Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
గోదావరి సీమదారి!
నాలుగు దశల్లో రాయలసీమ జిల్లాలకు 40 టీఎంసీల నీరు
కొత్తగా రిజర్వాయిర్లు, ఎత్తిపోతల పథకాల నిర్మాణం
అంచనా వ్యయం రూ.13,600 కోట్లు
సాధ్యాసాధ్యాలపై అధ్యయనం
ఈనాడు - హైదరాబాద్‌
గోదావరి వరద నీటిని పెన్నా నదికి మళ్లించి, అక్కడ నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమ జిల్లాలకు నీరు సరఫరా చేసే భారీ పథకంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వేల కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ పథకంపై నీటిపారుదల శాఖలోనే భిన్నాభిప్రాయాలుల వ్యక్తమవుతుండడంతో లోతుగా అధ్యయనం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు.

కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు జల రవాణ మార్గం (ఇన్‌లాండ్‌ వాటర్‌వే-4) నిర్మించాలన్న ప్రతిపాదన ఉండడంతో, దాన్ని నీటి సరఫరాకు కూడా ఉపయోగంచుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాకినాడ కాలువ నుంచి ధవళేశ్వరం, ఏలూరు కాలువ, ప్రకాశం బ్యారేజీ, బకింగ్‌హాం కాలువ, కొమ్మమూరు కాలువ, తడ మీదుగా జలరవాణా మార్గం అభివృద్ధి చేయడంపై వాప్కోస్‌ సంస్థ అధ్యయనం చేసి ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియాకు నివేదిక సమర్పించింది. కాకినాడ నుంచి తడ వరకు 560 కి.మీ. మేర ప్రస్తుతం ఉన్న కాలువలను అభివృద్ధి చేయనున్నారు. దీనిని అవకాశంగా తీసుకొని గోదావరి, కృష్ణా నదుల నీటిని పెన్నాలో కలిపి అక్కడ నుంచి కడప, ఇతర రాయలసీమ జిల్లా వరకు తీసుకెళ్లవచ్చన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. మొత్తం నాలుగు దశల్లో 40 టీఎంసీల నీటిని మళ్లించేందుకు రూ.13,600 కోట్లు వ్యయమవుతుందని అంచనా.

ఒకటో దశ
మొదటి దశలో 113 కి.మీ పొడవు ఉన్న కృష్ణా నది కుడివైపు ఉన్న కొమ్మమూరు కాలువను జల రవాణ మార్గానికి అనువుగా 32 మీడర్ల వెడల్పు చేయాలని ప్రతిపాదించారు. దీనిని 50 మీటర్ల వెడల్పు చేస్తే ప్రకాశం బ్యారేజీ నుంచి పది టీఎంసీల నీటిని మళ్లించడం వీలవుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉన్నప్పుడు ఈ నీటిని మళ్లించి పారిశ్రామిక అవసరాలకు వాడుకోవచ్చు. దీనికి సుమారు రూ.1200 కోట్లు వ్యయమవుతుందని అంచనా.

రెండో దశ
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పది టీఎంసీల వరద నీరు మళ్లింపునకు అదనంగా మరో పది టీఎంసీల గోదావరి నీటిని కూడా పెన్నాలోకి మళ్లించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో బాగంగా ఏలూరు నుంచి విజయవాడ వరకు కొత్త కాలువ తవ్వుతారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన పది కి.మీ దూరంలో కొత్త ఆనకట్ట నిర్మించి అక్కడ నుంచి ఎత్తిపోతల ద్వారా కృష్ణా కుడిగట్టు కాలువకు అక్కడ నుంచి కొమ్మమూరు కాలువ(పెద్దవడ్లపూడి)కు నీరు సరఫరా చేస్తారు. ఇందుకోసం కొమ్మమూరు కాలువను పెద్దవడ్లపూడి- పెద్ద గంజాం (113 కి.మీ) మధ్య వెడల్పు చేయాల్సి ఉంటుంది. దీనికి సుమారు రూ.3400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.

మూడో దశ
గోదావరి నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం కింద కొత్త పథకాన్ని చేపట్టాలన్నది మూడోప్రతిపాదన. పోలవరం ఆనకట్ట దిగువ భాగంలో తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద కొత్త పంపుహౌస్‌ను నిర్మించి 20 టీఎంసీల నీటిని మళ్లించడం. ఈ నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తీసుకొని రావాల్సి ఉంది. కొమ్మమూరు కాలువను వెడల్పు చేయడం ద్వారా ఈ అదనపు నీటిని పెన్నాకు మళ్లించాల్సి ఉంది. నూరు రోజుల వ్యవధిలో 20 టీఎంసీల నీటిని మళ్లించాలన్నది ప్రతిపాదన. ఇందుకు సుమారు రూ.రెండువేల కోట్లు వ్యయమవుతుందని అంచనా.

నాలుగో దశ: నాలుగో దశలో గోదావరి, కృష్ణా నీటిని రాయలసీమ జిల్లాలకు సరఫరా చేయడం. మొదటి మూడు దశల్లో తెచ్చే 40 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి వీలుగా ప్రకాశం జిల్లాలోని పెద్ద గంజాం సమీపంలో రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలి. ఈ రిజర్వాయర్‌ నుంచి కాలువ ద్వారా తడ పారిశ్రామిక వాడకు కొంత నీటిని మళ్లించాలి. మరికొంత నీటిని కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా సోమశిల ప్రాజెక్టుకు మళ్లించాలి. అక్కడ నుంచి ఎత్తిపోతల ద్వారా కడప జిల్లాకు, అక్కడి ఉక్కు కర్మాగారానికి కూడా సరఫరా చేయాలి. ఇక్కడి నుంచి మళ్లీ ఎత్తిపోతల ద్వారా అనంతపురం జిల్లాలోని హిందూపురానికి, నాలెడ్జి సిటీకి (కర్ణాటక సరిహద్దు వరకు) సరఫరా చేయాలి. సోమశిల నుంచి కండలేరుకు కొంత నీటిని తీసుకెళ్లి అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా చిత్తూరు జిల్లాకు మళ్లించాలి. దీనికి రూ.ఏడువేల కోట్లు వ్యయమవుతుందని అంచనా.

మొత్తం నాలుగు దశల ద్వారా 40 టీఎంసీల నీటని మళ్లించడానికి 13,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది. దీనిపై అధ్యయనం చేస్తున్న నీటిపారుదల శాఖ ఇంజినీర్లు త్వరలో సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. పోలవరం ఆయకట్టు పరిధిలో గోదావరిపై రెండు ఎత్తిపోతల పథకాలు చేపట్టేలా ప్రయత్నాలు చేస్తున్న గుత్తేదారే ఈ ప్రతిపాదనల వెనక ఉన్నట్లు తెలిసింది.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net