Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
ప్రత్యేక హోదా ఖాయం... సాయం పరిమాణంపై కసరత్తు
మళ్లీ కేబినెట్‌కు వెళ్లాల్సి ఉంటుంది
ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌
ఈనాడు, న్యూఢిల్లీ: ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పిస్తూ గత మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకొంది. ఇది కచ్చితంగా అమల్లోకి వస్తుంది. ఎంత పరిమాణంలో సాయం అందించాలన్నదానిపై ప్రణాళిక సంఘం కసరత్తు చేస్తుంది. రాష్ట్రానికి ఉన్న వనరులు, ఆదాయ-వ్యయాలు, ప్రణాళికేతర వ్యయంలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని దీనిపై ఓ నిర్ణయానికి వస్తారు. ఇదివరకటి ఆంధ్రప్రదేశ్‌కు సాధారణ కేంద్ర సాయం అందేది. కానీ ఇప్పుడు అది రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. అత్యధిక ఆదాయ వాటా తెలంగాణకు వెళ్తొంది. హైదరాబాద్‌లో వచ్చే ఆదాయాన్నంతా దానికే కేటాయించారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయం తగ్గిపోయింది. అందువల్ల దానికి ప్రత్యేక సాయం అవసరం. ఆ సాయం ఎంతమేర ఉండాలన్న దానిపై ప్రణాళిక సంఘం కసరత్తు చేస్తుంది’ అని ఆ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా పేర్కొన్నారు.

మళ్లీ కేంద్రం ముందుకెళ్తుంది... ‘నేను ఇప్పుడు ప్రణాళిక సంఘంలో లేను. అందువల్ల అంతర్గతంగా ఏం జరుగుతుందో చెప్పలేను. నేను ఉన్నప్పుడు పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన హామీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రివర్గం సీమాంధ్రకు (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌కు) అయిదేళ్లపాటు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయాలని ప్రణాళిక సంఘాన్ని కోరింది. చట్టంలో చెప్పినట్లుగానే దీనికోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశాం. అది ఇప్పటికీ పనిచేస్తోంది. నాకు తెలిసి అపాయింటెడ్‌ డే అమల్లోకి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రివర్గం ముందుకెళ్తుంది. ప్రత్యేక హోదా కింద ఎంత సాయం కావాల్సి వస్తుందన్నది ప్రణాళిక సంఘంలోని ప్రత్యేక సెల్‌ గుర్తిస్తుంది. ఉమ్మడి ఆదాయాన్ని 2 రాష్ట్రాల మధ్య ఎంత పంచారు, ఖర్చులు ఎలా ఉన్నాయో చూస్తుంది. ప్రత్యేక హోదాకు ఎన్డీసీ అనుమతి అవసరంలేదు. ఉత్తరాఖండ్‌ విషయంలో తొలుత మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. ఆతర్వాత ఎన్డీసీ దానికి ఆమోదం తెలిపింది’ అని వివరించారు.

ఆర్థిక ఇబ్బందులను బట్టి సాయం... రాష్ట్రానికున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి ప్రణాళిక సంఘం కేంద్ర సాయానికి సిఫార్సు చేస్తుందని ఆహ్లువాలియా పేర్కొన్నారు. ‘గాడ్గిల్‌ సూత్రం ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు సాయం అందిస్తుంది. ప్రత్యేకహోదా పొందిన రాష్ట్రాలకు వాటికున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని అధిక సాయం అందిస్తుంది. ఆ రాష్ట్రాల్లో చేపట్టే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు రాష్ట్రాలు పది శాతం వాటా సమకూరిస్తే మిగతాది గ్రాంట్‌ రూపంలో వస్తుంది. అక్కడి పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించాలన్నదానిపై మంత్రివర్గం చెప్పలేదు. ప్రత్యేక రాష్ట్ర హోదా ప్రకటించినంత మాత్రాన పన్ను మినహాయింపులు వాటంతట అవే వర్తిస్తాయనడానికి ఏమీ లేదు. అది ప్రత్యేక అంశం. దానిపై ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవాలి’ అన్నారు.

అపాయింటెడ్‌ డే తర్వాతే ప్రకటన చేయాల్సి ఉంది... మార్చి 2న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నా ఆ మేరకు ఎందుకు నోటిఫికేషన్‌ జారీ చేయలేదని అడిగిన ప్రశ్నకు మాంటెక్‌సింగ్‌ స్పందిస్తూ ‘అపాయింటెడ్‌ డే తర్వాతే ప్రత్యేక హోదా ప్రకటన చేయాల్సి ఉంది’ అని అన్నారు. ‘ప్రస్తుతం బడ్జెట్‌ సమయం కాబట్టి అన్ని విషయాలపై చర్చ జరుగుతుంది. ప్రత్యేక హోదా ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందో కేంద్రమే చెప్పాలి. ప్రత్యేక సెల్‌ ఇప్పటికే పని ప్రారంభించింది. ఆర్థిక శాఖతో రెండుసార్లు భేటీ కూడా అయింది’ అని చెప్పారు.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net