Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
జగన్‌ మేతకు జగతే సాక్షి!
రుజువైతే ప్రతి సెక్షన్‌ కింద ఏడేళ్ల శిక్ష!
దండు నారాయణరెడ్డి
ఈనాడు  హైదరాబాద్‌
సువర్ణాంధ్రను ‘స్కామాంధ్ర’గా మార్చి..
తెలుగునేల జీవనాడులను నిస్సిగ్గుగా కొల్లగొట్టి..
ప్రజాస్వామ్యం మాటున ప్రజల ఆస్తులను భారీగా లూటీ చేసి..
దేశ రాజకీయ యవనికపై ఒక నీచాతినీచమైన..
ప్రమాదకరమైన దోపిడీ సూత్రాన్ని ఆవిష్కరించి.. మన తెలుగువాడి పరువును దేశం నడిబజారులో పడేసి.. తీరాంతరాల్లో ఉన్న తెలుగులు సైతం తలవంచుకునేలా చేసింది..
ఇదీ ‘రాజన్న’ మార్కు రాజకీయ తంత్రం!
జగతిలోకి మొత్తం పెట్టుబడులు రూ.1246 కోట్లు. అందులో బయటి వసూళ్లు రూ.1173 కోట్లు
జగన్‌ పెట్టింది కేవలం రూ.73 కోట్లు.
కానీ కంపెనీలో 70% వాటా ఆయనదే!
94% డబ్బు పెట్టిన వారికి దక్కింది 30% వాటా!
తండ్రి అధికారం అండగా.. దోపిడీ అధికారికంగానే సాగిందని చెప్పేందుకు ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి?
ఇదే మాట చెప్పింది సీబీఐ.. జగతి కేసులో..
జగన్మోహనరెడ్డిపై దాఖలు చేసిన ఛార్జిషీటులో!
ఇప్పుడీ కుతంత్రాల కుమారులకా మనం ఓటేసి.. అధికారాన్ని అప్పగించేది? ఈ పేనులకా మనం పెత్తనం ఇచ్చేది??

సీఎం హోదాలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ వైఎస్‌ పిలుపిస్తారు.
వచ్చిన వాళ్లను ముందు కొడుకు కంపెనీలో పెట్టమంటారు! లేదంటే బెదిరిస్తారు.
అంతే.. బంతి బుట్టలో పడుతుంది! ఖతం!!
ఆ పెట్టింది ఇక.. గోడకు కొట్టిన సున్నం!!
ఇదీ అవినీతి పుత్రిక.. ‘జగతి’ పుట్టుక!
ఇది అధికారం మాటున సాగిన అరాచకానికి సాక్షి!


వైఎస్‌ అధికార చక్రం తిప్పుతూ పారిశ్రామిక వేత్తలను బుట్టలో వేస్తుంటే.. వాళ్ల నుంచి భారీగా సొమ్ము కొల్లగొట్టి.. ఆ మొత్తాన్ని జగతిలో పెట్టుబడుల్లా చూపించారని సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొల్లగొట్టిన సొమ్ము దోచుకునేందుకు జగన్మోహనరెడ్డి ఒక ఖాతాకు బదులుగా ఒక కంపెనీనే తెరిచారు. దానిపేరు జగతి పబ్లికేషన్స్‌. అద్దాల గదుల్లో పుట్టే అబద్ధాల పత్రిక ‘సాక్షి’ని ప్రచురించేది ఈ సంస్థే. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికార చక్రం తిప్పుతూ పారిశ్రామిక వేత్తలను బుట్టలో వేస్తుంటే.. వాళ్ల దగ్గర నుంచి భారీగా సొమ్ము కొల్లగొట్టి.. ఆ మొత్తాన్ని ఈ సంస్థలో పెట్టుబడుల్లా చూపించారని జగన్మోహనరెడ్డిపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటులో స్పష్టంగా నేరారోపణ చేసింది. అందుకు సాక్ష్యం దాదాపు రూ.1173 కోట్లు పెట్టుబడి పెట్టినవారికి జగతిలో దక్కింది 30 శాతం వాటానే. కానీ జగన్‌కు చెందిన కార్మెల్‌ ఏసియా హోల్డింగ్స్‌ కేవలం రూ.73 కోట్లు పెట్టుబడి పెట్టి 70% వాటాను సొంతం చేసుకుంది. ఈ వాటాలు దక్కించుకోవడం, పెట్టుబడి దారులను బెదిరించి తమ దగ్గరకు రప్పించటం వంటి వ్యవహారాల్లో జగన్‌కు కుటుంబ ఆడిటర్‌ విజయసాయిరెడ్డి పూర్తిస్థాయిలో చక్రం తిప్పారు.
జగన్‌పై సెక్షన్లు ఇవీ..
పీసీ సెక్షన్‌ 120-బి రెడ్‌విత్‌ 420 కింద జగన్‌పై అభియోగాన్ని కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంది. అనైతికంగా ఆస్తిని బదలాయించేలా ప్రేరేపించడం, మోసం చేయడానికి కుట్రలు చేయడం, మరో వ్యక్తి నుంచి మోసపూరితంగా, దురుద్దేశంతో లేదా ప్రలోభపెట్టి ఒకరి ఆస్తిని తీసుకోవడం. మరొకరికి చెందిన ఆస్తి రూపు రేఖలు మార్చడం, ధ్వంసం చేయడానికి ప్రేరేపించడం వంటి ఆరోపణలకు సంబంధించి ఈ సెక్షన్‌ కింద కేసును నమోదు చేస్తారు. ఇది రుజువైతే జగన్‌కు ఏడేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.
 
