Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
రాజకీయం.. పునరేకీకరణం
విభజన దెబ్బకు కాంగ్రెస్‌ కుదేలు
సీమాంధ్రలో పసుపు దళం జోరు
తెలంగాణలో గులాబి గుబాళింపు
ఈనాడు - హైదరాబాద్‌
రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయవర్గాలు, శక్తుల పునరేకీకరణ జోరుగా సాగుతోంది. సాధారణ ఎన్నికల సమయంలో సహజంగా ఉండే దానికి భిన్నంగా ఈసారి బాగా వేగంగా, అసలు పార్టీల స్వరూప స్వభావాలే మారేలా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. సీమాంధ్రలో తెదేపా, తెలంగాణలో తెరాస కేంద్రంగా ఇవి జరుగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన వారు ఈ రెండింటిలో చేరేందుకు పోటీ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వాటినుంచి టికెట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన దెబ్బకు సీమాంధ్రలో కాంగ్రెస్‌ కుదేలైంది. దశాబ్దాలు, తరాల తరబడి కాంగ్రెస్‌లో ఉన్న కుటుంబాలు విభజన తాకిడికి బెంబేలెత్తిపోయాయి. అయిదేళ్లు ప్రతిపక్షంలో ఉండటానికి ఇబ్బంది లేదుగాని తిరిగి పార్టీ ఎప్పుడు పుంజుకుంటుందో కూడా తెలియని అయోమయ స్థితిలో ఆ పార్టీలో కొనసాగటం దుర్లభమని భావిస్తున్నారు. 1983, 1985ల్లో, తిరిగి 1994, 1999లో తెదేపా ప్రభంజనం వీచినప్పుడు సైతం కాంగ్రెస్‌ని అంటిపెట్టుకుని ఉన్న వారు.. ఇప్పుడు ఇక అందులో కొనసాగితే భవిష్యత్తు లేదనే ఆందోళనతో ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకుంటున్నారు. వారిలో అత్యధికులు తెదేపాలో చేరేందుకు తహతహలాడుతున్నారు. రాయలసీమ, కోస్తా అనే తేడా లేకుండా తెదేపా తలుపు తడుతున్నారు. ఆ పార్టీని గతంలో వివిధ కారణాలతో తీవ్రంగా ద్వేషించిన వారు, గల్లా అరుణ, జేసీ వంటి కరడుగట్టిన కాంగ్రెస్‌వాదులూ అందులో ఉండడం విశేషం. కాంగ్రెస్‌కు సంప్రదాయంగా ఉంటున్న ఓటు బ్యాంకును కొంత చీల్చుకుంటూ వైకాపా ఏర్పాటైనా.. ప్రస్తుతం దానికన్నా తెదేపాలో చేరేందుకే సీనియర్‌ నేతలు మొగ్గు చూపుతున్నారు. నాయకులు పార్టీ మారే క్రమంలో సహజంగా కార్యకర్తల నుంచి కొంత వ్యతిరేకత వస్తుంటుంది. సీమాంధ్రలో ప్రస్తుతం దానికి భిన్నంగా కార్యకర్తలే పార్టీని వదలాలని నాయకుల్ని డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణలో తెరాస కేంద్రంగా ఇలాంటి వ్యవహారాలే నడుస్తున్నాయి.

తెరాస.. విస్తరణ ప్రణాళిక
2004లో కాంగ్రెస్‌, 2009లో తెదేపాతో పొత్తు పెట్టుకుని నాలుగు పదుల సంఖ్యలో శాసనసభ స్థానాలకు తెరాస పోటీ చేసినా.. అప్పట్లో లేని గ్లామర్‌ ఇప్పుడు తెరాసకు వచ్చింది. దశాబ్దాల డిమాండ్‌ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించటంలో తెరాస కీలక పాత్ర పోషించటంతో తెలంగాణలో రాజకీయ శక్తుల పునరేకీకరణకు ఆ పార్టీ కేంద్ర బిందువుగా మారుతోంది. చేరికలు భారీగా ఉంటున్నాయి. ఇతర పార్టీల నుంచి రావటంతోపాటు ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్న వారూ గులాబి గూటికి ఆకర్షితులవుతున్నారు. ఉద్యమ పార్టీ అయినప్పటికీ తెలంగాణవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో పార్టీకి సరైన యంత్రాంగం ఏర్పాటుకాలేదు. ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా చేసుకుని తెలంగాణ అంతటా బలీయమైన శక్తి కావాలని తెరాస తలపోస్తోంది. వలసలతో దానికి తగిన ప్రణాళిక రూపొందిస్తోంది.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి

బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రానికి కొన్ని మార్పులు చేయనున్నట్లు దర్శకుడు ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net