Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
కీలక చట్టాలకు స్విస్‌ సవరణలు!
భారత్‌ ఒత్తిడి పర్యవసానం
నల్లధన ప్రయాణం గుట్టురట్టుకు మార్గం సుగమం!
బృందంగా అభ్యర్థిస్తే నల్లఖాతాల వివరాల అందజేత
కీలకాంశాలపై ‘సిట్‌’ చర్చ
బెర్నే/న్యూఢిల్లీ: వివిధ స్విస్‌ బ్యాంకుల్లో నల్లధనం పెద్ద ఎత్తున పోగుపడి ఉందన్న నేపథ్యంలో సంబంధిత చట్టాలకు స్విట్జర్లాండ్‌ కీలక సవరణలు చేసింది. భారత్‌తో సహా పలుదేశాల నుంచి వచ్చిన ఒత్తిడి దరిమిలా స్విస్‌సర్కారు ఈ చర్య చేపట్టింది. స్విస్‌బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం గుట్టురట్టు చేసేందుకు భారత సర్కారు నడుంబిగించి విపరీతమైన ఒత్తిడి తేవడంతో స్విస్‌సర్కారు స్థానిక చట్టాలకు కీలక సవరణలు చేయక తప్పింది కాదు. తాజాగా చేసిన ఈ సవరణలు త్వరలోనే అమలులోకి రానున్నాయి. ఈ సవరణల ప్రకారం నల్లధనం పోగేసుకున్న అనుమానితుల వివరాల కోసం భారత్‌, ఇతర దేశాలన్నీ కూడా ఒక బృందంగా ఏర్పడి అభ్యర్థించేందుకు వీలుకలుగుతుంది.ఆ వివరాలను అందచేయడానికంటే ముందే ఆ సమాచారాన్ని సంబంధిత ఖాతాదారులెవరికీ స్విస్‌బ్యాంకుల అధికారులు తెలియకుండా జాగ్రత్త పడతారు. అంతేకాదు, పన్ను వ్యవహారాల్లో అంతర్జాతీయంగా పాలనాపరమైన సహాయానికి సంబంధించిన ఫెడరల్‌ చట్టానికి స్విస్‌ సర్కారు మరెన్నో సవరణలు సైతం చేసింది. వ్యాపార, వాణిజ్య ఆధారిత నల్లధనం చలామణి అంశంపై భారత్‌లో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ప్రధానంగా చర్చించవచ్చు. నల్లధనం కేసుల పూర్వాపరాలను, మూలాలను తవ్వితీసేందుకు సుప్రీంకోర్టు ‘సిట్‌’ను నియమించిన సంగతి తెలిసిందే. దిగుమతి వాణిజ్యం ‘నల్ల’రంగు పులుముకుంటున్న వాస్తవాన్ని డైరక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ పసిగట్టింది. భారీ మొత్తాల్లో దిగుమతి బిల్లులకు సంబంధించిన లావాదేవీలు జరిగినప్పటికీ...సంబంధిత సరకు మాత్రం అసలు భారత తీరాలను కూడా చేరని చేదునిజం ఇటీవల వెలుగుచూసింది. ఈ అంశంపై ‘సిట్‌’ బృందం కూలంకషంగా చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సిండికేట్‌ బ్యాంకు సీఎండీ ఎస్‌.కె.జైన్‌ భారీ అవినీతి ఆరోపణల కేసును కూడా ‘సిట్‌’ క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్‌కు రహస్య విదేశీ డేటా
ప్రభుత్వం కళ్లుగప్పి ...పన్నులు ఎగ్గొట్టి...విదేశీ బ్యాంకులకు భారీ మొత్తాలను తరలించడానికి సంబంధించిన 24 వేలకు పైగా వివరాలు డజనుకు పై చిలుకు దేశాల నుంచి భారత్‌కు అందాయి. న్యూజిలాండ్‌, స్పెయిన్‌, యుకే, స్వీడన్‌, డెన్మార్క్‌, ఇటలీ, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి ఆయా బ్యాంకుల్లో ఖాతాలు, వాటి స్టేట్‌మెంట్లు భారత్‌కు అందాయి. కేంద్ర ఆర్ధికశాఖ వీటన్నిటినీ ‘సిట్‌’కు అందచేసింది.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net