Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
‘మేసే’ నేత అధినేత అయితే..
...ఎలా వస్తాయి విదేశీ పెట్టుబడులు?
కొత్త ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పనికీ నిధులు అవసరం
జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తేనే.. అభివృద్ధి, ఉద్యోగాలు
అభియోగాలున్న నేతలుంటే పారిశ్రామికవేత్తలకు భయం
జగన్‌ ముఖ్యమంత్రి అయితే.. విదేశీ పెట్టుబడులు మరచిపోవాల్సిందే!
పలువురు నిపుణుల హెచ్చరిక
ఈనాడు - హైదరాబాద్‌

డిపించేవాడు.. నిఖార్సుగా ఉంటేనే బండి సాఫీగా ముందుకు సాగుతుంది. ముందుండి నడిపించేవాడిదే అడ్డగోలు వ్యవహారమైతే.. గమ్యం చేరేది అనుమానమే. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో పారిశ్రామికీకరణ కోసం విదేశీ పెట్టుబడులు తప్పనిసరి. మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా విదేశీ నిధుల మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ అవినీతి పరులు నాయకత్వ స్థానాల్లో ఉంటే విదేశీ పెట్టుబడులపై ఆశలు వదులుకోవాల్సిందే. ఏదైనా ఒక కంపెనీ కానీ, ఆ కంపెనీ డైరెక్టర్లు కానీ అవినీతికి పాల్పడితే ఆ కంపెనీకి పెట్టుబడులు రావు. ఇదే విషయం ప్రభుత్వాలకు, రాష్ట్రాధినేతకూ వర్తిస్తుంది. ఒక రాష్ట్రాధినేతపై అవినీతి ఆరోపణలతో ఛార్జిషీటు దాఖలై ఉంటే, ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఎంతమాత్రం ఆసక్తి చూపవు. అలాంటి పెట్టుబడులను నిరోధిస్తూ పలు దేశాల్లో చట్టాలు ఉన్నాయి. అమెరికా, ఐరోపా యూనియన్‌, జపాన్‌, కొరియా, సింగపూర్‌తో పాటు కొన్ని అరబ్‌ దేశాలు తమ దేశాలకు చెందిన సంస్థలు, అవినీతిపరులు అధినేతలుగా ఉన్నచోట పెట్టుబడులు పెట్టటాన్ని నిరోధిస్తూ చట్టాలు తీసుకువచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో నూతన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అవినీతి మరకలు ఉన్న నేత ప్రభుత్వాధినేత అయితే ఆ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశమే లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రకాలుగా సానుకూలతలు ఉంటే కానీ విదేశీ పెట్టుబడులు సాధ్యం కావు. ఒక విదేశీ సంస్థ, ఎన్నారై లేదా దేశీయంగా ఒక ప్రముఖ సంస్థ ఒక కొత్త ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలంటే ఎన్నో అంశాలు పరిగణలోకి తీసుకుంటాయి. సమర్థ´మైన నాయకత్వాన్ని, మెరుగైన పాలనను ఆశిస్తాయి. అవినీతిని ఎవరూ ఇష్టపడరు. అవినీతి కేసుల్లో చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విదేశీ పెట్టుబడులు మర్చిపోవాల్సిందే. 

పెట్టుబడులు వస్తేనే..
కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంపాదన తక్కువ. ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఇవ్వటానికే నానా కష్టాలు పడాలి. అటువంటిది మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దఎత్తున పారిశ్రామికాభివృద్ధికి, విద్యా- వైద్య వసతుల కల్పనకు నిధులు ఎక్కడి నుంచి లభిస్తాయి. రాజధాని నిర్మాణమే పెద్ద సవాలు. దీనికి తప్పనిసరిగా బయటి నుంచి వచ్చే పెట్టుబడుల మీద ఆధారపడాల్సిందే. విదేశీ పెట్టుబడులంటే కేవలం ప్రైవేటు రంగంలోని బహుళ జాతి కంపెనీలే కాకుండా.. ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి ప్రభుత్వ సంస్థలు, ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సి) వంటి ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం పెద్దఎత్తున రుణాలు ఇస్తాయి. అమెరికా, జపాన్‌ దేశాలు గ్రాంట్లు, రుణాలు, పారిశ్రామిక పెట్టుబడుల రూపంలో నిధులు ఇస్తుంటాయి. కొత్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, రైలు- రోడ్డు మార్గాల అభివృద్ధి, విద్య- వైద్య వసతుల కల్పన నుంచి ప్రతి పనికీ నిధులు అవసరం. ఇక పారిశ్రామీకరణ సరేసరి. పెద్దఎత్తున పరిశ్రమలు వస్తే కానీ ఉద్యోగాలు లభించవు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏటా రెండు లక్షల మంది ఇంజనీర్లు వస్తున్నారు. ఇంకా ఇతర కోర్సులు పూర్తిచేసే వారి సంఖ్య ఎంతో ఎక్కువ. వీరిలో 10- 20 శాతం మంది మాత్రమే బయటి రాష్ట్రాలకు, దేశాలకు వెళ్తున్నారు. మిగిలిన వారంతా ఇక్కడ ఉద్యోగాలు వెతుక్కోవాల్సిందే. అనుకున్న విధంగా పారిశ్రామికీకరణ లేకపోతే ఉద్యోగాలు లేక వీళ్లంతా వీధిన పడతారు. లేదా చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూ కాలం గడపాలి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నీతిమంతమైన నాయకత్వం ఉంటేనే సాధ్యం. అవినీతి ఆరోపణలు ఉన్నవారి సారథ్యంలో నిధులు రావు, ఉద్యోగాలు ఉండవు, భవిష్యత్తు అంతా అగమ్యగోచరమే. 

