Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
తిరుగు‘పోట్లు’
భారీగా బరిలోకి దిగిన రెబల్‌ అభ్యర్థులు
అన్ని పార్టీల నుంచి పోటాపోటీగా నామినేషన్లు
ఆఖరు రోజు కిటకిటలాడిన కార్యాలయాలు
ఈనాడు, హైదరాబాద్‌: అన్ని పార్టీల్లోనూ అసమ్మతి అగ్గి రాజుకుంది. అనేక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల టిక్కెట్లు ఆశించినా, దక్కనివారు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. పొత్తు పొడుపుల్లో స్థానాలు కోల్పోయిన వారిదీ ఇదే బాట. తెదేపా-భాజపా, కాంగ్రెస్‌లో తిరుగుబాటు అభ్యర్థులు ఎక్కువగా ఉండగా, తెరాసకూ ఆ తలనొప్పి తప్పలేదు. ఇటీవలే తెదేపాలో చేరిన బీసీ నేత ఆర్‌.కృష్ణయ్యకు ఎల్బీనగర్‌ టికెట్‌ కేటాయించడంతో, ఇంతకాలం అక్కడ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా ఉన్న వ్యక్తి అనుచరులు నామినేషన్‌ సమయంలో దాడికి దిగారు. ఖమ్మంలో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్తున్నప్పుడు రాళ్లతో దాడి జరిగింది. మరికొన్నిచోట్ల కూడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

కాంగ్రెస్‌కు అన్ని జిల్లాల్లోనూ తిరుగుబాటు బెడద వేధిస్తోంది. కాంగ్రెస్‌-సీపీఐ అవగాహనలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం టిక్కెట్‌ సీపీఐకి కేటాయించగా, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్‌ బి.ఫారం ఇచ్చి నామినేషన్‌ వేయించింది. సీపీఐకి కేటాయించిన దేవరకొండ, పినపాకలో కూడా తిరుగుబాటు అభ్యర్థులు రంగ ప్రవేశం చేశారు. బుధవారం రాత్రివరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్‌కు సుమారు 40 అసెంబ్లీ స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నారు. అనేకచోట్ల కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలు నామినేషన్ల సందర్భంగా బయటపడ్డాయి. తెలుగుదేశం-భాజపా మధ్య సీట్ల కేటాయింపులో మొదలైన విభేదాలు నామినేషన్లలో కూడా కొనసాగాయి. ఒకరికి కేటాయించిన చోట ఇంకొకరు పోటీగా నామినేషన్లు వేశారు. చాలా కాలంగా టికెట్‌ వస్తుందని ఆశతో ఉండి అకస్మాత్తుగా కొత్త అభ్యర్థులను రంగంలోకి తెచ్చిన చోట కూడా తెలుగుదేశానికి తిరుగుబాట్ల బెడద తప్పలేదు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో తిరుగుబాటు అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. సుమారు 30 నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నుంచి పోటీ నామినేషన్లు పడ్డాయి. హుస్నాబాద్‌, నర్సాపూర్‌లలో భాజపా ఒక్కోస్థానానికి ఇద్దరికి బి.ఫారాలు ఇచ్చింది. తెరాసలో సుమారు పది స్థానాల్లో పోటీ అభ్యర్థులు ఉన్నారు. పరకాల, సిర్పూజ్‌ కాగజ్‌నగర్‌, నల్గొండ, తుంగతుర్తి ఎల్బీనగర్‌తో సహా పలు నియోజకవర్గాల్లో పోటీ అభ్యర్థులున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 12 వరకు గడువుంది. ఆ తర్వాతే ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉండేదీ తేలనుంది.

కార్యాలయాలు కిటకిట..
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు, 17 లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. తెలంగాణలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు బుధవారం భారీగా నామినేషన్లు పడ్డాయి. నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజు కావడం, ప్రధాన పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకులందరూ చివరి రోజునే నామినేషన్లు వేయడానికి ముహూర్తం పెట్టుకోవడంతో ఆయా జిల్లాల్లోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలు కిటకిటలాడాయి. చివరి రోజున నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌, కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు పొన్నాల లక్ష్మయ్య, దామోదర్‌ రాజనరసింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, కేంద్రమంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాంనాయక్‌ తదితరులున్నారు. తెలుగుదేశం నాయకులు ఎల్‌.రమణ, దయాకర్‌రావు, నామా నాగేశ్వరరావు, భాజపా నాయకులు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, సీపీఐ నాయకుడు నారాయణ తదితరులు కూడా నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. కేసీఆర్‌ కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్‌ కూడా బుధవారమే నామినేషన్లు వేశారు.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net