Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
కన్నడ ‘వైద్యం’.. పీజీకి చేటు!
కర్ణాటకలో స్థానికులకే అవకాశం
రాష్ట్ర విద్యార్థులకు తీరని అన్యాయం
ఆంధ్రలో అన్ని రాష్ట్రాల వారికీ సీట్లు
పొరుగు రాష్ట్రానికెళ్తే.. ఇక్కడా పాయే!
పీజీ వైద్య ప్రవేశాల్లో తేడాలెన్నో..
ఈనాడు - హైదరాబాద్‌
పీజీ వైద్య కోర్సుల ప్రవేశాల్లో అనుసరిస్తున్న విధానాలు ఎంబీబీఎస్‌ విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. పీజీ సీట్ల ప్రవేశాలకు ‘స్థానికత’ అంశం వివాదాస్పదంగా మారుతోంది. ఎంబీబీఎస్‌ ఏ రాష్ట్రంలో చదివితే, వారు ఆ రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో చేరడానికి స్థానికులుగా పరిగణిస్తారు. మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ చదివి, తిరిగి పీజీ మన రాష్ట్రంలో చేరాలంటే.. మన రాష్ట్రంలో అమల్లో ఉన్న విధానం కారణంగా ఇక్కడ స్థానికేతరుల కోటా (15శాతం సీట్లు) కింద పరిగణిస్తున్నారు. తాజాగా 2014-15 విద్యాసంవత్సరం నుంచి కర్ణాటక ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ కోటాలో పీజీ వైద్యకోర్సుల్లో చేరాలంటే స్థానికులకు మాత్రమే అర్హులుగా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం కర్ణాటకలో కనీసం పదేళ్లు విద్యాభ్యాసం చేయడం లేదా విద్యార్థి తల్లిదండ్రులు ఉద్యోగులవడం లేదా ఆ రాష్ట్రంలో పదేళ్లు నివాసం కలిగి ఉంటేనే స్థానికులుగా గుర్తిస్తారు. వీరు మాత్రమే అక్కడ ప్రభుత్వ కోటాలో సీట్లు పొందడానికి అర్హులుగా వైద్య ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలు సవరించారు. ఈ నిర్ణయం వల్ల కర్ణాటకలో ఎంబీబీఎస్‌ చదువుతున్న మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అక్కడ పీజీ కోర్సుల్లో ప్రభుత్వ కోటా కింది సీట్లు పొందడానికి అర్హత కోల్పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కర్ణాటకలో చదివితే.. రెంటికీ చెడటమేనా!
మన రాష్ట్రంలో ఎంబీబీఎస్‌లో సీట్లురాని విద్యార్థుల్లో ఎక్కువ మంది కర్ణాటక, తమిళనాడులోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో చేరుతున్నారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నో ఆశలతో అక్కడ ఎంబీబీఎస్‌లో చేరినవారు, పీజీ కోర్సులు చేరడానికి అక్కడ అర్హత కోల్పోతుండడంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటర్మీడియట్‌ వరకు ఆంధ్రప్రదేశ్‌లో చదివి, కర్ణాటకలో ఎంబీబీఎస్‌ చేసినందున.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానికేతరులుగా మారుతున్నారు. ఇలా రెండు చోట్ల ప్రభుత్వ కోటా సీట్లలో స్థానికత పేరుతో ప్రాధాన్యం కోల్పోతున్నారు. కానీ మన రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ చదివే ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ స్థానికుల కోటా కిందకు వస్తున్నారు. ఈ విధానం వల్ల పీజీ సీట్లకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా రెండు చోట్లా అవకాశాలు కోల్పోతున్నామని కర్ణాటకలో ఎంబీబీఎస్‌ చదువుతున్న రాష్ట్ర విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటకలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో దాదాపు 25 శాతం మంది మన రాష్ట్రానికి చెందిన వారే. వీరు ఏటా కోట్లాది రూపాయలు రుసుముల రూపంలో చెల్లిస్తున్నారు. కర్ణాటకలో ఎంబీబీఎస్‌ ప్రవేశాల సమయంలోనే ఈ తరహా విధానం అమల్లో ఉంటే, అక్కడ చేరకపోయే వారమని ఓ విద్యార్థి వాపోయారు. దీనిపై మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇక్కడా రాష్ట్రేతరులకు కర్ణాటక తరహా విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి పెరిగి ఎంబీబీఎస్‌ చదవడానికి ఇక్కడ అవకాశం లేక, కర్ణాటక వెళ్లినందుకు ఇక్కడ స్థానికేతరులుగా పరిగణించడం సబబు కాదంటున్నారు. కర్ణాటకలో పీజీ వైద్యప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 31 కావడంతో మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి దృష్టికి తీసుకువెళ్లగా.. కర్ణాటక ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై అధికారిక సమాచారం తెప్పించుకున్న తరవాత ఉన్నతస్థాయిలో చర్చిస్తామన్నారు.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net