Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
వేగం.. 4జీ నాదం!
అందుబాటులోకి నాలుగోతరం సాంకేతిక ఫలాలు
సెకనుకు వంద మెగాబైట్ల ప్రసార సామర్థ్యం
క్షణాల్లోనే వీడియో, ఆడియో డౌన్‌లోడ్‌
ఉన్నచోటు నుంచే వీడియో కాన్ఫరెన్స్‌కు వీలు
ఈనాడు - హైదరాబాద్‌
మొబైల్‌ సాంకేతిక పరిజ్ఞానంలో కొత్తతరం దూసుకొచ్చేస్తోంది. మూడోతరాన్ని మించిన వేగంతో సరికొత్త విప్లవానికి, టెలికం రంగంలో మార్పులకు నాలుగోతరం (4జీ) సేవలు నాంది పలుకనున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే... ఒక్క సెకనులోనే ఈ-మెయిల్‌ తెరవచ్చు. మూడు సెకన్లలో ఎంపీ3 పాటను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సెకనుకు వంద మెగాబైట్ల (ఎంబీ) సామర్థ్యంతో ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. కూర్చున్న చోటు నుంచే స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌ల నుంచి ఏకంగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించుకోవచ్చు. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో...!

కాలంతోపాటే మొబైల్‌ ఫోన్ల వినియోగంలోనూ ఎన్నో మార్పులొస్తున్నాయి. మొదట్లో అవతలి వ్యక్తులతో మాట్లాడేందుకే ఎక్కువగా ఫోన్‌లను వాడేవారు. కంపెనీలకు కూడా ఈ ఆదాయమే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు డేటా సేవల ద్వారానే వాటికి అధికాదాయం లభిస్తోంది. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్లలోని అప్లికేషన్ల ద్వారా ఉచితంగానే మాట్లాడుకుని, సంక్షిప్త సందేశాలు (ఎస్‌ఎంఎస్‌) పంపుకొంటున్నారు. ఇలాంటి అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్లలో వాట్సాప్‌ ప్రాచుర్యంలో ఉందిప్పుడు. ప్రస్తుత వినియోగదారుల్లో చాలామంది 2జీ నెట్‌వర్క్‌ను వాడుతున్నారు. ఇది చాలా నెమ్మదిగా ఉంటోంది. వీడియోకాల్స్‌ చేయడానికి, ఈ-మెయిళ్లు తెరవడానికి సమయం పడుతోంది. కొన్నిసార్లు నెట్‌వర్క్‌ సరిగా పనిచేయక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 3జీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంచెం వేగం పెరిగింది. 2జీతో పోల్చితే ఈ బ్రాడ్‌బ్యాండ్‌ డేటా ప్యాకేజీ ధర ఎక్కువే. అయినా యువత త్రీజీ మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ డేటాను ఎక్కువగా వినియోగిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు, నూతన అప్లికేషన్లు, పెరుగుతున్న ఐటీ వినియోగం, మారుతున్న యువత ఆలోచనల నేపథ్యంలో... కొత్తగా వచ్చే 4జీ సేవలు వారికి మరింత చేరువకానున్నాయి. ఈ సేవల ద్వారా సెకనుకు 100 ఎంబీ వేగంతో అప్లికేషన్లు, వీడియోలు, పాటలను డౌన్‌లోడ్‌ అవుతాయి. సెకనుకు 50ఎంబీ వేగంతో వాటిని అప్‌లోడ్‌ చేసుకోవచ్చు కూడా. దేశ, విదేశాల్లోని బంధువులు, స్నేహితులతో స్పష్టంగా వీడియో చాటింగ్‌ చేసుకోవచ్చు.

ఉపయోగాలివీ...
* ప్రస్తుతం 1జీబీ డేటా టారిఫ్‌ రూ.145 అవుతోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు... 4జీ సేవలు అందుబాటులోకి వస్తే 1జీబీ డేటా ఖర్చు రూ.35కు తగ్గే అవకాశముంది.
* ఈ సేవల ఆధారిత మొబైల్‌, ట్యాబ్‌లెట్లలో వీడియోలు, డాక్యుమెంట్లు, పాటలు సెకన్లలో డౌన్‌లోడ్‌ అవుతాయి. పూర్తిస్థాయి సినిమాల స్ట్రీమింగ్‌ వేగం పెరుగుతుంది.
* వైఫై నెట్‌వర్క్‌ ఉంటేనే మొబైల్స్‌లో వీడియో చాటింగ్‌కు అవకాశం ఉంటుంది. వీడియో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అదే 2జీ, 3జీ నెట్‌వర్క్‌లో అంత స్పష్టంగా ఉండదు. ముందు కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్లతో స్కైప్‌, గూగుల్‌ హ్యాంగవుట్‌, వియ్‌చాట్‌, ఫేస్‌టైమ్‌ తదితర అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్లతో వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. అలాగే వాయిస్‌ సౌకర్యం అందిస్తున్న వైబర్‌, నింబుజ్‌, ఫ్రింగ్‌ వంటి వాటి ద్వారా ఆటంకాల్లేకుండా స్పష్టంగా మాట్లాడుకోవచ్చు.
* మొబైల్‌ ఆఫీసు ద్వారా డాక్యుమెంట్లు, ప్రజెంటేషన్లు, ఎక్సెల్‌ షీట్‌లోని డేటాను నమోదుచేసి, సంబంధిత వ్యక్తులకు వేగంగా పంపించవచ్చు. వీడియో కాన్ఫరెన్సు కూడా పెట్టుకోవచ్చు. మల్టీప్లేయర్‌ ఆప్షన్‌ ద్వారా ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకేసారి గేమ్‌ కూడా ఆడుకోవచ్చు.
* 4జీ సేవల్లో వేగం ఎక్కువ. వైఫై, బ్లూటూత్‌ ద్వారా ఇతర ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లతో అనుసంధానం చేసుకోవచ్చు. ఒకేసారి రెండు ఫోన్లు, ఫోన్‌-ల్యాప్‌టాప్‌లో ఇంటర్నెట్‌ వినియోగానికి వీలుంటుంది.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net