Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
శక్తి ఉంది... యుక్తి లేదు!
మానవ అభివృద్ధి సూచీలో దిగజారిన భారత ర్యాంకు
సామాజిక పథకాలు దండిగా ఉన్నా ప్రయోజనం అంతంతమాత్రమే
అమలులో ఎన్నో లోపాలు
సరిదిద్దుకోవాలి.. సంస్కరించుకోవాలి
ఆర్థిక సర్వే విశ్లేషణ
యువశక్తి ఉంది. ప్రభుత్వం నుంచి
ఆర్థిక చేయూతా ఉంది. అయినా
విద్యారంగంలో వెనకబాటే.
ఆరోగ్యపరంగానూ అంతంతే.
జీవన ప్రమాణాలూ గొప్పగా లేవు.
వెరసి మానవ అభివృద్ధి సూచీలో
దిగజారిపోయాం. ఎందుకీ పరిస్థితి?
ఎక్కడుంది లోపం? దిద్దుబాటు చర్యలేమిటి?
వీటన్నింటినీ విశ్లేషించింది ఆర్థిక సర్వే.
మానవ అభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ) ర్యాంకింగ్‌లో భారత్‌ స్థానం దిగజారింది. ఆర్థిక సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) రూపొందించిన హెచ్‌డీఐ వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు.
హెచ్‌డీఐను మూడు ప్రాథమిక పరామితుల ఆధారంగా నిర్ణయిస్తారు. 1. దీర్ఘకాలం ఆరోగ్యవంతమైన జీవితం గడపడం, 2.విద్యావంతులై, జ్ఞానవంతులై ఉండడం, 3. గౌరవప్రదమైన ఆర్థికప్రమాణాలతో జీవించడం. ఈ ప్రమాణాల ఆధారంగా 2012లో హెచ్‌డీఐలో భారత ర్యాంకు 136. 2011లో 134వ స్థానంలో ఉంది. అంటే రెండు స్థానాలు దిగజారింది.
అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నా, ఆ ప్రభావం భారత్‌పై పడినా ఇక్కడ సంక్షేమ పథకాలను ఆపలేదు. వాటిపై ఖర్చు తగ్గించలేదు. బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక చేయూత కొనసాగుతూనే ఉంది. అయినా మానవ అభివృద్ధి సూచీలో వెనకబడ్డామంటే ఎక్కడో ఏదో లోపం ఉన్నట్లే. సంక్షేమ, ఉపాధి పథకాల అమల్లో లొసుగులున్నట్లు ఆర్థిక సర్వే విశ్లేషించింది. వ్యయాలు.. ఫలితాలుగా మారేలా అటు ఆర్థిక వృద్ధి, ఇటు సామాజిక అభివృద్ధి జరగాలని సూచించింది.

యువతే మన బలం
2020 నాటికి భారత జనాభా సగటు వయస్సు 29. చైనా, అమెరికాల్లో అప్పటికి సగటు వయస్సు 37. 2011-2016 మధ్యే 20-35 వయస్సు ఉన్న వారి సంఖ్య ఎక్కువగా చేరుతుంది. ఇది భారత్‌కు ఎంతో మంచి అవకాశం. మానవ అభివృద్ధిలో పురోగతి సాధిస్తే యువ శక్తి.. దేశాభివృద్ధికి, ఆర్థికాభివృధ్ధికి ఎంతో వూతమిస్తుంది.

