Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'


ఫిల్మ్‌ఫేర్‌లో ‘బాజీరావు మస్తానీ’కి అవార్డుల పంట

ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌: తారల తళుకులు.. ఆహూతుల చప్పట్ల మధ్య బ్రిటానియా 61వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సంజయ్‌లీలాభన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘బాజీరావు మస్తానీ’ చిత్రం పలు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్ర కథానాయకుడు రణ్‌వీర్‌సింగ్‌ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకోగా సంజయ్‌లీలాభన్సాలీ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. పీకూ చిత్రానికి దీపికా పదుకొణె ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. మరోవైపు క్రిటిక్స్‌ విభాగంలో అమితాబ్‌ బచ్చన్‌ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ‘పీకూ’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌ ’ చిత్రంలోని ఉత్తమ నటనకు కంగనారనౌత్‌ ఉత్తమ నటి అవార్డు అందుకొంది. బజరంగీ భాయీజాన్‌ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న తెలుగు కథారచయిత విజయేంద్రప్రసాద్‌ ఉత్తమ కథా రచయిత అవార్డు గెలుచుకున్నారు.
అవార్డుల వివరాలు..
ఉత్తమ చిత్రం- బాజీరావ్‌ మస్తానీ
ఉత్తమ దర్శకుడు- సంజయ్‌లీలా బన్సాలీ (బాజీరావ్‌ మస్తానీ)
ఉత్తమ నటుడు-రణ్‌వీర్‌సింగ్‌(బాజీరావ్‌ మస్తానీ)
ఉత్తమ నటి- దీపికా పదుకొణె(పీకూ)
ఉత్తమ సహాయ నటుడు- అనిల్‌కపూర్‌( దిల్‌ దడ్కనే దో)
ఉత్తమ సహాయ నటి-ప్రియాంక చోప్రా(బాజీరావ్‌ మస్తానీ)
ఉత్తమ సంగీత దర్శకుడు- అంకిత్‌తివారీ, అంజన్‌, అమల్‌ మాలిక్‌ (రాయ్‌)
ఉత్తమ గేయ రచయిత- ఇర్షద్‌ కమిల్‌( తమాషా)
ఉత్తమ నేపథ్య గాయకుడు- అర్జిత్‌ సింగ్‌( రాయ్‌)
ఉత్తమ నేపథ్య గాయని( శ్రేయా గోషల్‌(బాజీరావ్‌ మస్తానీ)
క్రిటిక్స్‌ కేటగిరీలో..
ఉత్తమ చిత్రం- పీకూ
ఉత్తమ నటుడు - అమితాబ్‌బచ్చన్‌( పీకూ)
ఉత్తమ నటి- కంగనా రనౌత్‌(తను వెడ్స్‌ మను రిటర్న్స్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ- మను ఆనంద్‌(దమ్‌ లగాకే హైసా)
ఉత్తమ కథ- విజయేంద్రప్రసాద్‌(బజరంగీ భాయిజాన్‌)
జీవిత సాఫల్య పురస్కారం-మౌషుమి ఛటర్జీ
తొలి పరిచయం కేటగిరీలో..
ఉత్తమ నటుడు- సూరజ్‌ పంచోలి( హీరో)
ఉత్తమ నటి- భూమి పెడ్నేకర్‌ (దమ్‌ లగా కే హైసా)
ఉత్తమ దర్శకుడు - నీరజ్‌ ఘైవాన్‌(మసాన్‌)



పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

ఆటో నడిపిన సినీనటుడు అఖిల్‌

సినీనటుడు అఖిల్‌ మంగళవారం ఖమ్మం నగరంలో ఆటో నడిపి సందడి చేశాడు. స్థానిక నరసింహస్వామి దేవాలయ సమీపంలో కిడ్నీ వ్యాధితో.....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net