 
ఐపీసీ 420:
మోసం. ఏ వ్యక్తి అయినా మరో వ్యక్తిని మోసపూరితంగా, దురుద్దేశంతో, ప్రలోభపెట్టడం ద్వారా ఆస్తి, డబ్బు కొట్టేయడం, ప్రేరేపించడం ద్వారా ఇతరులకు చెందిన ఆస్తుల రూపురేఖలు మార్చడం, ధ్వంసం, తారుమారు చేయడం వంటివి మోసంగా ఈ సెక్షన్‌ కింద పరిగణించవచ్చు. ఈ సెక్షన్‌ కింద కోర్టు విచారణకు తీసుకున్న అభియోగం రుజువైతే ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించొచ్చు.
 
 
ఐపీసీ 471:
ఫోర్జరీ పత్రాన్ని నిజమైన పత్రంగా సమర్పించడం. ఫోర్జరీ అన్న విషయం తెలిసీ దురుద్దేశపూర్వకంగా వినియోగించడం తదితరాలు ఈ సెక్షన్‌ పరిధిలోకి వస్తాయి. ఇది రుజువైతే ఏడేళ్ల వరకు జైలు, జరిమానా విధించొచ్చు.
పుట్టుకలోనే మాయ
2006 నవంబరు 14న విజయసాయిరెడ్డి వ్యవస్థాపక డైరెక్టర్‌/ఛైర్మన్‌గా జగతి పబ్లికేషన్స్‌ ఏర్పాటైంది. 2007 జూన్‌ 21న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి డైరెక్టర్‌గా నియమితులై 2011 ఫిబ్రవరి వరకు కొనసాగారు. కంపెనీ చట్టం ప్రకారం ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలోకి డైరెక్టర్లు, కంపెనీతో సంబంధంలేని బయటి వ్యక్తుల పెట్టుబడులను అనుమతించ కూడదు. అయితే నిబంధనలకు విరుద్ధంగా బయటి వ్యక్తులు జగతిలో పెట్టుబడులు పెట్టేలా జగన్‌ ప్రేరేపించారు. ఇందుకోసం పెట్టుబడిదారులను మభ్యపెట్టి తప్పుదారి పట్టించేందుకు కంపెనీ విలువ మదింపులో అక్రమాలకు పాల్పడ్డారు. జగతి విలువ మదింపు నిమిత్తం డెల్లాయిట్‌ సంస్థను నియమించారు. విజయసాయిరెడ్డి మోసపూరితంగా తప్పుడు సమాచారం ఇచ్చి.. సంస్థ విలువను చాలా ఎక్కువ చేసి రూ.3050 కోట్లుగా నివేదికను తెప్పించారు. అదీ అప్పటికే లాగించిన పెట్టుబడులను సమర్థించుకునేందుకు పాత తారీఖుతో తెప్పించారు. నిజానికి సాయిరెడ్డి, డెల్లాయిట్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ నివేదికను బయటి వ్యక్తుల నుంచి పెట్టుబడులు రాబట్టడానికి ఉపయోగించకూడదు. ఈ నివేదికను అడ్డం పెట్టుకుని సాయిరెడ్డి పలువురు వ్యాపార వేత్తల నుంచి నిధులు రాబట్టారు. నిజానికి పెట్టుబడిదారులను ఆకర్షించేవేవీ జగతిలో లేవు. జగతి ఆస్తులు కేవలం రూ.243.64 కోట్ల విలువ చేసే యంత్రాలు మాత్రమే. జగతి పబ్లికేషన్స్‌ ప్రచురించే ‘సాక్షి’ పత్రిక కార్యాలయాలున్న భూమి, ఆ భవనాలను కూడా జగన్‌కే చెందిన మరో అనుబంధ సంస్థ నుంచి లీజుకు తీసుకున్నవి. పెట్టుబడులు రావటం వెనుక అధికార దుర్వినియోగం, కుట్రలున్నాయని సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది.
కన్నన్‌కు సున్నం