సవాళ్లు.. పరిష్కారాలు
* శ్రామికవయస్సు ఉన్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నందున ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మానవ అభివృద్ధిలో ఎంతో సానుకూల మందడుగు వేయవచ్చు. దేశవ్యాప్తంగా మన జనాభా సగటు వయస్సు 29 అయినా పలు రాష్ట్రాల్లో సగటు వయస్సు దీన్ని దాటి పోయి ఉంది. అంటే శ్రామికవయస్సు తగ్గిపోతోందన్న మాట. ఈ సగటు వయస్సు ఇంకా పెరగకముందే అవకాశాలను వినియోగించుకోవాలి. ఆరోగ్యం విషయంలో పరిపుష్ఠులను చేయడంతో పాటు విద్యాపరంగా, నైపుణ్యాల పరంగా వారిని నిష్ణాతులను చేయాలి.
* అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఉన్నత జీవన ప్రమాణాలు అందించడం ఒక పెద్దసవాల్‌. మౌలికసదుపాయాల అభివృద్ధి, ఉపాధిని కల్పించే పర్యాటకరంగంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇది సరైన చర్యే.
* సామాజిక, సంక్షేమ పథకాల్లో చాలా సందర్భాల్లో సారూప్యతలు ఉంటున్నాయి. పథకాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ఇదీ ఒక కారణమే.
* వ్యయం.. ఫలితాలుగా మారడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. పంపిణీ (డెలివరీ)వ్యవస్థలో లోపమే. ఈ లోపాన్ని అధిగమించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ముఖ్యంగా ఐటీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. పరిపాలన పరంగా సంస్కరణలు రావాలి. పలు ప్రక్రియలను సరళీకరించాలి. లబ్ధిదారుల భాగస్వామ్యం పెరగాలి.
* సామాజిక రంగ పథకాలు, కార్యక్రమాల అమలులో ప్రైవేటు భాగస్వామ్యం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పెరగాలి. దీనివల్ల బినామీ లబ్ధిదారులను అరికట్టవచ్చు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ఒక ఉదాహరణ.

జనాభాపరంగా మనకున్న అవకాశాలను ప్రయోజనాలుగా మలుచుకోవాలంటే సామాజిక మౌలిక సదుపాయాల రంగంలో, నైపుణ్య అభివృద్ధిలో భారీ పెట్టుబడులు, మహిళాసాధికారికత అవసరం.
ప్రస్తుతం నడుస్తున్న పథకాలకు నిధుల కేటాయింపులో ప్రతి ఏడాదీ ఎంతో కొంత పెంపు చూపించినంత మాత్రాన ప్రయోజనం లేదు. అలాగే కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టినంత మాత్రానా ఫలితం ఉండదు. వివిధ పథకాలను కలిపేయడం, పునర్‌వ్యవస్థీకరించడం వంటి సంస్కరణలు అవసరం. జీరో బేస్డ్‌ బడ్జెట్‌ విధానం కావాలి. అంటే సదరు పని పూర్తి కావడానికి ఏ మేర నిధులు అవసరమో ఎప్పటికప్పుడు అంచనా వేసి కేటాయిస్తూ ఉండాలి.

రోగ్య, విద్యారంగాల సూచీలను పరిశీలిస్తే పలు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకన్నా భారత్‌ చాలా వెనకబడి ఉన్నట్లు అర్థమవుతుంది. మానవఅభివృద్ధి సూచీలో ఈ రెండు రంగాలూ ఎంతో కీలకం. ఈ రెండు రంగాలనూ ఇంకా విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్‌డీఐ విశ్లేషణను బట్టి అర్థమవుతోంది. మనకంటే వెనకబడిన దేశంగా భావించే బంగ్లాదేశ్‌లో కూడా సగటు జీవిత కాలం ఎక్కువే. ఇక సగటు విద్యాకాలంలోనూ పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌కన్నా వెనకబడి ఉన్నాం.

