Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
రవాణా పన్నుతో ధరలకు రెక్కలు
పప్పుల నుంచి ఐస్‌ క్రీముల వరకు అన్ని రకాల సరకులపైనా ప్రభావం
సిమెంటు నుంచి నాపరాళ్ల వరకు..
తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా పన్నులు పెంచడమే కారణం
ఈనాడు - హైదరాబాద్‌
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాల పట్టుదల ప్రభావం పరోక్షంగా జనసామాన్యంపై తీవ్రంగా పడుతోంది. ఒకరి తరువాత మరొకరన్నట్లు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాలు రవాణా పన్ను విధించటంతో అసలే చుక్కలు చూస్తున్న నిత్యవసర సరకుల ధరలు మరింత భారమయ్యాయి. ప్రయాణ ఛార్జీలు పెరగడంతో రెండు రాష్ట్రాల మధ్యా ప్రజల రాకపోకలు కూడా భారంగా మారాయి. టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వాలకు నియంత్రణ లేకపోవటంతో ప్రైవేటు ఆపరేటర్లు ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఆర్టీసీ కూడా డిమాండు ఉన్న మార్గాల్లో ప్రయాణికుల నుంచి దండుకుంటోంది. పప్పుల నుంచి వంట నూనెల వరకు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల నుంచి గృహ నిర్మాణంలో వినియోగించే సిమెంటు, స్టీలు, షాబాద్‌ బండల వరకు వరకు ధరల పెరుగుదలకు ఈ పన్నుల కారణమయ్యాయనటంలో సందేహం లేదు. ప్రభుత్వాలకు ఆదాయం గణనీయంగా వస్తున్నా ప్రజల కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుంది.

120 రకాల వస్తువుల రాకపోకలు
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య 120 రకాల ఉత్పత్తుల రాకపోకలు సాగుతున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉభయ రాష్ట్రాలు జారీ చేసిన వే బిల్లుల ఆధారంగా అధికారులు ఈ జాబితాలను రూపొందించారు.
* వాటిలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌ 42 రకాల ఉత్పత్తులు వెళ్తున్నాయి. ఇవి తెలంగాణను నుంచి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు రవాణా అవుతున్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు 21 ఉత్పత్తులు రవాణా అవుతున్నాయి. ఇవి కేవలం ఆంధ్రా నుంచి మాత్రమే తెలంగాణకు వస్తున్నాయి.
* మిగిలిన 57 రకాల ఉత్పత్తులు రెండు రాష్ట్రాలు అటూఇటు రవాణా చేస్తున్నాయి. వాటిలో సిమెంటు, వివిధ రకాల వంటనూనెలు, గోధుమలు, గోధుమ ఉత్పత్తులు, పప్పుదినుసులు, ఆటోమోబైల్‌ విడిభాగాలు, బంగారం, బొగ్గు, ఔషధాలు, గ్రానైటు, సిమెంటు, ఎలక్ట్రికల్‌ వస్తువులు, ఎరువులు, ఇనుము, ఉక్కు, రెడీమేడ్‌ వస్త్రాలు తదితరాలు ఉన్నాయి.

తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్లే వస్తువులు...: వివిధ రకాల ఖనిజాలు, వ్యవసాయంలో వాడే రసాయనాలు, సౌందర్యోత్పత్తులు, వాహనాల టైర్లు, ట్యూబులు, వివిధ రకాల ఇంజిన్‌ ఆయిల్స్‌ (లూబ్రికెంట్స్‌), డిష్‌ టీవీ, సెట్‌టాప్‌ బాక్స్‌లు, తారు, శీతల యంత్రాల పరికరాలు, హార్డువేర్‌, ఇళ్ల నిర్మాణంలో వినియోగించే కొన్ని రకాల బండలు, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, ఐస్‌క్రీములు తదితరాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు వచ్చే వస్తువులు...: వాటిల్లో రాతినార (ఆస్బెస్టాస్‌), బల్క్‌ డ్రగ్స్‌, జిప్సం, కాస్టిక్‌ సోడా, ఇనుప ఖనిజం, సున్నపు రాయి, వివిధ రకాల లిక్విడ్‌ గ్యాస్‌లు, ప్లాస్టిక్‌ చెప్పులు, పండ్ల ఆధారిత ఉత్పత్తులు, సాఫ్ట్‌ డ్రింక్స్‌ తదితరాలు ఉన్నాయి.

ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం: వివిధ దేశాలకు చేసే ఎగుమతులు, ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై రవాణా పన్ను ప్రభావం భారీగానే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు, దిగుమతుల్లో ఎక్కువభాగం కాకినాడ, విశాఖపట్నం, కష్ణపట్నం పోర్టుల ద్వారా సాగుతున్నాయి. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా కొన్ని రకాల ఉత్పత్తులు దిగుమతి అవుతున్నప్పటికీ వాటి శాతం కొంతే. పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతుల కోసం రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తుంటాయి. వందల సంఖ్యలో లారీలు రెండు పోర్టులకు రాకపోకలు సాగుతుంటాయి. రైల్వే ద్వారా కూడా చాలా ఉత్పత్తులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఉభయ రాష్ట్రాలు విధించిన పన్నులతో రవాణా పరిశ్రమపై ప్రభావం తీవ్రంగా ఉందని తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.భాస్కరరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. దీనివల్ల ఛార్జీలను పెంచకతప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనివల్ల రెండురాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే లారీల వ్యాపారం దెబ్బతింటుందన్నారు. ఎగుమతి, దిగుమతిదారులు జాతీయ పర్మిట్లు ఉన్న లారీలపై మొగ్గుచూపుతారని చెప్పారు. రైల్వేల వైపూ మళ్లే అవకాశం ఉందన్నారు. దీంతో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న పరిశ్రమ పరిస్థితి రవాణా పన్నుతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారుతుందని అన్నారు.

చెల్లించక తప్పని పరిస్థితి: పన్ను చెల్లింపుపై సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయటంతో పన్ను చెల్లించేందుకు యజమానులు ముందుకురాక తప్పడంలేదు. ఏటా ఏప్రిల్‌ 1 నుంచి పన్ను చెల్లింపు విధానం ఆరంభం అవుతుంది. ఇటీవల వరకు ఆచితూచి వ్యవహరించిన ప్రైవేటు వాహనదారులు ఒక్కరొక్కరుగా పన్ను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. కొన్ని సంస్థలు సర్వీసులను తగ్గించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే వాహనాల ద్వారా తెలంగాణ సర్కారుకు ఇప్పటి వరకు సుమారు రూ. 5.50 కోట్ల పన్నుల వసూలైంది. ఇందులో రూ. 4.25 కోట్లు ప్రైవేటు బస్సుల ద్వారా రాగా, మిగిలిన మొత్తం లారీల ద్వారా వచ్చిందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net