Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
ముగ్గురు మూలపుటమ్మలు
సర్కారు ఏర్పాటులో మమత, జయ, మాయా కీలకం
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు కీలక పాత్ర పోషించబోతున్నారు. కాంగ్రెస్‌, భాజపాల నేతృత్వంలోని కూటములు సాధారణ మెజారిటీ సాధించలేని పరిస్థితుల్లో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతిల నేతృత్వంలోని పార్టీలు ఎన్నికల అనంతర రాజకీయాలను శాసిస్తాయి.అందరి చూపులూ ఈ ముగ్గురు మహిళా నేతలు వచ్చే ఎన్నికల్లో సాధించబోయే విజయాల పైనే ఉన్నాయి.
161 సీట్లకు పోటీ
ముగ్గురు నేతల కార్యక్షేత్రాలైన మూడు రాష్ట్రాల్లో కలిపి 161 లోక్‌సభ స్థానాలున్నాయి. మాయా నేతృత్వంలోని బీఎస్పీ ఉత్తరప్రదేశ్‌లో(80), మమత నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ బెంగాల్లో(42), జయ నేతృత్వంలోని అన్నాడీఎంకే తమిళనాడులో(39) మొత్తం సీట్లకు పోటీ చేస్తున్నాయి. మాయ, జయల్లో ఎవరు ప్రధాని అయినా తనకు అభ్యంతరం లేదని మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జయలలిత మమతకు ఫోన్‌చేసి రాజకీయ వ్యూహాలను చర్చించారు. అన్నాడీఎంకే, వామపక్షాల మధ్య పొత్తు చెడటంతో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ నేతృత్వంలో రూపు దిద్దుకుంటున్న మూడో ఫ్రంట్‌ బయట మరో కూటమి ప్రయత్నాలు చేయాలన్న మమత ఆలోచనకు కలిసి వచ్చింది. మూడో కూటమిలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌కే అధిక ప్రాధాన్యం ఉంటుందన్న సంగతి ఎరిగిన మాయావతి ఎప్పుడూ తృతీయ ఫ్రంట్‌ పట్ల పెద్దగా ఆసక్తి చూపరు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, భాజపాల నేతృత్వాల్లోని కూటములు సాధారణ మెజారిటీకి దగ్గరకు రాని పరిస్థితుల్లో మాయావతి.. మమత, జయలతో కలిసి కూటమిగా పని చేసేందుకు ఆసక్తి చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఎస్పీ అవసరార్థం ఢిల్లీలోని ఏదో ఒక ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్నా, దానికి మొదటి నుంచీ ఇతర పార్టీలతో జట్టుకట్టే అలవాటు లేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో 21 సీట్లు సాధించిన బీఎస్పీ... సమాజ్‌వాదీ తర్వాత రెండో పెద్ద పార్టీగా అవతరించింది.
- న్యూఢిల్లీ
మమత: కుంభస్థలం కొట్టిన యోధురాలు
నిరంతర పోరాటం ద్వారా బెంగాల్లో 34 ఏళ్ల వామపక్ష పాలనకు చరమగీతం పాడిన యోధురాలు మమతా బెనర్జీ. 2009 ఎన్నికల్లో 18 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నారు. 1955లో జన్మించిన మమత సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. 1997లో సొంత పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ స్థాపించారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరారు. రెండుసార్లు కూటమితో విబేధించి బయటకు వచ్చారు. 2009లో యూపీఏ కూటమిలో చేరారు. చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు నిరసనగా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. వీధిపోరాటాలతో రాజకీయ జీవితాన్ని ఆరంభించిన మమత 2012లో టైమ్స్‌ పత్రిక ప్రకటించిన ప్రపంచంలో వందమంది అత్యంత శక్తిమంతుల జాబితాలో నిలిచారు.
జయ: మూడు సార్లు ఎదురులేని మెజారిటీ
యలలిత 1948లో జన్మించారు. సినీతారగా అనేక విజయాలు అందుకున్నారు. అన్నాడీఎంకే అధినేత ఎంజీ రామచంద్రన్‌ అండతో 1982లో తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1987లో ఆయన మరణంతో పార్టీ రెండు ముక్కలైంది. ఒక వర్గానికి రామచంద్రన్‌ భార్య జానకి, మరో వర్గానికి జయ నేతృత్వం వహించారు. 1991, 2001, 2011 శాసనసభ ఎన్నికల్లో ఎదురులేని విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత లోక్‌సభలో అన్నాడీఎంకేకు 9 సీట్లు ఉన్నాయి. మమత, జయ తమ తమ రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ముప్పును అధిగమించి భారీ విజయాలను నమోదు చేస్తారని అంచనా వేస్తున్నారు.
మాయా: నాలుగు సార్లు సీఎం
1956లో జన్మించిన మాయావతి 1984లో కాన్షీరాం బీఎస్పీని స్థాపించినపుడు ఆ పార్టీలో చేరారు. 1989లో లోక్‌సభకు పోటీచేసి నెగ్గారు. అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర మొదటి దళిత ముఖ్యమంత్రిగా అవతరించారు. దళితులకు ప్రతీకగా నిలిచిన మాయా ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వం పట్ల తీవ్రంగా ఉన్న ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోగలనని గట్టి నమ్మకంతో ఉన్నారు.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net