Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
సాంకేతికతతో ఆదర్శ పోలీసింగ్‌
ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగానే పనితీరు
ఎర్రచందనం స్మగ్లింగ్‌ మూలాలపై శోధన
ఆర్థిక నేరాల అదుపుపై దృష్టి
తీర ప్రాంత రక్షణకు ప్రత్యేక బెటాలియన్‌
‘ఈనాడు’తో ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ జేవీ రాముడు
ఈనాడు - హైదరాబాద్‌
మ్మడి రాష్ట్రంలో పోలీసు శాఖలోని ఇంచుమించు అన్ని విభాగాల్లోనూ పనిచేసిన అనుభవం ఆయనది. ముక్కుసూటి తత్వం. నిజాయతీ పరుడనే పేరు. వామపక్ష తీవ్రవాదం ఉద్ధృతంగా ఉన్న క్లిష్టమైన రోజుల్లో అనేక కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనకు పోలీసింగ్‌పై మంచి పట్టుంది. సిబ్బందితో సమర్థంగా పనిచేయించుకోగలిగే నేర్పు ఉంది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అవసరాలను కేంద్రానికి నివేదించడంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఇప్పుడు డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనే జేవీ రాముడు. కొత్త రాష్ట్రంలో పోలీసుశాఖను నిర్మించే బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రతి క్షణాన్ని అందుకోసమే వెచ్చిస్తున్నారు. అవసరాలు గుర్తించి, వాటికి కావాల్సిన నిధులు సమకూర్చుకునేందుకు గట్టి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు శాఖ ఎలా ఉండబోతుంది? పోలీసుల ముందున్న సవాళ్లు ఏమిటి? తదితర అంశాలపై ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో ముచ్చటించారు.

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఇందులో పోలీసుశాఖ అధిపతిగా మీ భాగస్వామ్యం ఏమిటి?
ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్విరామంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మేమూ పనిచేయాలి. ఇందులో కచ్చితంగా మా భాగస్వామ్యం ఉంటుంది. అయితే కొత్త రాష్ట్రం. అంతా కొత్తగా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. అయితే అవి అధిగమించలేనివయితే కాదు. తొలుత రాజధాని ఎక్కడో తేలాలి. అప్పుడు అక్కడ పోలీసు ప్రధాన కార్యాలయం, ఇతర కార్యాలయాలు నిర్మించుకోవాలి. జిల్లాల్లో పరిస్థితి అయితే పెద్దగా మార్పు ఉండదు. మంచి పోలీసింగ్‌ ఇవ్వడానికి ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నాం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వద్ద ఎన్నో ఆలోచనలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖను ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? మీకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏమిటి?
ఇప్పుడు మాకు ఉన్న ప్రధాన సమస్య మౌలిక వసతులు. ఉమ్మడి రాష్ట్రంలోని 60 శాతం పరిధి ఇప్పుడు ఆంధప్రదేశ్‌కు వచ్చింది. సమస్యల విషయానికి వస్తే పాతవే ఉన్నాయి. శాంతిభద్రతలు అదుపులో ఉంచడం.. నేరాలు తగ్గించడం.. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం వంటివాటిని అణచివేయాలి. దైనందిన పరిపాలనలో ప్రభుత్వానికి ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులు హాజరు కావాలి. విద్యుత్తు ఉద్యమాలు, నీటి కోసం పోరాటాలు వంటివి వచ్చినప్పుడు ఒక స్థాయి ఒకరూ ఫర్వాలేదు.. కానీ, పరిధి దాటితే కచ్చితంగా పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి ఉంటుంది. పరిస్థితిని అదుపు చేయాల్సి ఉంటుంది.

రాష్ట్రానికి ఒకవైపు ఒడిశా, మరోవైపు ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దులుగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలు ఉద్ధృతంగా ఉన్నాయి. దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు?
సరిహద్దులనేవి పోలీసులకు మాత్రమే. నేరగాళ్లకు కావు. మావోయిస్టులనే కాదు.. నేరగాళ్లు ఎవరైనా సరిహద్దులతో సంబంధం లేకుండానే నేరాలకు పాల్పడుతుంటారు. వీరి ఆగడాలు కట్టడి చేయడం, పట్టుకోవడం, చట్టపరంగా శిక్షించడం అనేది పోలీసుల దైనందిన విధుల్లో భాగమే. ఇక మావోయిస్టు తీవ్రవాదం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కాదు తెలంగాణకు కూడా ఆయా రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో మొదటి నుంచీ అన్ని రాష్ట్రాలతో సమన్వయంతోనే వెళ్తున్నాం. పైగా కేంద్రం దీనికి కొన్ని నిర్దుష్ట విధానాలు రూపొందించింది. దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటాం. వామపక్ష తీవ్రవాదాన్ని కచ్చితంగా అదుపులో ఉంచుతాం.

చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం దొంగలు పెట్రేగి పోతున్నారు. పోలీసులు, ప్రభుత్వ సిబ్బందిపైనే దాడులకు దిగుతున్నారు. దీన్ని ఎలా ఎదుర్కొంటారు. ఇందుకు ఏదైనా ప్రత్యేక వ్యూహం ఉందా?
ఇది చాలా తీవ్రమైన సమస్య. ఎర్రచందనం అక్రమ రవాణాపై మొదట్లో మాకు ఇంత అవగాహన లేదు. కానీ దీన్ని తొవ్వేకొద్దీ ఆశ్చర్యపరిచే కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్దపెద్ద స్మగర్లు ఇందులో పాలుపంచుకుంటున్నారు. నిజానికి ఎర్రచందనం ప్రపంచంలో శేషాచలం అడవుల్లో మాత్రమే దొరుకుతుంది. ఇది అమూల్యమైన సంపద. దీన్ని స్మగర్ల బారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. లేకపోతే భవిష్యత్‌ తరాలు క్షమించవు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా నిక్కచ్చిగా ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ రవాణా అడ్డుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టాం. మూలాల్లోకి వెళ్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీరప్రాంతం ఉంది. కానీ మెరైన్‌ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయడం మందకొడిగా జరుగుతోంది. మెరైన్‌ పోలీసు విభాగాన్ని పటిష్టపరిచే చర్యలు కూడా చురుగ్గా సాగడంలేదు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?
నిజమే! మెరైన్‌ పోలీసు విభాగాన్ని పటిష్టపరచాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలు చేపట్టాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం. ప్రత్యేకంగా ఒక మెరైన్‌ పోలీసు బెటాలియన్‌ ఏర్పాటు చేయాలని కోరాం. దాంతోపాటు మెరైన్‌ పోలీసులకు అవసరమైన స్పీడ్‌బోట్లు వంటి మౌలిక వసుతులు కల్పించమన్నాం. తూర్పుతీరంలో మెరైన్‌ పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు మచిలీపట్నంలో అకాడమీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం 300 ఎకరాల స్థలం కూడా సేకరించాం.

సిబ్బంది సమస్య చాలా తీవ్రంగా ఉంది? ఉద్యోగుల విభజన పూర్తిగా జరగలేదు. ఉన్నవారికీ మౌలిక వసతులు లేవు. దీని ప్రభావం పోలీసుల దైనందిన విధులపైన పడుతోంది. దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు?
ఇలాంటి సమస్యలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోనే రాష్ట్ర పోలీసు శాఖకు అవసరమైన మౌలిక వసుతుల కల్పనకు కేంద్రం సాయం చేయాలని ఉంది. పద్నాలుగవ ఆర్థిక సంఘం, ప్రణాళికా సంఘం వంటివాటి ద్వారా నిధులు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందుకు అనుగుణంగానే అంచనాలు రూపొందిస్తున్నాం. ముఖ్యమంత్రి ఆలోచనలకు తగ్గట్టుగా దీటైన మౌలికవసతులు కల్పించుకుంటాం. భవనాలు, వాహనాలు, ఆయుధాలు, సమాచార వ్యవస్థ.. ఒకటేమిటి పోలీసుల విధి నిర్వహణకు అవసరమైన సర్వం సమకూర్చుకోవాలి. ఈ దిశగా కృషి చేస్తున్నాం.

రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ వంటివాటిలో సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. వీటని నియంత్రించే విషయంలో మీరు అనుసరించే వ్యూహం ఏమిటి?
నిజమే! ఆర్థిక నేరాలు మిగతా నేరాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. వీటిని కచ్చితంగా నియంత్రించాల్సిందే. ఇందుకోసం సీఐడీని బలోపేతం చేస్తాం. చిట్‌ఫండ్లు ఇతరత్రా ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెడతాం.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

ఏప్రిల్‌ 1న లడ్‌కీ.. లడ్‌కా.. షురూ..

అర్జున్‌ కపూర్‌, కరీనా కపూర్‌ జంటగా తెరకెక్కుతున్న ‘కీ అండ్‌ కా’ చిత్రాన్ని ఏప్రిల్‌ 1న విడుదల చేయనున్నట్లు .............

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net