Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
ఐఏఎస్‌లు కావలెను
రాష్ట్రంలో ఇప్పటికే కొరత
విభజన కేటాయింపులో తగ్గిన రెండు పోస్టులు
ఈనాడు - హైదరాబాద్‌
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్‌ పోస్టులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. రాష్ట్రంలో ఇప్పటికే వీరి కొరత ఉండగా, విభజన దృష్ట్యా ఇరు రాస్హ్రా్టల కోసం వారి సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడింది. శాఖలు, కార్పొరేషన్ల కుదింపు వంటి అంశాలు పరిశీలనలో ఉన్నా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో ఐఏఎస్‌ల అంచనాలు పెరుగుతున్నాయి. ఐఏఎస్‌ల ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేయకపోవడం వల్ల కేంద్రం నుంచి స్పందన రాలేదు. విభజన నేపథ్యంలో ఐఏఎస్‌లపై కేంద్రం దృష్టి సారించింది. విభజన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీకి రాష్ట్రంలోని ఐఏఎస్‌ల వివరాలను నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపుల ప్రతిపాదనలపై కేంద్రానికి నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న శాఖలను, కార్పొరేషన్లను కుదిస్తామని, తద్వారా ఐఏఎస్‌లను సర్దుబాటు చేయవచ్చని ప్రతిపాదించింది.

ఇదీ జరుగుతోంది
రాష్ట్ర ప్రభుత్వం శాఖల కుదింపును ప్రతిపాదించి, కొత్త ఐఏఎస్‌ల అవసరాలను పేర్కొనలేదు. దీంతో ప్రత్యూష్‌సిన్హా కమిటీ ప్రస్తుతం ఉన్న ఐఏఎస్‌ల సంఖ్యనే పరిగణలోనికి తీసుకుంది.ఈ సందర్భంగా రెండు పోస్టులను రాష్ట్ర కోటా నుంచి తగ్గించడం విశేషం. పదోన్నతుల కోటాలో ఒక పోస్టును, ఇతర రాస్హ్రా్టలకు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు నిర్దేశించిన మరో పోస్టుకు రాష్ట్ర కోటా నుంచి తొలగించింంది. మిగిలిన 374 సీట్లను రెండు రాస్హ్రా్టలకు విభజించింది. ఏపీకి 211, తెలంగాణకు 163 దక్కాయి. ఖాళీగా ఉన్న పోస్టులను ఎలా భర్తీ చేస్తామనేది కమిటీ వెల్లడించలేదు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయలేదు.

మరో పదేళ్లు ఇంతేనా?
కేంద్రం ఏటా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు, పదోన్నతుల ద్వారా పదికి మించి పోస్టులను ఇవ్వడం లేదు. రెండు రాస్హ్రా్టలకు అయిదేసి చొప్పున పంచినా ఖాళీలు భర్తీ కావడానికి పదేళ్లు పడుతుంది. మరోవైపు పదవీ విరమణలతో కొత్త ఖాళీలు ఏర్పడతాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అదనపు జిల్లాలను ఏర్పాటు చేస్తే కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఇతర కీలకమైన పోస్టులకు మరింతమంది ఐఏఎస్‌ల అవసరం ఉంటుంది. ఈ కోణంలోనూ విభజన కమిటీ చర్చించలేదు. ఐఏఎస్‌ల విభజనపై మౌలికాంశాలను పరిగణలోనికి తీసుకోకపోతే భవిష్యత్తులో సమస్యలు ఏర్పడతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఇదీ లెక్క!
* రాష్ట్రానికి మంజూరైన పోస్టులు 376
* ప్రస్తుతం ఉన్నది 284 మంది
* డిప్యుటేషన్లపై రాష్ట్రేత ప్రాంతాల్లో ఉన్నది 38 మంది

* ఇతర రాస్హ్రా్టల నుంచి డిప్యుటేషన్‌పై ఇక్కడ పనిచేస్తోంది నలుగురు
* ఇతర రాస్హ్రా్టల్లో కేటాయించిన పోస్టులలో భర్తీ 95 శాతం
* మన రాష్ట్రంలో భర్తీ దాదాపు 80 శాతమే (అంటే 20 శాతానికి పైగ కొరత)

ఇదీ వాస్తవ తీరు
వాస్తవానికి ఐఏఎస్‌ల అవసరాలు కొత్త ప్రభుత్వాలు వచ్చాక వాటి విధానాలకు అనుగుణంగా ఖరారు అవుతాయి. ప్రభుత్వ శాఖలను, కార్పొరేషన్లను కుదిస్తామని ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలేవీ ప్రకటించలేదు. తెలంగాణలోని ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్‌లు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ కొత్త జిల్లాల ప్రతిపాదనను పార్టీలు ప్రస్తావించాయి. ఈ నేపథ్యంలో ఐఏఎస్‌లకు డిమాండ్‌ పెరిగే అవకాశాలే ఎక్కువ.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

ఉగ్రవాదులకు శ్రీకాంత్‌ ‘టెర్రర్‌’

హీరో శ్రీకాంత్‌ ఇంటెలిజెన్స్‌ పోలీస్‌ అధికారిగా ఉగ్రవాదంపై చేసే పోరాటమే ‘టెర్రర్‌’. ఓ పోలీస్‌ అధికారి నగరాన్ని ముట్టడించిన ఉగ్రవాదులను ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని దర్శకుడు ఎంతో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net