హైదరాబాద్‌లో దక్షిణ భారత మిల్లు యజమానుల సంఘం సమా„?ేశం. పెట్టుబడులతో రండంటూ వైఎస్‌ ఘనంగా పిలుపిచ్చారు. పాపం.. లోగుట్టు కన్నన్‌కేం తెలుసు.. సిమెంటు పరిశ్రమ పెడతానంటూ ముందుకొచ్చారు. అంతే చేప దొరికింది! కన్నన్‌ జయలక్ష్మి టెక్స్‌టైల్స్‌ సంస్థ అధినేత. కర్నూలు జిల్లాలో జయజ్యోతి సిమెంట్స్‌ పెట్టేందుకు లైసెన్సుల వంటివన్నీ సమకూర్చుకున్నారు. ఇంతలో విజయసాయి రెడ్డి రంగంలోకి వచ్చారు. జగన్‌ కంపెనీకి పెట్టుబడులు సమర్పించమన్నారు. బిత్తరపోయిన కన్నన్‌ నిబంధనల ప్రకారం పత్రాలన్నీ సక్రమంగానే ఉన్నాయి కదా! అన్నారు. రాష్ట్రంలో ఏ ఇబ్బందీ లేకుండా వ్యాపారం చేసుకోవాలనుందా? లేదా? అయితే జగన్‌ కంపెనీకి ‘పెట్టుబడి’ సమర్పించుకోక తప్పదని బెదిరింపుల పురాణం విప్పారు సాయిరెడ్డి. విధిలేని పరిస్థితుల్లో కన్నన్‌.. జగన్‌ కంపెనీ ‘జగతి పబ్లికేషన్స్‌’కు రూ.5 కోట్లు ముట్టజెప్పుకొని దణ్ణం పెట్టారు. అదింక గోడకు కొట్టిన సున్నమే!
మాధవుడే దిక్కు
దుబాయిలో ఇండియన్‌ బిజినెస్‌ అసోసియేషన్‌ పెట్టుబడుల మేళా నిర్వహించింది. యథాప్రకారం పెట్టుబడులతో రాష్ట్రానికి రండంటూ వైఎస్‌ పిలుపిచ్చారు. ఆ సదస్సులో పాల్గొన్న బెంగళూరుకు చెందిన ఎన్నారై మాధవ్‌ రామచంద్రకు కొద్ది రోజుల తర్వాత ఫోన్‌ వెళ్లింది. చేసింది విజయ సాయిరెడ్డి. ‘జగతి పబ్లికేషన్స్‌ సంస్థ త్వరలో పబ్లిక్‌ ఇష్యూకు వెళ్తొంది, పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయంటూ’ ఫోన్లోనే వూరించారు. తోడుగా- ఉన్నదాన్ని ఎక్కువ చేసి చూపించిన ‘డెల్లాయిట్‌’ నివేదిక పంపించారు. దీంతో మాధవ్‌ రూ.10 కోట్లను తమ కంపెనీ నిధుల నుంచి, మరో స్నేహితుడి నుంచి రూ.9.66 కోట్లు రుణంగా తీసుకుని మొత్తం రూ.19.66 కోట్లు తెచ్చి జగతిలో పెట్టారు. దిగింతర్వాత తెలిసింది.. నిండా మునిగామని! పెట్టింది వెనక్కి తీసుకుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం సున్నా. జగతి పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లిందీ లేదు.. డివిడెండు దక్కిందీ లేదు!
మళ్లీ కనబడితే ఒట్టు
గతి ప్రతినిధి శ్రీధర్‌ రంగంలో దిగి అరవింద కుమార్‌ దండమూడి నుంచి రూ.10 కోట్ల పెట్టుబడిని జగతిలోకి రాబట్టారు. పెట్టుబడి పెట్టాక అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోడానికి దండమూడి చాలా ప్రయత్నాలు చేశారు. శ్రీధర్‌ను కలవటానికి చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. డివిడెండు గురించి తెలుసుకోటానికి జగతికి ఫోన్‌ చేసినా ‘వారు స్పందించుట లేదు’.
జగన్‌ మార్కు కంపెనీల
మాయాజాలం
* జగతి పబ్లికేషన్స్‌లో 2012 మార్చి 31నాటికి మొత్తం రూ.1246 కోట్ల పెట్టుబడి ఉంది. ఇందులో రూ.1173 (94 శాతం) బయటి వ్యక్తులదే. అయితే కానీ వారికి జగతిలో దక్కిన వాటా మాత్రం 30 శాతమే. మరోవైపు కేవలం రూ.73 కోట్లు పెట్టుబడి పెట్టిన జగన్‌కు చెందిన కార్మెల్‌ ఏసియా హోల్డింగ్స్‌ మాత్రం 70 శాతం వాటాతో యాజమాన్య హక్కులు దక్కించుకోవడం.. వైఎస్‌-జగన్‌లు అనుసరించిన వ్యాపార సూత్రాన్ని చెబుతోంది.

