Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
ఎవరి వాదన వారిదే
ఆర్టీసీ విభజనపై కుదరని ఏకాభిప్రాయం
ఈనాడు - హైదరాబాద్‌
ర్టీసీ విభజన కసరత్తుపై పీటముడి పడింది. ఈ సంస్థకు సంబంధించిన కీలకమైన ఆస్తులు, ఉద్యోగుల పంపకాలపై ఇరు రాష్ట్రాల కార్మిక, ఉద్యోగ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎవరివాదనలకు వారు కట్టుబడి ఉండటంతో విభజన విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. దీన్ని తొలగించేందుకు ఆర్టీసీ యాజమాన్యం త్వరలో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, జేఎండీ రమణారావు, ఈడీ (పాలన) ఎ.వెంకటేశ్వరరావులు.. ఇరు రాష్ట్రాల ఉద్యోగ,కార్మిక సంఘాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను చర్చించే అవకాశం ఉంది.

ఆర్టీసీ విభజనపై యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న విమర్శల నేపథ్యంలో.. సంప్రదింపుల ప్రక్రియ తెరపైకి వచ్చింది. యాజమాన్యం సూచనమేరకు ఏపీ, తెలంగాణలో తొమ్మిదేసి మందితో కమిటీలు ఏర్పాటయ్యాయి. ఏపీ కమిటీ ఈడీ (ఏ)కి, తెలంగాణ కమిటీ జేఎండీకి.. తర్వాత ఎండీకి విభజన ప్రక్రియపై నివేదికలు ఇచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీ, తెలంగాణ కమిటీల వాదనలు ఇవీ..

ఏపీ కమిటీ
ఆస్తులు: 14 ఆస్తులను ఉమ్మడి ఆస్తులుగా పరిగణించి చట్టప్రకారం పంచాలి. కేంద్ర ప్రభుత్వం నియమించిన షీలాబేడి కమిటీకి ఏవి ఉమ్మడి ఆస్తులో వివరిస్తూ ఒక ప్రతిపాదన పంపాలి. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపే నివేదికల్లోనూ ఈ 14 ఆస్తుల్ని ఉమ్మడిగా పేర్కొనాలి. షీలాబేడీ కమిటీ 14 ఆర్టీసీ కేంద్రకార్యాలయాల ఆస్తుల్ని ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం 58.32:41.68 నిష్పత్తిలో పంచాలి. దీని ప్రకారం ఏపీకి రూ.1,600కోట్లు రావాలి. ఈ మొత్తాన్ని ‘ఏపీ’ఎస్‌ ఆర్టీసీకి ఎవరిస్తారు? అన్నది తేల్చాలి.

ఉద్యోగులు: యాజమాన్యం రూపకల్పన చేసిన మార్గదర్శకాలు (కమలనాథన్‌కమిటీ తరహా) ఆమోదయోగ్యం. రాష్ట్రస్థాయి అధికారుల విభజనలో ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులకు ఆప్షన్లు ఇవ్వాలి.

బస్‌ పర్మిట్లు: హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించినందువల్ల అప్పటివరకు ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులకు ఉమ్మడి పర్మిట్లు ఇవ్వాలి. అంతర్రాష్ట బస్సులుగా పరిగణించవద్దు. ఏపీ సచివాలయం హైదరాబాద్‌లో కొనసాగించినంతకాలం ఏపీఎస్‌ఆర్టీసీ పరిపాలన హైదరాబాద్‌ నుంచి కొనసాగాలి.

తెలంగాణ కమిటీ
ఆస్తులు: భౌగోళికంగా ఎక్కడున్న ఆస్తులు ఆ రాష్ట్రానికే దక్కాలి. ఉమ్మడిఆస్తుల పేరిట విభజనను ఒప్పుకోం. ఏపీఎస్‌ఆర్టీసీ కార్యకలాపాలు హైదరాబాద్‌లో కొనసాగినంతకాలం రాజధానిలో భవనాలను ఉపయోగించుకోవచ్చు. ఉమ్మడి ఆస్తుల విభజనపై షీలాబేడీ కమిటీ ఏర్పాటైంది. ఆస్తుల పంపకాల్ని కమిటీ నిర్ణయిస్తుంది.

ఉద్యోగులు: నాలుగు నుంచి పదోతరగతి వరకు చదివిన ప్రాంతాల ఆధారంగా రాష్ట్రస్థాయి ఉద్యోగుల స్థానికతను నిర్ధారించాలి. ఆ ప్రకారంగా విభజన జరగాలి. యాజమాన్యం రూపొందించిన మార్గదర్శకాలు ఆమోదయోగ్యం కాదు. ఆప్షన్లను అంగీకరించేదిలేదు.

బస్‌ పర్మిట్లు: బస్‌ రూట్‌పర్మిట్లను తెలంగాణ కమిటీ నివేదికలో పేర్కొనలేదని తెలిసింది. ఐతే ఈ విషయంలో అధికారుల సంఘం మాత్రం కార్పొరేషన్‌ విభజన తర్వాత- ఒకరాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే బస్సుల్ని అంతర్రాష్ట బస్సు సర్వీసులుగానే పరిగణించాలని కోరుతోంది.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net