బడుల్లో ఏం నేర్పిస్తున్నట్టో..
ట్యూషన్‌ ఫీజులు, యూనిఫారాలు, పుస్తకాల కొనుగోళ్లు లేని ప్రభుత్వ పాఠశాలలకు పంపాలా! లేదంటే ఈ భారాలన్నిటినీ మోయాల్సి వచ్చే ప్రయివేటు స్కూలును ఎంపిక చేసుకోవాలా! అనేది తలిదండ్రుల ముందు నిలిచిన సవాలు. తక్కువ ఖర్చుతో పోయే ప్రభుత్వ బడుల్లో చదువుల పరిస్థితి ఎలా ఉందా! అని తలిదండ్రులు ఆరా తీయడమూ సహజమే. అయితే, 2007-08, 2012-13 సంవత్సరాల్లో సర్కారీ పాఠశాలల్లో ఒక్కో చిన్నారిపై ప్రభుత్వ వ్యయం పెరిగినప్పటికీ అత్యధిక కుటుంబాలు ప్రభుత్వ స్కూళ్లకు తమ పిల్లలను దూరంగా ఉంచడం గమనార్హమైన పరిణామం. గ్రామీణ భారతావనిలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుల పరిస్థితి చూస్తే....గ్రామాల్లో ప్రయివేటు బడుల పనితీరు కూడా అంత ప్రోత్సాహకరంగా ఏమీ లేదు. మూడో తరగతికి వచ్చిన తర్వాత కూడా తప్పుల్లేకుండా ఒకటో క్లాసు పుస్తకం చదవగలిగిన పిల్లలు కేవలం 59 శాతం మందికి మాత్రమే ఉండటం శోచనీయం. అంటే...ప్రయివేటు పాఠశాలల్లో పిల్లలకు ఉన్న వనరుల లేమికి ఈ దుస్థితి అద్దం పడుతుంది. ఇక, గ్రామాల్లో ప్రభుత్వ బడుల సంగతైతే మరీ దారుణం. కాబట్టి విద్యా కార్యక్రమాలపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన అగత్యం సుస్పష్టమౌతోంది.

ఆరోగ్యభాగ్యం... భారత ఆరోగ్య విధానం అనేది ప్రధానంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు...ఆసుపత్రుల మీదే కేంద్రీకృతమైంది. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య, వైద్యులు, నర్సులున్నారా అనే గణాంకాలతోనే ఆరోగ్యసేవలను అంచనా వేస్తున్నారు. వాస్తవానికి పరిశుభ్రమైన తాగునీరు, పారిశుధ్యంపై సరిగా దృష్టి సారిస్తే...డయేరియా, మలేరియా వంటి ఎన్నో అంటువ్యాధులను అరికట్టవచ్చు. రోగనిరోధక టీకాల ద్వారా కూడా సత్ఫలితాలను సాధించవచ్చు. ఈ విధానాలతో పస్తుతం ఉన్న బడ్జెట్‌ వనరులతోనే ఆరోగ్యభాగ్యాన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చు.

ఈ విషయాల్లో సంతృప్తికరమే
హెచ్‌డీఐ ర్యాంకింగ్‌లో వెనకబడి ఉన్నా హెచ్‌డీఐ వృద్ధిరేటులో మాత్రం ముందంజలో ఉండడం సంతోషం కలిగించే విషయమే. పలు దేశాలతో పోల్చుకుంటే భారత్‌లోనే అసమానతలు తక్కువని మానవ అభివృద్ధి నివేదిక తేల్చి చెబుతోంది. అసమానతలను రెండు సూచీల ఆధారంగా విశ్లేషిస్తారు. ఒకటి గినీ కోఫిషెంట్‌ కాతా రెండోది క్వింటైల్‌ ఇన్‌కం రేషియో. ఈ రెండు సూచీల ప్రకారమూ భారత్‌లోనే అసమానతలు తక్కువగా ఉన్నాయని తేలింది. జనాభాలో అత్యంత సంపన్నులైన 20శాతం మంది ఆదాయం, అత్యంత పేదలైన 20శాతం మంది ఆదాయం మధ్య నిష్పత్తే క్వింటైల్‌ ఇన్‌కం రేషియో.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

బుల్డోజర్స్‌పై విజయం మాదే: అఖిల్‌

సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలుగు వారియర్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న యువ కథానాయకుడు అఖిల్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net