Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
సొంత రాష్ట్రంలో చదువులకే మొగ్గు
ఇంజినీరింగ్‌ విద్యార్థుల దృక్పథంలో మార్పు!
బోధన రుసుముల్లో అస్పష్టత, ఇతరత్రా అంశాలే కారణం
ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ విద్యలో ప్రవేశాలపై విద్యార్థుల దృక్పథం మారుతోంది. బోధన రుసుముల చెల్లింపుల పథకం అమల్లో నెలకొన్న అస్పష్టత, ఇతర ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వారి స్వరాష్ట్రాల్లోనే చదివేందుకు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయని కళాశాలల యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచీ ఇదే తరహా అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదివేందుకు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర నుంచి విద్యార్థులు రావడం పరిపాటి. హైదరాబాద్‌, చుట్టుపక్కల కళాశాలల్లో చదువుకుంటే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్న ఆశతో పిల్లల్ని పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో అత్యధికులు కన్వీనర్‌ కోటాలో, మరికొందరు యాజమాన్య కోటా (బి) కేటగిరిలో చేరుతున్నారు. కన్వీనర్‌ కోటాలో చేరే విద్యార్థులు వార్షిక ఆదాయ పరిమితి నిబంధన సాయంతో బోధన రుసుముల చెల్లింపు పథకం కింద ప్రయోజనం కూడా పొందుతున్నారు. ఇలాంటివారి సంఖ్య ఏటా కనీసం 25 వేలదాకా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరిలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌లోని కళాశాలల్లోనే చదివేందుకు, లేదా ఇతర పొరుగు రాష్ట్రాల్లో చదివేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ‘బి’ కేటగిరి సీట్ల కోసం కూడా గత ఏడాదితో పోలిస్తే.. ప్రస్తుతం వివరాల కోసం వస్తున్న వారి సంఖ్య పెరిగిందని ఏపీలోని కళాశాలల యాజమాన్యాల వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు.. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి 330 వరకు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. కళాశాల స్థాయి, పేరు ప్రఖ్యాతులను బట్టి 15 నుంచి 20% మందిదాకా ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఇక్కడ చేరుతున్నారు. ఉద్యమాల కారణంగా గత మూడేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈసారి అది ఎక్కువగా ఉండబోతోందని ఓ కళాశాల యాజమాని పేర్కొన్నారు. అలాగే.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో చదివే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యలో 3.5 లక్షల వరకు సీట్లు ఉండగా.. తాజా పరిణామాలతో రెండుచోట్ల భారీగా సీట్ల మిగులనున్నాయి.

సీట్ల భర్తీ వద్దని...!
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఏఐసీటీఈ నుంచి ఆమోదం పొందిన సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేసుకోవడానికి వెనుకంజవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభ సమయానికి ఈ మేరకు విజ్ఞప్తి చేసుకునే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో కొన్నింటిలో తప్పిస్తే.. అత్యధిక కళాశాలల్లో 500, ఆపైనే సీట్లున్నాయి. ఇప్పుడీ సంఖ్యను తగ్గించుకోవాలని చాలా కళాశాలలు యోచిస్తున్నాయి. మనుగడ కోసం సీట్ల తగ్గింపు, కోర్సుల నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం అనివార్యంగా కనిపిస్తోందని ఓ కళాశాల యజమాన్య ప్రతినిధి పేర్కొన్నారు. మరికొన్ని కళాశాలలు తొలివిడత కౌన్సెలింగ్‌ సీట్ల భర్తీ తీరును పరిశీలించి.. మలివిడత కౌన్సెలింగ్‌ సమయంలో నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు ఉన్నాయి.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net