Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
ఘనులు తీసిన గోతులు
ఈనాడు హైదరాబాద్‌
వైఎస్‌ ఏదంటే దానికి ‘ఎస్‌’ అన్న
రాజగోపాల్‌ కావచ్చు.. చెప్పిందల్లా విన్న
శ్రీల÷ కావచ్చు.. చివరికి తాజాగా ‘చేవెళ్ల
చెల్లెమ్మ’ కావచ్చు.. పాపాలు వీళ్లంతా
అనుభవిస్తుంటే ఫలాలు మాత్రం అస్మదీ
యులు ఆరగిస్తున్నారు. మాజీ మంత్రి
సబితా ఇంద్రారెడ్డిపై ఓబుళాపురం
కేసులో సీబీఐ తాజా అభియోగాలే
ఇందుకు నిదర్శనం! ఘనులు తీసిన
గోతుల ఘోరాలు తెలుసుకునేందుకు...
అధికారం చేతిలో ఉంటే కొండలు, గుట్టలు, గనులు తవ్వి అమ్మేసుకోవచ్చు. కోట్లాది రూపాయలు దండుకోవచ్చు. దానివల్ల పోయేది ప్రజా సంపదే అయినా.. ప్రజలకు మాత్రం నష్టం జరిగినట్లే అనిపించదు. నొప్పి తెలియకుండానే మన సహజ సంపద వాళ్ల జేబుల్లోకి తరలిపోతుంది.
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటి అత్యంత ప్రమాదకరమైన ఈ సూత్రాన్ని కనిబెట్టిన వైఎస్‌.. ఆ చేత్తో అయిన వాళ్లకు కోట్లు దోచిపెట్టారు.. దొరికిన చోటల్లా అందిన కాడికి చెడ తవ్వుకున్నారు!
వైఎస్‌ ఏదంటే దానికి ‘ఎస్‌’ అన్న రాజగోపాల్‌ కావచ్చు.. చెప్పిందల్లా విన్న శ్రీలక్ష్మి కావచ్చు.. చివరికి తాజాగా ‘చేవెళ్ల చెల్లెమ్మ’ కావచ్చు.. పాపాలు వీళ్లంతా అనుభవిస్తుంటే ఫలాలు మాత్రం అస్మదీయులు ఆరగిస్తున్నారు.
వీళ్లు తీసిన గోతులు తెలుసుకునేందుకు ఓబుళాపురం ఒక్కటి చూస్తే చాలు.. ఆ పాపాల ఘోరాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తుంది!
మ్మినవారిని మోసం చేయడంటూ ఘనతగా చెప్పుకునే వై.ఎస్‌... తనపై నమ్మకం ఉంచిన వారిని నట్టేట ముంచేశారు.నిబంధనలన్నింటినీ పుస్తకాల్లో భద్రంగా ఉంచి... వైఎస్‌ చెప్పిందే చట్టమంటూ అమలు చేసిన మంత్రులు, అధికారులు ఇప్పుడు కోర్టులు, జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లపోయినా కంపు పోలేదన్నట్లు... వైఎస్‌ హయాంనాటి పాపాలింకా వారిని వెంటాడుతునే ఉన్నాయ్‌! మెడకు చుట్టుకుంటూనే ఉన్నాయ్‌! తాజాగా మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఓబుళాపురం కేసులో సీబీఐ తాజా అభియోగాలే ఇందుకు నిదర్శనం!

అయినవారికి దోచిపెట్టడానికి వీలుగా గనుల లీజుల్లో కీలక పాత్ర పోషించే మంత్రి, కార్యదర్శి, డైరెక్టర్‌ అన్ని పదవుల్లోనూ వై‘ఎస్‌’ అనేవారినే తీసుకువచ్చి పెట్టారు. కీలక బాధ్యతలు పొందినవారంతా వై.ఎస్‌. దోపిడీ యజ్ఞం కొనసాగడానికి తమ వంతు పాత్రను పోషించారు. ఇందుకు ఓబుళాపురమే ప్రత్యక్ష సాక్షి!

