Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
పరిపూర్ణం
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణకు చట్టబద్ధత
రాజపత్రంలో ముద్రితమైన 71 పేజీల యాక్ట్‌
ఈనాడు, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంకంలో మరో కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్ర విభజన బిల్లు ఇప్పుడు చట్ట రూపం సంతరించుకుంది. ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014కు శనివారం రాష్ట్రపతి ప్రణబ్‌ ఆమోదముద్ర వేసిన వెంటనే మినిస్ట్రీ ఆఫ్‌ లా అండ్‌ జస్టిస్‌ దీన్ని భారతీయ రాజపత్రం (ద గెజెట్‌ ఆఫ్‌ ఇండియా)లో ‘ద ఆంధ్రప్రదేశ్‌ రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌-2014’ పేరుతో ముద్రించి దానికి చట్టబద్ధ హోదా కల్పించింది. పార్లమెంటు ఆమోదం పొందిన ఈ చట్టానికి 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. ఇది ఆదివారం వెలుగులోకి వచ్చింది. రిజిస్టర్డ్‌ నెం. డీఎల్‌-(ఎన్‌)04/ 0007/2003-14 పేరుతో 71 పేజీల చట్టాన్ని గెజిట్‌లో పొందుపరిచారు. అయితే రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రకటన రూపంలో చేసిన వాగ్దానాలేవీ ఇందులో చేర్చలేదు. అపాయింటెడ్‌ డేని కూడా పేర్కొనలేదు. ప్రధాని చేసిన వాగ్దానాల్లో అవసరమైన వాటికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినెన్స్‌లు జారీచేయనుంది. అపాయింటెడ్‌డేకు సంబంధించి కేంద్ర హోంశాఖ మరో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేయనుంది. ప్రస్తుతం సాంకేతికంగా రాష్ట్ర విభజన జరిగిపోయినా అపాయింటెడ్‌ డే నుంచి వాస్తవికంగా అది అమల్లోకి రానుంది.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net