అభివృద్ధి చెందిన దేశాల్లో చట్టాలున్నాయి..
ఒక కంపెనీపై అవినీతి ఆరోపణలు ఉన్నప్పుడు విదేశీ పెట్టుబడిని ఆకర్షించటం ఎంత కష్టమో, ఒక ప్రభుత్వం లేదా ప్రభుత్వాధినేత మీద అవినీతి ఆరోపణలు ఉంటే విదేశీ పెట్టుబడిని ఆకర్షించటం అంతే కష్టమని ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఫ్యాప్సీ) మాజీ అధ్యక్షుడు దేవేందర్‌ సురానా వివరించారు. ఈ విషయంలో పలు అభివృద్ధి చెందిన దేశాల్లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని అన్నారు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలు కూడా పెట్టుబడిని అనుమతించవని అన్నారు. ‘ఇటువంటి సందర్భాల్లో విదేశీ పెట్టుబడులను మర్చిపోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని హైదరాబాద్‌ కేంద్రంగా ఆతిథ్య రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఒక ప్రముఖ సంస్థ యజమాని కూడా నిర్ధరించారు. అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అతిపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు అవినీతి పరులైన దేశాధినేతలు ఉన్నచోట పెట్టుబడులు పెట్టవని స్పష్టం చేశారు. ‘ఆ దేశాల్లో కఠినమైన చట్టాలు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్లుగా పెట్టుబడులు పెట్టటాన్ని అనుమతించరు, అవినీతిపరులున్న చోట అసలే పెట్టుబడులు రావు’ అని పేర్కొన్నారు. మామూలుగానే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించటం కష్టమనీ, అటువంటిది అవినీతి ఆరోపణలు ఉంటే ఇక సాధ్యమే కాదని స్పష్టం చేశారు. అమెరికాలో లంచాల నిరోధక చట్టం అమల్లో ఉంది. అదే ‘ఫారిన్‌ కరెప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌- 1977’. దీని ప్ర¾కారం అమెరికా పౌరులు, సంస్థలు బయట దేశాల్లో లంచాలు ఇవ్వడం నిషిద్ధం. అంతేగాకుండా నాయకత్వంపై అవినీతి ఆరోపణలు ఉన్నదేశాల్లో లేదా సంస్థల్లో అమెరికా సంస్థలు కానీ, వ్యక్తులు కానీ పెట్టుబడులు పెట్టకూడదు. ఏదైనా అమెరికా కంపెనీ మనదేశంలోని కంపెనీతో వ్యాపార భాగస్వామ్యం కానీ, పెట్టుబడుల ఒప్పందం కానీ కుదుర్చుకునే సమయంలో మనదేశంలోని కంపెనీ నుంచి ‘‘ఇంతవరకూ తాను అవినీతికి పాల్పడలేదని, ఇకముందు కూడా అవినీతికి అస్కారం ఇవ్వబోమని’’ స్పష్టం చేస్తూ ఒక ప్రమాణ పత్రాన్ని తీసుకుంటాయి. దీనికి భిన్నంగా అవినీతికి పాల్పడిన పక్షంలో భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాయని ఫ్యాప్సీ ప్రతినిధి ఒకరు వివరించారు. 