* నిజానికి కార్మెల్‌ ఏషియా నుంచి తెచ్చి పెట్టిన ఈ రూ.73 కోట్లు కూడా బయటి వ్యక్తులు వాటాల కొనుగోలు ద్వారా సమకూర్చిన సొమ్మే తప్ప జగన్‌కు మెజారిటీ వాటా ఉన్న సండూర్‌ పవర్‌ సొమ్ము కాదని సీబీఐ గుర్తించింది.

* అధిక ప్రీమియంతో వాటాల రూపంలో రూ.1200 కోట్లు వసూలు చేసిన జగతి తన పేరుతో ఎలాంటి ఆస్తులనూ కొనలేదు. కనీసం పేపరు ప్రింటింగ్‌ ప్రాంతాల్లో భూమి, భవనాలను కూడా సమకూర్చుకోలేదు. జనని ఇన్‌ఫ్రాకు ప్రధానంగా ఉన్న భూమి, భవనాలను జగతి పబ్లికేషన్స్‌ (సాక్షి)కి లీజుకిచ్చింది. అంటే సాక్షికి కనిపించే ఆస్తులన్నీ ‘జనని ఇన్‌ఫ్రా’ అనే మరో కంపెనీకి చెందినవే. మరోవైపు.. ఈ జగతి, జనని ఇన్‌ఫ్రాలు రెండూ కార్మెల్‌ ఏసియా హోల్డింగ్స్‌కు అనుబంధ కంపెనీలు. ఇక ఆ కార్మెల్‌ ఏసియా అనేది జగన్‌కు ప్రధాన వాటా ఉన్న సండూర్‌ అనే మరో కంపెనీకి అనుబంధ కంపెనీ! అర్థం కాలేదా.. అదే జగన్‌ కంపెనీల మాయాజాలం! అంత పెద్ద స్వాహా సొమ్ము పెట్టేందుకు ఈ మాత్రం తంత్రం తప్పదు మరి!

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

‘ముఠామేస్త్రీ’ రానా

నటుడు దగ్గుబాటి రానా ముఠామేస్త్రీ అయ్యారు. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ప్రసారం కానున్న ‘మేముసైతం’ .........

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net