Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
రూ.1.10 లక్షల కోట్ల పైనే!
తెలంగాణ బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం రూ.52 వేల కోట్లు
సాగునీటి రంగానికి రూ.8,500 కోట్లు
రుణ మాఫీకి రూ. 4,650 కోట్లు
మైనార్టీలకు రూ. వెయ్యి కోట్లు
ఎస్సీ, ఎస్టీల నిధుల వెల్లడిలో మార్పులు
అన్నివర్గాలనూ సంతృప్తపరచే యత్నం
నేటి ఉదయం తొలి వార్షిక బడ్జెట్‌
ముందురోజే ఆమోదించిన మంత్రివర్గం
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం తొలి వార్షిక బడ్జెట్‌ భారీగానే ఉండబోతోంది. మొత్తం కేటాయింపులు రూ.1.10 లక్షల కోట్లకు పైగా ఉన్నట్టు సమాచారం. ఇందులో అతి ముఖ్యమైన ప్రణాళిక కేటాయింపులు రూ. 52 వేల కోట్ల మేర ఉంటాయి. సాగునీటి రంగానికి సర్కారు చాలా ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగానికి రూ. 8,500 కోట్ల మేర నిర్దేశించింది. ఏ రంగాన్నీ వదిలిపెట్టకుండా ఎంతోకొంత మొత్తాన్ని పొందుపరిచి అన్నివర్గాల వారిని సంతృప్తిపరిచే ప్రయత్నాన్ని ఈ బడ్జెట్‌లో చేసినట్టు సమాచారం. తెలంగాణ ప్రజానీకం అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యతల మేళవింపుతో దీనిని రూపొందించింది. మంగళవారం రాత్రి రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయి బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. ఇంతవరకు ఇటువంటి భేటీలను బడ్జెట్‌ రోజు ఉదయం నిర్వహించేవారు. ఒకరోజుముందే మంత్రివర్గం భేటీకావటం ద్వారా తెలంగాణ సర్కారు కొత్త సంప్రదాయానికి తెరతీసినట్లయింది. బడ్జెట్‌ను బుధవారం ఉదయం 10 గంటలకు శాసనసభలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌, శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెడతారు.

రాష్ట్రం ఏర్పడ్డాక పూర్తిస్థాయి బడ్జెట్‌..
తెలంగాణ ఏర్పాటయ్యాక వెలువడుతున్న తొలి వార్షిక బడ్జెట్‌ ఇదే కావడంతో దీనికి గత బడ్జెట్‌ కంటే చాలా ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్ర రాబడులు, ఖర్చుల తీరుపై సర్కారుకు అవగాహన ఏర్పడి వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ను తయారు చేసుకోవానికి ఇప్పుడు వీలయింది. అంతేకాకుండా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్‌ 1 నుంచే ఇక కార్యరంగంలోకి దిగేందుకు ఆస్కారం కలగబోతోంది. ప్రస్తుత 2014-15 పది నెలల బడ్జెట్‌లో వివిధ ప్రాధ్యాన్యతలకు పకడ్బందీ కసరత్తును నిర్వహించి కేటాయింపులు జరిపినందున తాజా బడ్జెట్‌లోను దాదాపుగా అవే పథకాలు ఉండబోతున్నట్టు తెలిసింది. ఇటీవల ప్రభుత్వం వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలకూ తాజా బడ్జెట్‌లో నిధులను పొందుపరిచినట్టు సమాచారం. ఇటువంటి వాటిలో బీడీ కార్మికులకు పింఛన్లు వంటివి ఉన్నాయి.

భారీగా ప్రణాళిక కేటాయింపులు: రెవెన్యూ లోటంటూ ఉండని రాష్ట్రం తెలంగాణ అని 14వ ఆర్థిక సంఘం తేల్చిన నేపథ్యంలో వెలువడుతున్న బడ్జెట్‌పై సహజంగానే వివిధ రంగాల వారు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక కేటాయింపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో వివిధ రంగాలకు ఈ కేటాయింపులు రూ. 52,000 కోట్ల మేర ఉండబోతున్నాయి.తెలంగాణలో ప్రస్తుతం వ్యవసాయం వృద్ధి రేటు తిరోగమంలో ఉన్న నేపథ్యంలో సాగునీటి రంగాన్ని బాగా అభివృద్ధి పరుచుకుని తద్వారా వ్యవసాయాన్ని మెరగుపరచాలని సర్కారు సంకల్పించింది. ఇందుకనుగుణంగా ఆ రంగానికి రూ.8,500 కోట్ల మేర కేటాయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జలహారానికి దాదాపు రూ.2,000 కోట్లను, మైనార్టీల సంక్షేమానికి రూ. 1,000 కోట్లు, యాదగిరి గుట్టకు రూ. 100 కోట్లు కేటాయించినట్టు తెలిసింది. ఇంకా పింఛన్లకు సంబంధించిన ఆసరా, దళితులకు భూముల కొనుగోలు, అమర వీరులకు సహాయం, కల్యాణ లక్ష్మి, హరిత హారం వంటి పలు పథకాలకు నిధులను పొందుపరిచారు.