మచ్చపడిన వారు వస్తే అథోగతే..
నీతి, నిజాయతీగల నేతలుంటేనే పారిశ్రామిక పెట్టుబడులకు అవకాశం ఉంటుందని, మచ్చపడిన వారు అధికారంలోకి వస్తే అది రాష్ట్రప్రగతికి చేటు తెస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) ఆంధ్రప్రదేశ్‌ విభాగం మాజీ అధ్యక్షుడు జి.వివేకానంద్‌ అన్నారు. ‘‘పారిశ్రామికవేత్తలుగానీ, విదేశీ సంస్థలుగానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే సుపరిపాలన అవసరం. ప్రభుత్వ విధానాలకంటే ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారనేది ముఖ్యం. విశ్వసనీయత గల పార్టీలు, నేతలు అధికారంలో ఉండాలి. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా శ్రమించాల్సిన పనే ఉండదు. అభియోగాలున్న నేతలు ఉన్నారంటే పారిశ్రామికవేత్తలకు భయం పట్టుకుంటుంది. ఆ నేతలను నమ్మి వారు రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉండదు. ప్రభుత్వంలో ఎవరున్నారో ముందుగా చూసిన తర్వాతే అంతర్జాతీయ సంస్థలు, విదేశాలు పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నాయి. సద్గుణాలు ఉండే వారితోనే రాష్ట్రం బాగుపడుతుంది.’’ అని చెప్పారు. 

‘జగన్‌తో నష్టమే...’
అపారమైన వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జగన్‌ లాంటి వాళ్ల నాయకత్వంతో నష్టం తప్పిస్తే లాభం లేదని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ‘‘కొత్త రాష్ట్రంగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌ బాగా అభివృద్ధి చెందవచ్చు. కానీ జగన్‌ లాంటి వాళ్లు అధికారంలోకి వస్తే మాత్రం అదే అభివృద్ధికి అవరోధంగా మారుతుంది. వనరులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతాయి’’ అని పేర్కొన్నారు. జగన్‌ అధికార పీఠంపై ఉంటే పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేవారు పదిసార్లు ఆలోచించాల్సి వస్తుందని శశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో ‘నీకది-నాకిది’ అంటూ పలు రూపాల్లో పారిశ్రామికవేత్తలను ఒత్తిళ్లకు గురి చేశారని, హైదరాబాద్‌ గచ్చిబౌలి ప్రాంతంలోని పెద్ద అపార్ట్‌మెంట్‌లో 70 ఫ్లాట్లు జగన్మోహన్‌రెడ్డి పేరుపై ఉన్నాయనే ప్రచారముందని ఆ ప్రాంతంలో ఉండే ఓ మాజీ గవర్నర్‌ తనతో చెప్పారని శశిధర్‌రెడ్డి వివరించారు. ‘హైదరాబాద్‌ చుట్టుపక్కల ఎక్కడ నిర్మాణం జరిగినా అందులో వాటా అంటున్నారు. అమాయకులను ఇబ్బంది పెట్టి సెటిల్మెంట్‌లు చేశారు. ప్రాణభీతి కలిగించి తాము చెప్పినట్లు రాయించుకున్నారు. అలాంటి దుస్థితి రాకూడదు. తండ్రి అండన ఇదంతా చేసిన వ్యక్తే అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ను ఎవరూ రక్షించలేరు. మాఫియా పాలన వచ్చే ప్రమాదముంది. విదేశీ పెట్టుబడులు రావు. ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా.. వారిని గుప్పెట్లో పెట్టుకుని ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ప్రమాదముంది’ అని ఆందోళన వెలిబుచ్చారు. 

