Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
సూక్ష్మసేద్యం పథకంలో కీలకమార్పు
కంపెనీల ఎంపికలో రైతులకు పూర్తి స్వేచ్ఛ
మార్గదర్శకాలను ఆమోదించిన ప్రభుత్వం
అక్రమాల నివారణకు చర్యలు
ఈనాడు - హైదరాబాద్‌
సూక్ష్మసేద్యం పథకం అమలులో కీలక మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఈ పథకం కింద బిందు, తుంపర్ల పరికరాలు ఏర్పాటుచేసే కంపెనీలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను పూర్తిగా ఇక రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంతకాలం జిల్లాల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన కంపెనీల పరికరాలను రైతులు తీసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల కంపెనీలు రైతులపై పెత్తనం చేస్తూ నాసిరకం పరికరాలు అంటగట్టేవి. ఈ సమస్య నుంచి రైతులను గట్టెక్కించడానికి మార్కెట్‌లో తనకు నచ్చిన కంపెనీ పరికరాలను కొనుగోలుచేసే అవకాశాన్ని రైతులకు ఇస్తూ రూపొందించిన మార్గదర్శకాలను ప్రభుత్వం గురువారం ఆమోదించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీకానున్నాయని అధికార వర్గాలు ‘ఈనాడు’కు చెప్పాయి. గతంలో కొన్ని కంపెనీలు సచివాలయంలో పైరవీలతో తమకు నచ్చినట్లుగా జిల్లాల వారీగా లక్ష్యాలు సాధించుకునేవి. ఆయా కంపెనీలకు ఒక్కో జిల్లాలో అధికంగా ఎకరాలను కేటాయించి వారి వ్యాపారం పెరిగేందుకు గతంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులు లోపాయికారీగా సహకరించేవారు. ఇటీవల వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు తమకు నచ్చిన కంపెనీ నుంచి బిందు, తుంపర్ల పరికరాలు కొనుక్కునే స్వేచ్ఛ లేక నష్టపోతున్నట్లు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకొన్న మంత్రి గత పదేళ్లుగా పథకం అమలైన తీరును అంతర్గతంగా పరిశీలించినట్లు సమాచారం. ఆయన పలు అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించారు. దీన్ని సవరిస్తూ కొత్త మార్గదర్శకాలు తేవాలని తాజాగా నిర్ణయించారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో బిందు, తుంపర్ల పరికరాలు రైతులకు రాయితీపై ఇవ్వడానికి మొత్తం 22 కంపెనీలను ఉద్యానశాఖ ఎంపిక చేసింది. ప్రతి జిల్లాలో అన్నీ కంపెనీలూ పరికరాలు సరఫరా చేయడానికి అవకాశం కల్పిస్తారు. మండలాల ఉద్యానశాఖాధికారుల వద్ద ఉండే కంపెనీల జాబితాలోని ఏ కంపెనీ పరికరాలు బాగున్నాయని భావిస్తే దానిపేరును రైతు దరఖాస్తులో తెలిపితే సరిపోతుంది. ఉద్యానశాఖ ఆ రైతుకు ఆ కంపెనీ నుంచి పరికరాలు అందేలా చూస్తుంది. ఈ పథకంలో అక్రమాలను నివారించేందుకు జీపీఎస్‌ పద్ధతిలో ప్రతి రైతు పొలాన్ని పరికరాలు అమర్చక ముందు, అమర్చిన తర్వాత ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో పంపాలని ఉద్యానశాఖ అన్నీ జిల్లాల అధికారులను ఆదేశించింది.

1.25 లక్షల ఎకరాల లక్ష్యం...
తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షా 25 వేల ఎకరాల్లో బిందు, తుంపర్ల పరికరాలను సూక్ష్మసేద్యం పథకం కింద రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 96,371 ఎకరాల్లో బిందు(డ్రిప్‌) సేద్యానికి, మిగతా విస్తీర్ణంలో తుంపర్ల(స్ప్రింక్లర్ల) పరికరాలు అమర్చనున్నారు. కోరిన రైతులకు తుంపర్ల పరికరాలు 50 శాతం రాయితీపై ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పలు జిల్లాల రైతులకు ప్రయోజనం కలుగనుంది.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి

బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రానికి కొన్ని మార్పులు చేయనున్నట్లు దర్శకుడు ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net