అడ్డగోలుగా 68.5 హెక్టార్ల లీజు
అనంతపురం జిల్లాలోని డీహీరేహాళ్‌ మండలంలో ఇనుపఖనిజం విరివిగా ఉంది. ఈ ప్రాంతంలోని 93 హెక్టార్లలో తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. గాలి జనార్దన్‌ రెడ్డికి చెందిన ఓఎంసీతో పాటు ఆయన మామ ఏర్పాటు చేసిన వినాయక మైనింగ్‌ కంపెనీలతో పాటు మరో 23 దరఖాస్తు చేసుకున్నాయి. అప్పటికే ప్రాస్పెక్టింగ్‌ లైసెన్స్‌ కోసం 5 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా వచ్చిన కంపెనీల అర్హతలను బేరీజు వేయకుండానే... మిగిలిన దరఖాస్తులను పట్టించుకోకుండా మొదట వచ్చిన గాలికి చెందిన ఓఎంసీ, ఆయన మామకు చెందిన వినాయక మైనింగ్‌ కంపెనీలకు లీజు ఇవ్వాలంటూ గనుల శాఖ సహాయక డైరెక్టర్‌ సిఫారసు చేశారు. డీహీరేహాళ్‌ మండలంలో 68.5 హెక్టార్ల లీజును ఓఎంసీ దక్కించుకోవడంలో కిందిస్థాయి అధికారి నుంచి మంత్రి దాకా అందరూ సహకరించారు.

రాజగోపాల్‌ కుటిల నీతి
ఓఎంసీకి పోటీగా వచ్చే అర్హత ఉన్న కంపెనీలను తప్పించడానికి కుటిల నీతితో అప్పుడు గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్న రాజగోపాల్‌ ఎపీఎండీసీ తరఫున 25 హెక్టార్ల లీజుకు దరఖాస్తు చేశారు. 18 హెక్టార్ల లీజు నిమిత్తం ఎస్‌.ఆర్‌. మినరల్స్‌ దరఖాస్తు చేయడంతోపాటు అప్పటికే అటవీశాఖ క్లియరెన్స్‌లను కూడా పొందింది. దీన్ని తప్పించడానికి ఎపీఎండీసీకి కూడా వీసీ, ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజగోపాల్‌ 25 హెక్టార్లకు దరఖాస్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థకు ప్రాధాన్యమివ్వాలన్న లక్ష్యంతో ఎస్‌.ఆర్‌.మినరల్స్‌ను ప్రస్తుతానికి పక్కనబెట్టి అనంతరం వాటిని మళ్ళీ ఓఎంసీకే కట్టబెట్టాలన్నది రాజగోపాల్‌ ఎత్తుగడనే ఆరోపణలున్నాయి.

శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగం
తప్పుడు పత్రాలతో పొందిన మైనింగ్‌ప్లాన్‌ను ఆమోదించి, ఓఎంసీకి లీజును సిఫారసు చేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శికి రాజగోపాల్‌ నోట్‌ పంపారు. తర్వాత ఓఎంసీకి లీజులు మంజూరు చేయడంలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. విధివిధానాలను, నిబంధనలను పట్టించుకోకుండా శ్రీలక్ష్మి అన్ని ఇతర దరఖాస్తులను తిరస్కరించి గాలికి చెందిన ఓఎంసీకి లీజు మంజూరు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. మొదట సందేహాలు వ్యక్తంజేసినా చివరకు ఓఎంసీకే కేంద్రం కూడా ఆమోదించింది. దీంతో అప్పటికే ఉక్కు కర్మాగారం నడుపుతూ అర్హత ఉన్న శాతవాహన వంటి కంపెనీలను పక్కనబెట్టి ఓఎంసీ దరఖాస్తును ఆమోదించి శ్రీలక్షి నోట్‌ సిద్ధం చేశారు. 2 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటయ్యే బ్రహ్మణి ఉక్కు కర్మాగారం (గాలిది) 10 మిలియన్‌ టన్నుల సామర్థ్యానికి చేరుకుంటుందని, అందువల్ల ఓఎంసీ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని 2007 జూన్‌ 18న పేర్కొంటూ ఫైలు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పంపారు.

ఫైలు అందిన వెంటనే..
శ్రీలక్ష్మి నుంచి ఫైలు అందిన వెంటనే గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపారు. మంత్రి ఆమోదంతో శ్రీలక్ష్మి జీవో జారీ చేసిన రోజే ఇతరుల దరఖాస్తులను తిరస్కరించారు. అయితే జీవోలో ‘క్యాప్టివ్‌ మైనింగ్‌’ (సొంత కంపెనీ కోసం) అన్న అంశాన్ని శ్రీలక్ష్మి ఉద్దేశపూర్వకంగా విస్మరించి ఇనుప ఖనిజాన్ని విక్రయించుకోవడానికి ఓఎంసీకి అవకాశం కల్పించారు. లీజు సమయంలో అర్హమైన కంపెనీలను పక్కనబెట్టడానికే ‘క్యాప్టివ్‌ మైనింగ్‌’ను తెరపైకి తీసుకొచ్చిన శ్రీలక్ష్మి తీరా జీవో జారీ చేసే సమయానికి ఈ పదాన్ని తొలగించటం వివాదాస్పదమైంది! తనకు వచ్చిన నోట్‌ఫైల్‌లో క్యాప్టివ్‌ మైనింగ్‌ ఉందని, జీవోలో లేని విషయం తనకు తెలియదని మంత్రి సబిత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. అయితే కేసు నుంచి తప్పించుకోవడానికే మంత్రి ఇలా చెబుతున్నారని శ్రీలక్ష్మి కోర్టుకు నివేదించారు.

