Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
ముక్కోటి.. కష్టాలు శతకోటి
తిరుమల, న్యూస్‌టుడే: ముక్కోటి ఏకాదశి ఘడియలు సమీపించిన తరుణంలో శ్రీవారి భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. కాలినడకన అలిపిరి, శ్రీవారిమెట్టు నుంచి లక్షమందికి పైగా భక్తులు బారులు తీరారు. దివ్యదర్శనం టోకన్లకు వారు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. అన్నపానీయాలు లేక భక్తులు పాట్లు పడ్డారు. అద్దె గదుల కొరతతో సామాన్యుల నుంచి పలువురు ప్రముఖులు కూడా ఆరుబయట వేచి ఉన్నారు. వీఐపీ టిక్కెట్ల కోసం కొందరు ఆందోళనకు దిగారు.

ఈ-హుండీ సదుపాయం: శ్రీవారికి మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఈ-హుండీ సదుపాయాన్ని ఆంధ్రాబ్యాంకు భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ- హుండీ సదుపాయాన్ని ఆంధ్రాబ్యాంకు సీఎండీ రాజేంద్రన్‌, తితిదే జేఈవో శ్రీనివాసరాజు కలిసి శుక్రవారం ప్రారంభించారు. విరాళం ఇవ్వడానికి ఖాతాదారుడు తమ సంబంధిత బ్యాంకుల్లో మొబైల్‌ బ్యాకింగ్‌ కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్‌) ద్వారా విరాళం ఇవ్వడానికి బ్యాంకులు ఆఫర్‌ చేసిన మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌, ఎస్‌ఎంఎస్‌, యూఎస్‌ఎస్‌డీ, ఏటీఎం, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ చానల్స్‌ ఉపయోగించవచ్చు. వీటిని ఉపయోగిస్తూ విరాళాలు పంపడానికి మొబైల్‌ మనీ ఐడెంటిఫైయర్‌(ఎంఎంఐడీ) 9011111ను, మొబైల్‌ నెంబరు 9177977777ను ఉపయోగించాలి. ఎస్‌ఎంఎస్‌ను ఐఎంపీఎస్‌- 9177 977777- 9011111- విరాళం మొత్తం- ఎంఫిన్‌ అని టైప్‌ చేసి 9223173924 పంపాలి. మరిన్ని వివరాల కోసం టోల్‌ఫ్రీ నెంబరు 18004251515 సంప్రదించాలి.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net