రుణ మాఫీకి రెండో విడతగా రూ.4,650 కోట్లు
రైతురుణాల్లో రూ.ఒక లక్ష వరకు మాఫీ చేస్తామంటూ తెరాస ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ.4,650 కోట్లను కేటాయించినట్టు తెలిసింది. మాఫీ రూపేణా రూ.17,000 కోట్లను బ్యాంకులకు సర్కారు చెల్లించాల్సి ఉండగా ఆ మొత్తాన్ని నాలుగేళ్ల వ్యవధిలో అందజేయాలని సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. అందులో మొదటి విడతగా తొలి బడ్జెట్‌లో రూ.4,250 కోట్లను (25 శాతం) పొందుపరిచి దానిని బ్యాంకులకు జమచేసింది. రైతు రుణ బకాయిల్లో ఈ 25 శాతం మేర మాఫీ కాగా మిగతా మొత్తంపై వడ్డీ పడుతుంది కనుక దాన్ని కూడా చెల్లించాలని ఇప్పుడు నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో రెండో విడత మాఫీకి రూ.4,250 కోట్లు, వడ్డీ కోసం మరో రూ.400 కోట్లు కొత్త బడ్జెట్‌లో చూపించినట్టు సమాచారం.

ముఖ్యమంత్రి విచక్షణ నిధులు రూ.500 కోట్లు
నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి తన విచక్షణాధికారాలతో నిధులను మంజూరు చేసేందుకు ఉద్దేశించిన ‘సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేక నిధి’ కొత్త బడ్జెట్‌లోనూ కొనసాగనుంది. దీని కోసం రూ. 500 కోట్లు ఉంటాయి. నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద ఉభయ సభల సభ్యులకు ఈ ఏడాది రూ. 1.5 కోట్ల చొప్పున అందజేస్తారు. దీనికోసం రూ. 234 కోట్లను కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రూ. 1.5 కోట్లలో ఇప్పటికి సగం మాత్రమే ఇచ్చినందున మిగతా సగాన్ని ఈ నెలాఖరులోగా అందజేస్తారు. ప్రణాళిక నిధుల్లో పంచేందుకు వీలుగా ఉండే నిధుల్లో ఈసారీ ఎస్సీలకు 15.44 శాతం, ఎస్టీలకు 9.34 శాతం మేర నిర్దేశించారు. ఈ నిధులను ఇంతకుముందులా పద్దుల వారీగా మాత్రమే కాకుండా ఆయా శాఖల్లోను చూపిస్తూ కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది.

రాబడులూ ఎక్కువగా అంచనా
ఆర్థిక సంఘం అంచనాలను మించి రెవెన్యూ రాబడులను సర్కారు లక్ష్యంగా పెట్టుకొన్నట్టు తెలుస్తోంది. సొంతపన్నుల ద్వారా వస్తుందని ఆర్థిక సంఘం వేసిన అంచనాలు, కేంద్ర పన్నుల్లో వాటాలు, గ్రాంట్లు, జీఎస్‌డీపీలో 3 శాతం మేర మాత్రమే అప్పులను తెచ్చుకోవాలనే నిబంధనలు, కేంద్ర సౌజన్య పథకాల ద్వారా వచ్చే నిధులు కలపి చూస్తే బడ్జెట్‌ రూ. లక్ష కోట్ల లోపుగానే ఉండాలి. రాష్ట్రం వివిధ పన్నురేట్లను పెంచాలని నిర్ణయించటం, కేంద్రం నుంచి మరికొన్ని రకాల గ్రాంట్లను ఆశించటం వంటి కారణంగా దాని పరిధి పెరిగినట్టు తెలుస్తోంది.

బయటి నుంచి మరిన్ని అప్పులు: కార్పొరేషన్ల ద్వారా మరిన్ని అప్పులను తెచ్చుకుని జలహారం, చెరువుల పునురుద్ధరణ వంటి పనులను భారీగా చేపట్టాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇటువంటి అప్పులను బడ్జెట్‌లో చూపించబోరు. ఎందుకంటే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్రం ఏటా తెచ్చుకోవాల్సిన అప్పులకు గరిష్ఠ పరిమితి అమలవుతుంది. ప్రభుత్వం తన సొంత కార్పోరేషన్ల ద్వారా రుణాలను సేకరించుకున్నప్పుడు ఇటువంటి నిబంధనలను వర్తించవని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం ఆయా కార్పొరేషన్లు రుణాలను తెచ్చుకోడానికి ఇచ్చే హామీలకు గరిష్ఠ పరిమితులు ఉంటాయి. ఇలా రానున్న నాలుగేళ్లలో దాదాపు రూ. 20,000 కోట్లను తేవాలనేది సర్కారు యోచనగా ఉన్నట్టు తెలిసింది. ఇలా అదనపు అప్పులు తేవటం వల్ల ఆయా పనులకు నిధుల కొరత లేకుండా వేగంగా చేపట్టేందుకు వీలవుతుంది.

ఇప్పటికి ఖర్చయింది 60 శాతమే
ప్రస్తుత 2014-15 బడ్జెట్‌ను రూ. ఒక లక్ష కోట్లతో ప్రవేశపెట్టగా ఇప్పటికి 60 శాతం మేర ఖర్చయినట్లు తెలిసింది. పలు రకాల బిల్లులను మార్చి నెలఖరులోగా చెల్లించనుండటంతో ఖర్చు మరికొంత మేర పెరగనుంది.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net