అంతర్జాతీయంగా చెడ్డపేరు..
నేరాభియోగాలున్న వారికి అధికారం ఇస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందనీ, విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండదని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు జరిగే వీలుండదని అంతర్జాతీయ న్యాయవ్యవహారాల నిపుణుడు, ఎంపీ మధుయాష్కీ అన్నారు. మధుయాష్కీ 1996 నుంచి అమెరికాలోని పలు నగరాల్లో శర్మ, యాష్కి అసోసియేట్స్‌ పేరిట అంతర్జాతీయ న్యాయవ్యవహారాల సంస్థను నిర్వహిస్తున్నారు. దేశాల మధ్య ఒప్పందాలు విదేశీ పెట్టుబడులు ఇతర అంశాలపై ఆయన అధ్యయనం చేశారు. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) కింద అభియోగాలు నమోదైన వారు అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రానికి ఏమాత్రం విదేశీ సాయం అందదని తెలిపారు. నేతల అవినీతి కారణంగా పాకిస్థాన్‌, థాయిలాండ్‌ వంటి దేశాలు అంతర్జాతీయ స్థాయిలో నష్టపోయాయని ఆ పరిస్థితి రాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. ‘‘మొదట్లో కేంద్రం ద్వారా రాష్ట్రాలకు విదేశీ రుణాలు, గ్రాంట్ల మంజూరీ విధానం ఉండేది. ఆర్థిక సంస్కరణల కారణంగా ఇప్పుడు విదేశాలు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. రుణాలు, గ్రాంట్లు ఇస్తున్నాయి. విదేశీ పెట్టుబడులకు, రుణాలు, గ్రాంట్ల మంజూరులకు అనుమతులపై అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, జపాన్‌, యూరప్‌ దేశాలు ఆచితూచి వ్యవహరిస్తాయి. అన్ని కోణాల్లో ఆలోచించాకే తుది నిర్ణయం తీసుకుంటాయి. ప్రధానంగా తాము పెట్టుబడి పెట్టబోయే రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు, ఆయా పార్టీలు, వ్యక్తుల చరిత్ర ఏమిటో తెలుసుకుంటాయి. అధికారంలో ఉన్న వారికి నేరచరిత్ర ఉంటే కేసుల గురించి ఆరా తీస్తాయి. జైలుకు వెళ్లి వచ్చిన వారి గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకుంటాయి. వారిపై ఉన్న అభియోగాలను పరిశీలిస్తాయి’’ అని యాష్కీ వివరించారు. సదరు నేతలు బోగస్‌ కంపెనీల పేరిట విదేశాలలోనూ మోసాలకు పాల్పడితే దాన్ని తీవ్రంగా పరిగణిస్తాయని, పాకిస్థాన్‌లో ముషరఫ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనపై తీవ్ర అభియోగాలు రావడంతో ఆ దేశానికి అమెరికా, బ్రిటన్‌లు ఆర్థికసాయాన్ని నిలిపి వేశాయని గుర్తుచేశారు. ‘భారత న్యాయవ్యవస్థ అవినీతికి అడ్డుకట్ట వేస్తూ చరిత్రాత్మక తీర్పులను ఇస్తోంది. ముఖ్యమంత్రులైనా, కేంద్రమంత్రులైనా జైలుకు పంపించడానికి వెనుకాడడం లేదు. సీఎం అయ్యాక జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే అంతకుమించి అప్రతిష్ఠ మరేది ఉండదు’ అని మధుయాష్కీ వివరించారు. 

తేల్చుకోవాల్సిన సమయమిది..
ఒక రాష్ట్ర నాయకత్వానికి ఎంత ప్రాధాన్యం ఉందో చెప్పటానికి టాటా నానో ఉదంతం ఒక ఉదాహరణ. రూ.లక్షకు కారు అందించాలనేది టాటా గ్రూపు ఛైర్మన్‌గా వ్యవహరించిన రతన్‌ టాటా కల. దానికోసం ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్‌లో నానో కార్ల తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్టు కోసం రైతుల భూములు కొల్లగొడుతున్నారంటూ మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ఆందోళనకు దిగింది. ఆ తర్వాత కొంతకాలానికి టీఎంసీ అక్కడ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టును అక్కడ చేపట్టలేని పరిస్థితి. ప్రత్యామ్నాయంగా చెన్నై, హైదరాబాద్‌, బెంగుళూరు నగరాలను పరిశీలించింది. కానీ గుజరాత్‌లోని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సహకారం టాటా గ్రూపును ఆకర్షించాయి. అంతే.. నానో కర్మాగారం గుజరాత్‌ వెళ్లిపోయింది. దీనివల్ల గుజరాత్‌ బ్రాండ్‌ విలువ ఎంతో పెరగటమే కాకుండా వేలాది ఉద్యోగాలు లభించాయి. తదుపరి చెన్నైలో ఉన్న ఫోర్డ్‌ ఇండియా, గుర్గావ్‌లోని మారుతిసుజుకి ఇండియా కూడా గుజరాత్‌ వెళ్లి కొత్త యూనిట్ల నిర్మాణాన్ని చేపట్టాయి. ఈ విధంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తేనే సత్వర అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. దీనికి నీతి, నిజాయతీ, సమర్థ´తతో కూడిన నాయకత్వం కావాలి కానీ అవినీతిపరుల అజమాయిషీ కాదు. ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కావాల్సింది.. ఇది నీకిస్తే, నాకెంతిస్తావు? అని అడుగడుగునా స్కీములు వేసే వారసత్వమా లేక ధర్మకర్త మాదిరిగా ఏం చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందని తపనపడే నాయకత్వమా.. ఈ విషయాన్ని ప్రజలే తేల్చుకోవాలి.


 

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

ఉగ్రవాదులకు శ్రీకాంత్‌ ‘టెర్రర్‌’

హీరో శ్రీకాంత్‌ ఇంటెలిజెన్స్‌ పోలీస్‌ అధికారిగా ఉగ్రవాదంపై చేసే పోరాటమే ‘టెర్రర్‌’. ఓ పోలీస్‌ అధికారి నగరాన్ని ముట్టడించిన ఉగ్రవాదులను ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని దర్శకుడు ఎంతో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net