Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
60 ఏళ్లపై ఆర్డినెన్స్‌
12న చర్చించనున్న మంత్రివర్గం
ఎన్టీఆర్‌ సుజల పథకంపైన మంత్రివర్గంలో చర్చ
అజెండా తయారీలో అధికారులు
ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల వయోపరిమితిని 58 సంవత్సరాల నుంచి 60 ఏళ్లకు పెంపుపైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయబోతోంది. విశాఖపట్నంలో ఈ నెల 12వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశం ఈ మేరకు ఆమోద ముద్ర వేయవచ్చని తెలుస్తోంది. మంత్రివర్గం చర్చించనున్న అంశాల్లో ఇదొకటి. తొలి మంత్రివర్గ సమావేశానికి అజెండా తయారీలో అధికారులు నిమగ్నం అయ్యారు. దీనిపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఐ.వై.ఆర్‌.కృష్ణారావు వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం అయ్యారు. ఉద్యోగుల వయో పరిమితిని రెండేళ్లు పెంచే దస్త్రంపై సీఎం అయిదో సంతకం చేసిన నేపథ్యంలో ఈ అంశం మంత్రివర్గం ముందుకు రానుందని, అందుకు సిద్ధం కావాలని సీఎస్‌ ఆర్థిక శాఖను ఆదేశించారు. మరోవైపు అధికారులు ఇదే విషయంపై న్యాయశాఖను సంప్రదించారు. 1984 ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఏజ్‌ ఆఫ్‌ సూపరేన్యుయేషన్‌) చట్టానికి సవరణ అవసరం కావడంతో ఆర్డినెన్స్‌ ఇవ్వడంపైన చర్చించారు. మంత్రివర్గ సమావేశానికి హాజరు కావలసిందిగా న్యాయశాఖ కార్యదర్శిని ప్రభుత్వం కోరింది. తాగునీటి పథకానికి సంబంధించిన ఎన్టీఆర్‌ సుజలపైన మంత్రివర్గం చర్చించనున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు విధి విధానాల తయారీలో ఉన్నారు. రూ.2కే 20 లీటర్ల తాగునీరు అందిస్తామని తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఆ మేరకే సీఎం చంద్రబాబు దస్త్రంపై మూడో సంతకం చేశారు. రివర్స్‌ ఆస్మాసిస్‌(ఆర్‌వో) ప్లాంట్లు చాలా చోట్ల ఉండడంతో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్ల ద్వారా తాగునీటి సరఫరా సాగుతోంది. ఒక్కో చోట ఒక్కో ధరను వసూలు చేస్తున్నారు. ఆర్వో ప్లాంట్లు ఎన్ని ఏర్పాటు చేస్తారు? అవి ప్రభుత్వ రంగంలోనా? లేక ప్రైవేట్‌లోనా? నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుందా? లేక నిరుద్యోగులకు అప్పగిస్తుందా? తదితర అంశాలపైన మంత్రివర్గ సమావేశం అనంతరం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. తొలి మంత్రివర్గ సమావేశమే అయినప్పటికీ నిర్దిష్ట అజెండాతోనే సమావేశం అవుతోందని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. విశాఖపట్నంలో 1954లో ఒకసారి మంత్రివర్గం సమావేశం అయిందని, మళ్లీ ఇపుడు భేటీ కాబోతోందని ఆయన తెలిపారు. చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు దస్త్రాల్లోని ఇతర హామీల అమలు కార్యాచరణపైనా సమావేశంలో చర్చించనున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రమాదంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీన్ని కూడా మంత్రిమండలి ఆమోదించనుంది.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net