2002’ పరిధిలోకి కూడా తీసుకొచ్చేలా ఆ చట్టాన్ని సవరించాలని ఈ బిల్లులో ఒక ప్రతిపాదన ఉంది.
* సమాచార మార్పిడి కోసం, పన్ను వసూలు కోసం, ద్వంద్వపన్నును నివారించటం కోసం ఇతర దేశాలతో, విదేశాల్లోని సంఘాలతో ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ఈ బిల్లు ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.
* ఈ బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net