Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
భూమికి భూమి అడగొద్దు
ప్రభుత్వ విభాగాలకు కేంద్రం లేఖ
మెట్రో రైల్‌కు తొలగనున్న అడ్డంకులు
ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో రైల్‌ నిర్మాణాలకు అడ్డంకులు తొలగనున్నాయి. భూమి కేటాయింపు విషయంలో ప్రత్యామ్నాయం, పరిహారం పేరుతో కాలయాపన చేయొద్దని కేంద్రం స్పష్టం చేసింది. నగరాల్లో మెట్రో రైళ్ల నిర్మాణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల స్థలాలు ఇచ్చేందుకు దీర్ఘకాలిక సంప్రదింపులతో కాలయాపన జరుగుతోంది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగి ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని కేంద్రం గుర్తించింది. ఇక నుంచి జాప్యం చేయరాదంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు సాధ్యం కాదని, అలా కోరవద్దని స్పష్టం చేసింది. మెట్రో రైల్‌ నిర్మాణ సంస్థలకు భూ బ్యాంకు (ల్యాండ్‌ బ్యాంక్‌) ఉండదన్న అంశాన్ని ప్రభుత్వ విభాగాలు గుర్తించాలని కేంద్రం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ నిర్మాణంలో రైల్వే మంత్రిత్వ శాఖతో నలుగుతున్న వ్యవహారానికి తెరపడనుంది.

ప్రభుత్వ స్థలాలిచ్చే సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో తాము కోల్పోతున్న భూమికి ప్రత్యామ్నాయంగా అంతే మొత్తంలో భూమిని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వం రంగ సంస్థలు పట్టుపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ భూమికి మార్కెట్‌ ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో వీటి నిర్మాణంలో అనూహ్య జాప్యం జరుగుతోందని కేంద్రం గుర్తించింది. ఇక నుంచి మెట్రోరైలు ప్రాజెక్టును మంత్రివర్గం ఆమోదించిన వెంటనే ఆయా స్థలాలు, భూముల హక్కును బదలాయించాలని స్పష్టం చేస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

రైల్వే ఆస్తుల బదలాయింపుకు మార్గం సుగమం!: మెట్రో రైల్‌ తొలి దశ నిర్మాణంలో భాగంగా సుమారు పది ప్రాంతాల్లో రెండెకరాల స్థలాన్ని దక్షిణ మధ్య రైల్వే బదలాయించాల్సి వచ్చింది. ఈ పది స్థలాల్లో ఆరు ప్రాంతాలు శిల్పారామం నుంచి నాగోలు మార్గంలోనే ఉన్నాయి. ఆరు ప్రాంతాల్లో 6,888 చదరపు గజాల స్థలాన్ని రైల్వే శాఖ మెట్రో రైల్‌కు అందజేయాల్సి ఉంది. తొలుత ప్రత్యామ్నాయ భూమిని కోరినప్పటికీ ఆ తరవాత మార్కెట్‌ ధర చెల్లించాలని దక్షిణ మధ్య రైల్వే పట్టుపడుతూ వచ్చింది. ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ ధర మాత్రమే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీనిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖలు సాగుతున్నా ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. భూసేకరణ కోసం ప్రభుత్వం సుమారు రూ.35 కోట్లను దక్షిణ మధ్య రైల్వే వద్ద జమ చేసింది. మెట్రో రైలు నిర్మాణంలో రైల్వే శాఖ నుంచి వస్తున్న ఇబ్బందులను గత నెలలో హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభుకు సీఎం కేసీఆర్‌ లిఖితపూర్వకంగా అందజేశారు. రైల్వే మార్గంలో వంతెనల నిర్మాణంపై వారంలోనే రైల్వే శాఖ నుంచి స్పందన లభించింది. స్థలాల కేటాయింపు విషయంలో ఆ శాఖ ఆరా తీస్తోంది. కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో రైల్వే ఆస్తుల వ్యవహారం కూడా కొలిక్కి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net