మరో 39.5 హెక్టార్ల లీజులోనూ ఇదే తంతు
డీహిరేహాళ్‌ మండలం ఓబుళాపురంలో ఓఎంసీకి మరో 39.5 హెక్టార్ల లీజు కేటాయింపులోనూ అధికారులు గాలి అండ్‌ కోకు అండగా నిలిచారు. ఓఎంసీకి అనుకూలంగా ఫైళ్లను, నోట్‌ ఫైళ్లను సిద్ధం చేశారు. పరిశ్రమల శాఖ లేఖలతో 39.5 హెక్టార్లకు ఓఎంసీని కేంద్రం ఎంపిక చేసింది. సొంత అవసరాల కోసం ఓఎంసీ దరఖాస్తు చేసుకుందని, మిగిలినవి ఎగుమతులకని, ఇతర స్వల్ప కారణాలను చూపుతూ జింపెక్స్‌ వంటి సంస్థల దరఖాస్తులను తిరస్కరించారు. మరికొందరిని గాలి అనుచర బృందం బెదిరించడం, ప్రలోభ పెట్టడంతో దరఖాస్తులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వానికి వారు అఫిడవిట్లు సమర్పించారు. దీంతో ఓఎంసీకి మార్గం సుగమైంది.

ఇలా వైఎస్‌ ప్రభుత్వ మద్దతుతో వచ్చిన ఓబుళాపురం లీజులను అడ్డుపెట్టుకుని సరిహద్దు ప్రాంతాల్లో సహజ వనరులను గాలి జనార్దన్‌రెడ్డి కొల్లగొట్టారు. మైనింగ్‌ లీజుకు అనుమతించిన మరుసటి రోజే 1000 టన్నుల ఖనిజ రవాణాకు పర్మిట్‌లు తీసుకోవడాన్నిబట్టి చూస్తే పథకం ప్రకారం గాలి ముందే తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. గనులశాఖకు ఓఎంసీ సమర్పించిన వివరాల ప్రకారం మూడు లీజు ప్రాంతాల్లోనూ 2007-08లో 45.80 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2008-09లో 57.10 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2009-10లో 37.80 లక్షల మెట్రిక్‌ టన్నులు మొత్తం మీద 1,40,69,739 మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని వెలికి తీసినట్లు తేలింది. మొత్తం మీద 4 లీజుల పరిధిలో 197 లక్షల టన్నుల రవాణాకు ఓఎంసీ పర్మిట్లు తీసుకున్నట్లు గనుల శాఖ రికార్డుల్లో నమోదైంది. ఓఎంసీ చూపుతున్న లెక్కలకు లీజు ప్రాంతంలో తవ్వకాలకు పొంతన కుదరడంలేదని సీబీఐ తేల్చింది. 68.5 హెక్టార్లలో 40,387.266 మెట్రిక్‌ టన్నులు వెలికి తీసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇక్కడ కేవలం 2 నుంచి 3 మీటర్ల వరకే తవ్వకాలు జరిపినట్లు తేల్చింది. సీబీఐ కేసు నమోదు చేయడంతో హడావుడిగా బెంచ్‌లను ఏర్పాటు చేసి తవ్వకాలు చేసినట్లు చూపింది. కర్ణాటక ప్రాంతంలో ఇతరులకు చెందిన గనుల్లోను, అటవీ శాఖ ప్రాంతంలోనూ ఖనిజాన్ని కొల్లగొట్టి ఇక్కడి లీజుల ద్వారా రవాణా చేసి గాలి జనార్దన్‌రెడ్డి కోట్లు కొల్లగొట్టారు. రాష్ట్ర సరిహద్దుల్ని కూడా మార్చేశారనే ఆరోపణలున్నాయి. వీటిపై విచారణ సాగుతోంది. అంతేగాకుండా పక్క గనుల వారిని బెదిరించి మరీ తక్కువ ధరకు ఖనిజాన్ని కొనుగోలు చేసి భారీ ధరకు ఎగుమతులు చేశారు. స్థానిక విక్రయాలు, ఎగుమతుల ద్వారా రూ.4310 కోట్లను ఓఎంసీ ఆర్జించింది.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

‘బాహుబలి’ ఈ యేడాదే?!

‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అద్భుతం ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. ఇప్పుడు అందరి దృష్టీ ‘బాహుబలి 2’పైనే. ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net